జీవితంలో నీకొక తోడు దొరకొచ్చు
నాకొక నీడా దొరకొచ్చు ...
కాని మన పరిచయం .....
మరువలేని తీపి జ్ఞాపకం
నిను చేరనీయక విధి శాశిస్తే ...
నీ జ్ఞాపకాలను నేశ్వాశిస్తున్నా!
నువ్వు అందని ఆకాశానివని తెలిసినా!
ఆగని,అలసిపోని,అలను నేనవుతున్నా!
నీ ఊహల చంద్రోదయంతో
నా మానస సరోవరంలో విరిసే
నీ తలపుల కలువలను
ఏమిచేయ్యను ! ! !
ఎవరికివ్వను ! ! !
ఇలలో పరిచయాలు నిషేధించి
కలలో నీతో ఊసులాడుకున్నా !
నువ్వే కొలువైన మది గుడిలో
పరులనడుగు పెట్టనీయలేకున్నా !
నువ్వు తలపుకొచ్చిన ప్రతిసారీ
కంట పొంగే ఏరునాపలేకున్నా!
సరసమైనా తెలియని మనసుకు విరహాన్ని రుచి చూపించావు
నీ పేరే పలకాలనుకునే పెదవులకి
నా చిరునవ్వు నువ్వని ఎలా చెప్పను!
నిను ఆశగా వెతికే చూపులకి
నా కంటి పాప నువ్వని ఎలా చెప్పను!
నాలోని నీ ప్రతి జ్ఞాపకానికి
గుండె చప్పుడే నువ్వని ఎలా చెప్పను!
వసంతాలు నిండిన
నా ప్రేమ మీద కవిత రాయనా?
లేక
చెలి నా చెంత లేదని కలత చెందనా?
మరలిరాని గతంలో ...మరువలేని జ్ఞాపకం ...నీ ప్రేమ!
నీతో గడిపిన క్షణాలను తలచుకొంటూ... నీవు లేని క్షణాలను గడుపుతున్నా...
కలత చెందిన మదిలో మెదిలేను
నీ రూపు ప్రతి సారి...
చెంత చేరవని ఎంత చెప్పినా,
మది నమ్మనంటోంది ఏ ఒక్కసారి...
ఎవరివి నీవు...?
ఏమౌతావు...?
ఎందుకు నన్ను కలవర పెడతావు...
ఏమీ కాని నన్ను కవిని చేశావు...
నా ప్రేమ స్వచ్చమైనది ఐతే
నీవెందుకు నాకు...
నీ జ్ఞాపకం చాలు నాకు...
ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు...
పెదాలు సైతం పలకలేని భావాలు...
నీకు దూరంగా...
ఒంటరి తనానికి దగ్గరగా...
నీ కోసం ఎదురు చుస్తూ...
జ్ఞాపకాలూ ఏదయినా...
అనుభూతులు మిగులుతాయి...
అచ్చం నీ పరిచయం లాగా...
ప్రేమ నన్ను వదలక నా మనసుకు బాధ...
చెలి నన్ను వలచక నా మనసున వ్యధ...
నువ్వు నా చెంత వుండి వుంటే...
ఈ కన్నీళ్లు ఆనంద భాష్పాలు అయ్యేవి...
ప్రపంచానికి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు...
కాని ఒక వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం...
కనుమరుగైనావని ఈ లోకం అంటోంది...
ఒక కధవైనావని నా కన్నీరు అంటోంది...
నా శ్వాస వున్నంత వరకు నీ ఆలాపనే నాలో....
నీ జ్ఞాపకాలే నా ప్రాణం...
వాటితోనే నా ప్రయాణం...
ఏమని చెప్పను,
చేజారి పోయిన కలల గురించా...
నా గుండెను కోసి.....రక్తాన్ని సిరగా చేసి......
అందుకో ప్రియా....ఈ ప్రేమలేఖ(లేక)
గమనిక: ఇది నేను సొంతం గా వ్రాసినది కాదు, కాని మద్యలో కొన్ని పదాలు నా సొంతంగా వ్రాసినవే, నా స్నేహితుడి బుక్ లో చూసే వ్రాసాను, బట్ ఇది మరొకరి బ్లాగ్ లో ఉంది అని కూడా గమనించగలరు
15 మీ మనసులోని మాటలు:
wow bale vrasharu andi chaalaa bagundi
Emayindi pandu garu, mee bujji mimmalni vadili vellipoyinda? Mee pelli kaka mundu nuchi follow avutunnanu mee blog. Konta ma tammudi story kalistu undilendi mee storylo.
Kalyani
thanx for your comment prince gaaaru...
@ kalyani
actually nenu maa bujji kalise untunnamandi.....just entante naa frnd valla lov gurunchi oohistu ila wrasanu anthe, mi tammudi story ento naaku chepte daaniki taggattuga inko post pedatanu.....anyway thanx for your comment andi...
Wow chala nice....i like it....
nice feeling... mee ooha bagundandi...
Than q very much shruti gaaru....
Sorry to say this, ఈ కవితలు నేను ఇంకో బ్లాగ్ లో చదివాను.
@Prerana: Blog peru kuda ivvandi.
ప్రేరణ గారు, నేను అది మా ఫ్రెండ్ బుక్ లో చూసి పెట్టాను, బట్ నాకు పెట్టిన తరువాత తెలిసింది అది ఇదివరకే మరొకరి బ్లాగ్ లో ఉందని........
enko blog lo chusa anaru ga prerana. adi corect.. enduloo maximum 80% tana manasulo matalu kadu.. tanu cheypydi. chysydi very anipistadi. amayi kosam cigret tho polchina tina blog chadavi chusi amayilamyna manm enka down avuthunam andi... tina blog not inspiring... trassshhhhhhhhhhh..... fraddd............
@Anonymous gaaru....
nenu wrasina matter ki aa image set avutundani ala pettesa but ammayini cigret tho maatram polachaledu....kaavalante meeru malli chadavandi.......naa blog not inspiring & traasshhhhh& fraddd antunnaru kadaaa....enduko telusukovaccha......nenemaina mimmalni mosam chesana, leka naa blog emaina mi gurunchi undha, 80% naa manasulo maatalu kaadu annaru kadha, naa manasento meeku telusa, edaina maate ane mundu 100 ki 100% alochinchi pettandi, leda pettadam maaneyandi, anthe gaani naa manobhavalanu debbateeyalani try cheyakandi dayachesi.........hurt ayunte kshaminchandi.....
naaku edaina sare mukku sootiga cheppadam alavaatandi.........evarinaina noppinchi unde kindly excused me.......if anybody hurt-ed am really sorryyyy...........
Very nice, Heart touching quotes.
నీ ప్రేమా లేని నా హృదయం ఉపవాసం తో ఉంది అని, ఙ్ఞాపకాలు అగ్నిల మారి మనసుని కల్చేస్తుంది.
ఉపవాస దీక్ష లోనే హృదయం కాలిపోతూ నీకు చెప్తున్నా చివరి మాట ... నిజంగా నన్ను ఇష్టపడవా !!
A.సోనీ ....🖊️
Post a Comment