RSS

Tuesday, November 29, 2011

నే పలికే పదం నీ పేరు..........





ఈ చిరుగాలిలో నీ గానం ఓ పిల్లనగ్రోవిలా నన్ను కట్టిపడేసింది

ఆ అరుణోదయంలో ఓ కాంతిపున్జంలా నీ అందం నన్ను బంధించింది

నీ ఊహ ఆ సంధ్యాకాలం సమీపించకముందే నన్ను త్వరపడమంది

నా మనస్సు నిన్ను గైకొని మరులుగోలుపు మరులోకానికి చేరుకోమంది


కనులు మూసి నిదురిస్తుంటే కలలో నీ జ్ఞాపకాలు
కనులు తెరిచి చూస్తే కనుల ఎదుట నీ తలపులు

పదములు ఎన్నున్నా అనుక్షణం నే పలికే పదం నీ పేరు
వర్ణములు ఎన్నున్నా క్షణ క్షణం నాకు కనిపించేది నీ రూపము

ఒంటరిగా వెళుతున్నా నాతొనే ఉన్నావు అనుకుంటున్నా నువ్వు
ఎందరితో కలిసి ఉన్న నా తలపులలో విహరిస్తున్నావు నువ్వు

చెంతలేకున్నా నా కన్నులు ప్రతిక్షణం ఎదురుచుసేను నీకై
ఏమి అయిపోతనో తెలియకున్నా వేచి ఉన్నాను నీ పిలుపుకై

కరువు...కరువు





కంటికి నిద్ర కరువయ్యింది,
ఆశకి శ్వాస కరువయ్యింది,
మనసుకి మమత కరువయ్యింది,
వయసుకి వలపూ కరువయ్యింది,
నోటిమాటకు పాట కరువయ్యింది,
నటనమయూరికి ఆట కరువయ్యింది,
ఉదయానికి తూరుపు కరువయ్యింది,
హృదయానికి స్పందన కరువయ్యింది,
చూపుకు గమ్యం కరువయ్యింది,
రేపుకు ఆశ కరువయ్యింది,

నాలో ఏమున్నాలేకున్నా,నువ్వూ నీనవ్వూ ఎప్పటికీ నిలిచేవుంటుంది.
తరచి తరచి నానుండి ఎన్ని వెలికి తీసావు,మరెన్ని దూరంచేసావు !
కానీ....
ఇక నువ్వెంత తరచినా వచ్చేది మిగులున్న నీమీద నాకున్న ప్రేమే !!!

Tuesday, November 22, 2011

నా ప్రాణమైన నీకు




కమ్మగా పాడే కోయిలనడిగాను,

నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని ...

చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,

నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...

వర్షించే మేఘాన్ని అడిగాను ,

నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...

హాయిని పంచే వెన్నెలని అడిగాను ,

ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...

పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,

నీ పరుగు నా కోసమేనా ? అని ...

నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,

నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......

Monday, November 14, 2011

అనుబంధం



పెళ్లి రెండు అక్షరాల పదం
రెండు జీవితాల గమ్యం
రెండు ఆత్మల సంబంధం
ఒక్క పదం తో రెండు జీవితాలను ముడి వేసే బంధం
ప్రతి మనిషి జీవితపు మలుపు పెళ్లి
ప్రతి మనిషికి తన బాద్యతలు తెలిపే అనుబంధం ఈ పెళ్లి
సుఖ దుఖల సంగమం ఈ పెళ్లి
తెలుసుకుని మసలు కుంటే స్వర్గం
ఆజగ్రత చేస్తే నరకం

Friday, November 11, 2011

బలి-పశువును చేసారు.........



 
నిజంగా ప్రేమించి పెళ్ళీ చేసుకోవడం నా అదృష్టమో లేక దురదృష్టమో నాకు తెలిదు,
కాని మా పెళ్లిఅయ్యాక మేము ఇద్దరం బాగానే ఉన్నాము, కాని ఒకరోజు
మా మామ గారు ఫోన్ చేసి మా ఆఫీసు దగ్గరకి వచ్చి మమ్మల్ని కలసి
ఒక మాట చెప్పాడు, అయ్యిందేదో అయ్యింది మీరు ఇద్దరు సుఖంగా ఉండాలంటే
సెపరేట్ గా ఉండండి, అప్పుడు మేము మిమ్మల్ని చూడడానికి వస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అన్నాడు,
కాని పెళ్ళయి రెండు సంవత్సరాలు కావస్తుంది, మాకొక పాపా కూడా పుట్టింది, కాని ఇప్పటి వారకి ఎవరు రాలేదు,
మా మామ గారి మాటలను నేను అప్పుడే నమ్మలేదు కూడా, కాని నా భార్యామణి మాట వల్ల సెపరేట్
అవ్వాల్సివచ్చింది, తను వల్ల ఇంట్లో వాళ్ళు దగ్గరవుతరనే ఉద్దేశంతో అల్లా అన్నది కదా అని నేను సరే అన్నాను.
కాని ఇప్పటి వరకు వల్ల ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు, కనీసం మా పాపను చూడడానికి కూడా రాలేదు
మా బావమరదులు, మామ గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు కాని మా అత్తే ఇంకా కులం కులం అంటుంది
మా వల్లే తన ఆరోగ్యం బాగుందడంలేదని అంటున్నది. కాని ఒకటి మాత్రం నిజం
మా మామ & భార్య వల్ల మాత్రం నేను బలి-పశువును అయ్యాను.

Tuesday, August 30, 2011

వినాయక చవితి శుభాకాంక్షలు

బ్లాగు మితృలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆ పరమాత్ముడు మీ సర్వకార్యములలో విఘ్నాలను తొలగించి
అన్ని రకముల శుభములను, విజయాలను అందిచాలని కోరుకుంటూ
మీ పండు


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిషం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

అన్ని దేవుళ్ళలో వినాయకుడు ప్రథముడు.ఏదైనా ఒక పుణ్యకార్యం తలపెట్టినప్పుడు ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి అంటారు. వినాయకుడు సమస్త విఘ్నాలకు అధిపతి. వాటి నివారణ ఆయన ఆధీనంలో ఉంటుందంటారు.అందువల్లనే సమస్త శుభకార్యాలకు ప్రారంభంలో గణపతి పూజ చేయలంటారు మన పెద్దలు.

వినాయక చవితి సందర్భంగా భక్తులు సకలాభిష్ట సిద్ది కోసం ఈ మంత్రాన్ని చదువుతారు.

గణేశమేకదంతం చ
హేరంబం విఘ్ననాయకం
లంబోదరం శూర్పకర్ణం
గజవక్త్రం గుహాగ్రజం

Friday, August 19, 2011

జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో



మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో వీడిపోని బంధాలెన్నో మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో కవ్వించే కబుర్లెన్నో మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం

Saturday, August 6, 2011

లవ్ గురు







ప్రేమ....రెండు అక్షరాలు, రెండు హ్రుదయాలకు మాత్రమే అర్ధమయ్యే భాష,

ప్రేమ అందరికీ అర్ధం కాదు, ప్రేమించిన వారికి మాత్రమే ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది.

ప్రేమకు కులం లేదు, మతం లేదు, రెండు మనసులు తప్ప,

మీరు కూడా ప్రేమించండి....కానీ ప్రేమను కించపరచద్దు.

ప్రేమను ప్రేమగా పొందండి...కాని బలవంతంగా తీసుకునే ప్రేమ చిరకాలం నిలవదని తెలుసుకోండి

ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా గ్రహించండి

మీ ప్రేమ గురుంచి ఏమిఅయిన డౌట్స్ ఉంటే వెంటనే నన్ను అడిగేయండి,

మీ ప్రేమకు పరిష్కారం నా దగ్గర దొరుకుతుందేమో ప్రయత్నిచండి

Friday, March 18, 2011

నేను MAX NEW YORK LIFE INSURENCE ADVISOR




న్యాయ శాస్త్రం మరియు అర్థ శాస్త్రం ప్రకారం ఆపద వలన సంభవించే నష్టాన్ని నివారించేందుకు ప్రాథమికంగా ఉపయోగించే ఆపద నిర్వహణి, భీమా అంటారు. భీమా అనే దాన్ని ప్రీమియంకు బదులుగా ఒక సంస్థ యొక్క నష్టాన్ని మరొక సంస్థకు సమానంగా బదిలీ చేసేదేగా నిర్వచించవచ్చు మరియు భారీ, సాధ్యమయ్యే నష్టాన్ని నివారించేందుకు చిన్న నష్టంతో సరిచేస్తుంది. భీమాను విక్రయించే కంపెనీని భీమా సంస్థగా ; భీమా కొనేవారిని భీమాదారు లేక పాలసీ కలిగినవారు గా పిలుస్తారు. భీమా పరిధిని పొందడానికి చెల్లించాల్సిన రుసుము అనగా ప్రీమియంను లెక్కకట్టడానికి భీమా నిష్పత్తి ని ఉపయోగిస్తారు. ఆపదను అంచనా వేయటం మరియు ఆపద నివారణను ఆచరణలో పెట్టే ఆపద నిర్వహణ విశేషమైన అధ్యయన రంగంగా అవతరించింది.
మీరు కూడా భీమా తీసుకోవాలంటే వెంటనే నా నెంబర్ కు ఫోన్ చేయండి. 

బి. సతీష్ కుమార్
9989240141
హైదరాబాద్/

Saturday, February 19, 2011

ఇంకా చాలా చాలా



ఇంకా చాలా చాలా విషయాలు మీతో పంచుకోవాలి
కాని ఇప్పుడు అంత సమయం లేదు
వచ్చే నెల 24 కి మా పెళ్లి అయ్యి ఒక సంవత్సరం అవుతది
మా పెళ్లి అయినప్పటినుండి ఇప్పటివరకు చాలా చాలా సంఘటనలు జరిగాయి
అవన్నీ త్వరలో మీతో పంచుకుంటాను......అప్పటివరకు సెలవు మరి.....  

నరకం కనిపించింది



మనం పెళ్లి చేసుకున్న వేళ......
మీవాళ్ళు మావాళ్ళు మనల్ని విడదీయలేక
రౌడిలతో  వెంబడించి
హైదరాబాద్ దాటి పారిపోయేలా చేసారు కదా 
నేను నిన్ను పెళ్లి చేసుకునేముందు ఒక మాట చెప్పాను గుర్తుందా....?
"మన పెళ్ళయ్యాక నిన్ను "మహారాణి"లా చూసుకుంటానని మాటిచ్చాను.
కాని మన పెళ్లి అయిన పది రోజులు నిన్ను "ఫూట్పాత్"  మీద కూర్చోబెట్టి
టిఫిన్ చేయించాను........గట్టిగా ఎడిచేసాను.... అప్పుడు నాకైతే నరకం కనిపించిది.
అసలు మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము
పోలీసు వాళ్ళు కూడా మీ అంతటా మీరు జాగ్రతగా బ్రతకండి అన్నారు
కాని నీ తరపున మీ బావ గారికి......నా తరుపున మా అన్న కి 
మనల్ని ఎందుకు విడదియాలని అనుకున్నారో నాకు ఇంకా అర్ధం అవడం లేదు.

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.......


మన ప్రేమ గెలిచింది
మనల్ని చూసి  ద్వేచించిన పెద్దవాళ్ళే ఇప్పుడు మన ప్రేమను పొగుడుతున్నారు
మన ప్రేమ పెళ్ళవగానే మారిపోతుంది అనుకున్న మీ ఇంట్లో వాళ్లే మన ప్రేమకు స్వగతం చెబుతున్నారు
మన ప్రేమకు పెళ్లి అయ్యి ఒక సంవత్సరం కావస్తుంది
ఇలాగె చిరకాలం మన "ప్రేమ" ప్రేమగా ఉండాలని కోరుకుంటూ
నీకు మన ప్రేమకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.......
 
29501