RSS

Monday, February 27, 2012

ఏది గొప్పది...


చావు దగ్గరైతే తెలిసొస్తుంది బ్రతుకు తీపి
కానీ
నువ్వు దూరమైతే నాకు తెలిసొచ్చింది ప్రేమ తీపి
దూరం మహా చెడ్డదా
లేక ఈ ప్రేమ మహా గొప్పదా అని తెలియకున్నది నాకు



నేను కన్న కలలన్నీ నీ రూపాన నిజమయాయి అనుకున్నాను
కాని కన్నులు దాటి బయటకి రానివే కలలని
నిత్యం కన్నిరుగా కరిగే నా కనులే నాకు చెప్పింది......

చిన్నదేదో....పెద్దదేదో......



నీతో ఉంటే గంటైయనా ఘడియలా గడిచేది
ఈ ప్రపంచంతో పనిలేదు అని పించేది అప్పుడు భ్రమించాను
జీవితం చిన్నదని
జగత్తు పెద్దదని.....

కాని నేడు
నీవు లేక కాలం కధలకున్నది
ప్రతి చోట నీ జ్ఞాపకాలే మేదులుతున్నవి
ఇప్పుడే తెలిసోచ్చెను
జీవితం పెద్దదని
ఈ జగత్తే చిన్నదని.......

శిలగా..........





చూస్తూ ఉన్నాను నిన్నలా
అది కాస్తంతలోనే మారింది నిన్నల
సరేలే దాచుకున్దాము కనురెప్పల్లో
చూసుకోవచ్చులే అనుకున్నా.....
కానీ అది కాలమే చూడలేని కలగా మారింది
అది తెలిసిన నేడు ముందుకి సాగక శిలగా మారింది....

ప్రయాణం....





ప్రతి ప్రయాణం మొదలౌతోంది,
ఇదే మరి ఆఖరి సారి ఔతుందని,
నా ప్రతి ప్రయాణం మొదలౌతోంది,
నే వెతికే నా గమ్యం కోసం,
నను విడిచే నా పరధ్యానం కోసం,
నిను కలిపే ఒక తీరం కోసం,
మది నెంచి, శ్రుతి నుంచి,
వినిపించే, ఒక రాగం కోసం,
నా ప్రతి ప్రయాణం మొదలౌతోంది...

నాకు మీ స్నేహం కావాలి....









నా ఒంటరితనానికి ప్రేమను పంచే అనురాగబంధం నీ స్నేహం.
నా జీవనప్రయాణంలో అలసిపోయి సేదతీరే ప్రతి మజిలి నీ స్నేహం.
బాధలు నిండిన నా చీకటి జీవితంలో ఆనందాల వెన్నెల నీ స్నేహం
పరిచాయలు ఎన్ని వున్న గుండెలో ప్రతిక్షణం వినిపించే స్పందన నీ స్నేహం.
నా ఆలోచనలకు, నా ఇష్టాలకు, నా చిరునవ్వులకు నిలువుటద్దం నీ స్నేహం.
ఏకాతంలో జారే కన్నీరు నీ స్నేహం.... బాధల్లో భుజంతట్టే ఓదార్పు నీ స్నేహం..

నన్ను క్షమించండి......




దేవుడు లేని ఆలయం లేదు...
కెరటం లేని సముద్రం లేదు...
శ్వాస లేని ప్రాణం లేదు...
నీ స్నేహం లేని నేను లేను...
నా ప్రియమైన శివ మరియు శ్రీదేవి...
నేను ఏమైనా తప్పు చేసి ఉంటె నన్ను క్షమించండి
దయచేసి నాతో మాట్లాడండి......
 
29501