RSS

Thursday, April 22, 2010

మా ఇద్దరికీ మళ్ళి పెళ్లి...


మొదట్లో మా పెళ్ళికి ఎవరు ఒప్పుకోలేదు,
పెళ్లి అయిన మొదటి రోజునుండి నా భార్య వాళ్ళ బావగారు (అక్క మొగుడు)రౌడీలను వేస్కొని మాకోసం తిరిగారు,
మేము దొరికితే చంపేద్దాం అనేంత కసితో తిరిగారు
నాకు ఫోన్ చేసి బెదిరించారు....దొరికితే చంపేస్తామని
ఎంత దైర్యం ఉంటే మా కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని...

నా స్నేహితులను బెదిరించారు, ఒకరిని కొట్టారు కూడా.....

కాని ఇప్పుడు మాత్రం మా ఇంట్లో ఒప్పుకున్నారు
ఈ విషయం అమ్మాయి వాళ్ళింట్లో నేను చెప్పేవరకు తెలియదు
వాళ్ళింట్లో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే కాస్త మాట్లాడుతున్నారు
ఇప్పుడైతే మేము ఇద్దరం మా ఇంట్లోనే ఉంటున్నాము
కాని అమ్మాయి వాళ్ళింట్లో వాళ్ళు మాత్రం మమ్మల్ని వేరేగా ఉండమంటూన్నారు
అప్పుడైతేనే వాళ్ళు మాతో మాట్లాడుతూ ఏమైనా సహాయం చేస్తామంటున్నారు
మళ్ళి మంచి రోజు, మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేస్తామంటున్నారు అమ్మయివాళ్ళ మేనమామలు
కాని ఇప్పుడేమో మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఒకేదగ్గర ఉంటున్నాము
ఇప్పుడు మళ్ళి బయట ఉంటాము అంటే మా తల్లిదండ్రులు ఏమంటారో ఏమో...????
ఈ పరిస్తితుల్లో నేను మావాళ్ళతో ఉంటే మంచిదా...లేక బయట ఉంటే మంచిదా????
 

Wednesday, April 14, 2010

భారతీయులం.........


మనం ఎవరము........?
హిందూ...?
ముస్లిం...?
అయితే హిందువు లో ప్రవహించేది ఎర్రటి రక్తమే
ముస్లిం లోను అదే ఎర్రటి రక్తమే ప్రవహిస్తది
 "దివాలి" లో "అలీ" అని ఎందుకు ఉంది?
"రామ్-జాన్" (రంజాన్)" లో  "రాం" ఎందుకుంది?
మనకు కులాలు ముఖ్యం కాదు
మనం భారతీయులం

మొన్న జరిగినా "పాతబస్తీ"  లాంటి గొడవలు మళ్ళి పునరావృతం కాకుండా అందరం ఐఖ్యమత్యంగా ఉందాం
జై హింద్......

Monday, April 12, 2010

ప్రేమే గెలిచింది........


ప్రేమకు కులానికి మద్య జరిగినా పోరులో ప్రేమే గెలిచింది
నేను అనుకున్నది సాదించాను
ఇక్కడ నేను గెలిచాను అనడంకంటే ప్రేమే గెలిచింది అనడం ఉత్తమమం
శ్రీరామ నవమి  రోజు నేను ప్రేమించిన అమ్మాయి(బుజ్జి)ని పెల్లిచేసుకున్నాను
పెళ్ళయిన కొత్తలో ఇద్దరి ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు
కాని ఇప్పుడు మాత్రం మా ఇంట్లో వాళ్ళను ఒప్పించాను
ప్రస్తుతానికి మేము మా ఇంట్లో వాళ్ళతో కలిసి ఆనందంగా ఉంటున్నాము
ఇంకొన్ని రోజ్జుల్లో వాల్లిన్ట్లోవాళ్ళు కూడా ఒప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి
నా ప్రేమను గెలిపించడానికి నా స్నేహితులు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను
 
29501