RSS

Tuesday, January 22, 2013

విభేదం.....



నీ కోసం ఆలోచించే ప్రతి క్షణం....
నా మనసు ఊహలను రెక్కలుగా చేసుకొని విహరిస్తుంది
కాని మరుక్షణం కళ్ళు మాత్రం
ఊహలను చూడలేను నిజాలను తప్ప, అని కన్నీరు పెడుతుంది
అయిన వాళ్ళు అందరున్నా...నా మనసు నిన్నే కోరుకుంటుంది
నీకై నిరీక్షించే నా కన్నులు, నువ్వు కనబడక
నిరాశతో కన్నీరు కారుస్తోంది
ఆ వెచ్చని కన్నీళ్ళ మాటున ఎంత వేదన దాగిఉందో నీకు తెలియదా?
నేను నీతో మాట్లాడాలంటే, నా మనసు మూగబోతుంది
నువ్వు నాతో మాట్లాడితే, నా మాట మౌనమవుతోంది
నీకు నాకు మధ్య శబ్దం....ఎప్పుడు నిశ్శబ్దమే.....
ఇది నిన్ను మబ్య పెడుతునట్లు అనుకుంటే పొరపాటు మాత్రం నాది కానే కాదు,
కేవలం ఇద్దరి మధ్య ఏదో చిన్న విభేదం మాత్రమే...

4 మీ మనసులోని మాటలు:

శృతి said...

mee madya vibedam duram avalani korukuntunnanandi...

తెలుగమ్మాయి said...

ohhhhh....sad mood lo unnara?;)

Unknown said...

శృతి గారు మీరు అన్నట్లుగానే త్వరగా విభేదం దూరం అవాలని నాకు ఉందండి.

Unknown said...

@ తెలుగమ్మాయి
అవునండి SAD అంతా SAD గానే ఉంది

Post a Comment

 
29501