RSS

Friday, January 25, 2013

వరమా...లేక శాపమా.....?



మది కోరి నీకు చేరువైతే, వద్దు పో అని దూరం అవుతావ్ ఎందుకు
నా మది లోని ఆశ, నా మదిలోని శ్వాస నువ్వే అని నీకు తెలియదా ?
నువ్వు-నేను కలిసి గడిపిన కొన్ని తీపి గుర్తులను నేమరవేసుకో ఒక్కసారి
అప్పుడైనా నీ మది నన్ను కోరుకుంటదేమో, నన్ను దూరం చేసుకోవటానికి నేను చేసిన తప్పేంటి
నా ప్రాణం గా నిన్ను ప్రేమించడమా, నువ్వే నా ప్రాణంగా జీవించడమా
ఒక్క క్షణమైనా నిన్ను విడవక పోవడమా, లేక ప్రతి క్షణము నీ వెనకాలే తిరగడమా
నువ్వు మాటలు నేర్చిన కోకిల వనుకున్న.....కాని ఇలా మాటల తూటాలు పెలుస్తావని కలలో కూడా కల కనలేదు  
ఓ ప్రేమ నువ్వు నాకు దొరకడం వరమా...లేక శాపమా.....?

పెద్ద పులి.....






ఎప్పుడూ పులే జింక మెడ ఎందుకు కొరకాలి…
ఏ..
పులికీ మెడ ఉంది ..
జింకకీ నోరు ఉంది ..
మరి జింక పులి మెడ ఎందుకు కొరకదని ఆలోచన వచ్చింది....
అప్పుడు తెలిసింది, పులికి ఆకలెక్కువ, జింకకు భయమెక్కువ అని
భయపడే వాడు రోజు చస్తూనే ఉంటాడు, భయపెట్టే వాడు ఉంటె

అదే ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, నీ అంత పెద్ద పులి ఎవరు ఉండరు....

నువ్వే గెలిచావ్........




నీ ఆలోచనలో ఒక అర్థం ఉంది …
నా జీవితం కొత్తగా తోచింది…
కాలాన్ని ఒక చేతితో…
కష్టాన్ని ఒక చేతితో…
కలిపి నిలిపి జీవితంతొ పరిగెత్తి
కలల్ని వెంటాడి, కష్టాన్ని జతచేసి కాలంతొ నింపేసి…..
కలని నిజం చేసి…
నువ్వు  ఓడి నన్ను గెలిపించావు అనుకున్న…కలలో....
కాని జీవితంలో మాత్రం నువ్వే గెలిచావ్........

Tuesday, January 22, 2013

విభేదం.....



నీ కోసం ఆలోచించే ప్రతి క్షణం....
నా మనసు ఊహలను రెక్కలుగా చేసుకొని విహరిస్తుంది
కాని మరుక్షణం కళ్ళు మాత్రం
ఊహలను చూడలేను నిజాలను తప్ప, అని కన్నీరు పెడుతుంది
అయిన వాళ్ళు అందరున్నా...నా మనసు నిన్నే కోరుకుంటుంది
నీకై నిరీక్షించే నా కన్నులు, నువ్వు కనబడక
నిరాశతో కన్నీరు కారుస్తోంది
ఆ వెచ్చని కన్నీళ్ళ మాటున ఎంత వేదన దాగిఉందో నీకు తెలియదా?
నేను నీతో మాట్లాడాలంటే, నా మనసు మూగబోతుంది
నువ్వు నాతో మాట్లాడితే, నా మాట మౌనమవుతోంది
నీకు నాకు మధ్య శబ్దం....ఎప్పుడు నిశ్శబ్దమే.....
ఇది నిన్ను మబ్య పెడుతునట్లు అనుకుంటే పొరపాటు మాత్రం నాది కానే కాదు,
కేవలం ఇద్దరి మధ్య ఏదో చిన్న విభేదం మాత్రమే...

Saturday, January 19, 2013

చెదరని స్వప్నం.....




అందమైన నా ఊహల మేడకు రూపం నువ్వు
అందీ అందని నా ఆశలకు ప్రతిరూపం నువ్వు
మొదటిసారి నీతో మాట్లాడిన ఘడియ
మొదటి సారి నిన్ను కౌగిలించుకున్న సమయం
మొదటిసారి నువ్వు నాతో బైక్ పై రావడం
నువ్విచ్చిన మొదటి ముద్దు.....
అది నా మదిలో చెదరని స్వప్నం
ఉహకు అందని అందం నీది,
అది అందుకోలేని జన్మ నాది......
నీడనిచ్చిన చెట్టును మరుస్తానేమో....
కాని జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నిన్ను ఎప్పటికి మరవలేను

Saturday, January 12, 2013

సంక్రాంత్రి శుభాకాంక్షలు.....
















పాల పొంగుళ్ళు, రంగుల ముంగిళ్ళు
ఇంటి ముందు ముద్దు గొలిపే బొబ్బిళ్ళు
అందరి గుండెలో ఆనందపు పరవళ్ళు
భాగ్యాలనిచ్చే భోగి...సరదానిచ్చే సంక్రాంత్రి....
పిల్లలు  చేసే గాలి పటాల గోల,
పెద్దలు చేసే తినుభండారాలు,
ఇవన్నీ కలుపుతూ
కొత్త సంవత్సరంలో సరికొత్తగా...
అందరికి ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ
తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచినా
సంక్రాంత్రి పండుగని ఆనందంగా జరుపుకుందాం.
నా బ్లాగ్ మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు ,
అందరికి సంక్రాంత్రి శుభాకాంక్షలు.....

Friday, January 11, 2013

సేవకుడిని....





నీ హంస లాంటి నడక,
నీ నెమలి లాంటి కళ్ళు.
నీ ఎర్రటి దొండ"పండు" లాంటి పెదాలు,
నువ్వు నవ్వితే వెలిగే వెలుగులు
నీ ఒంపు సొంపులు,
నిన్ను ఇలా ముట్టుకోగానే నాకు వచ్చే మత్తు
ఇవంటే నాకు ఎంతో ఇష్టం
నీ అందానికి నేను "సేవకుడిని" ప్రియా......

ప్రేమా......ప్రేమా.....ప్రేమా.....





ప్రేమ అనేది ఒక పక్షి లాంటిది, అది ఎప్పుడు ఎక్కడ వాలుతుందో తనకే తెలియదు,
ఇష్టపడితే ప్రేమించాలి గాని హిమ్సించొద్దు,
ఇష్టం అనేది మనసులోంచి రావాలే గాని బ్రెయిన్ లోనుండి రాకూడదు
ప్రేమలో కసి ఉండాలి....అది ఎలాగంటే నాలా ఇంకెవరు ప్రేమించకూడదు అని,
మనసులో తపన ఉండాలి నువ్వే నా సర్వస్వమని
మనిషికి ఉండేది ఒకే హృదయం, అందులో ఒకరికే చోటు
ప్రేమ అనేది తెగిన గాలి పటం కాకూడదు,
మనం వచ్చే వరకు ట్రైన్ ఆగదు, దాని టైం దానికే,
అలాగే మనకు ప్రేమ పుట్టే వరకు ఆగకూడదు,
మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళని ప్రేమించాలి....
ప్రేమను వెతుకుతూ వెళ్ళకు, ప్రేమే నీ చెంతకు చేరుతుంది.

Friday, January 4, 2013

నా ప్రేమ లేఖ... నీ ప్రేమ లేక.....





జీవితంలో నీకొక తోడు దొరకొచ్చు
నాకొక నీడా దొరకొచ్చు ...
కాని మన పరిచయం .....
మరువలేని తీపి జ్ఞాపకం

నిను చేరనీయక విధి శాశిస్తే ...
నీ జ్ఞాపకాలను నేశ్వాశిస్తున్నా!

నువ్వు అందని ఆకాశానివని తెలిసినా!
ఆగని,అలసిపోని,అలను నేనవుతున్నా!

నీ ఊహల చంద్రోదయంతో
నా మానస సరోవరంలో విరిసే
నీ తలపుల కలువలను
ఏమిచేయ్యను ! ! !
ఎవరికివ్వను ! ! !

ఇలలో పరిచయాలు నిషేధించి
కలలో నీతో ఊసులాడుకున్నా !

నువ్వే కొలువైన మది గుడిలో
పరులనడుగు పెట్టనీయలేకున్నా !


నువ్వు తలపుకొచ్చిన ప్రతిసారీ
కంట పొంగే ఏరునాపలేకున్నా!


సరసమైనా తెలియని మనసుకు విరహాన్ని రుచి చూపించావు

నీ పేరే పలకాలనుకునే పెదవులకి
నా చిరునవ్వు నువ్వని ఎలా చెప్పను!

నిను ఆశగా వెతికే చూపులకి
నా కంటి పాప నువ్వని ఎలా చెప్పను!

నాలోని నీ ప్రతి జ్ఞాపకానికి
గుండె చప్పుడే నువ్వని ఎలా చెప్పను!


వసంతాలు నిండిన
నా ప్రేమ మీద కవిత రాయనా?
లేక
చెలి నా చెంత లేదని కలత చెందనా?

మరలిరాని గతంలో ...మరువలేని జ్ఞాపకం ...నీ ప్రేమ!
నీతో గడిపిన క్షణాలను తలచుకొంటూ... నీవు లేని క్షణాలను గడుపుతున్నా...

కలత చెందిన మదిలో మెదిలేను
నీ రూపు ప్రతి సారి...
చెంత చేరవని ఎంత చెప్పినా,
మది నమ్మనంటోంది ఏ ఒక్కసారి...

ఎవరివి నీవు...?
ఏమౌతావు...?
ఎందుకు నన్ను కలవర పెడతావు...
ఏమీ కాని నన్ను కవిని చేశావు...

నా ప్రేమ స్వచ్చమైనది ఐతే
నీవెందుకు నాకు...
నీ జ్ఞాపకం చాలు నాకు...

ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు...
పెదాలు సైతం పలకలేని భావాలు...

నీకు దూరంగా...
ఒంటరి తనానికి దగ్గరగా...
నీ కోసం ఎదురు చుస్తూ...

జ్ఞాపకాలూ ఏదయినా...
అనుభూతులు మిగులుతాయి...
అచ్చం నీ పరిచయం లాగా...

ప్రేమ నన్ను వదలక నా మనసుకు బాధ...
చెలి నన్ను వలచక నా మనసున వ్యధ...

నువ్వు నా చెంత వుండి వుంటే...
ఈ కన్నీళ్లు ఆనంద భాష్పాలు అయ్యేవి...

ప్రపంచానికి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు...
కాని ఒక వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం...

కనుమరుగైనావని ఈ లోకం అంటోంది...
ఒక కధవైనావని నా కన్నీరు అంటోంది...
నా శ్వాస వున్నంత వరకు నీ ఆలాపనే నాలో....

నీ జ్ఞాపకాలే నా ప్రాణం...
వాటితోనే నా ప్రయాణం...

ఏమని చెప్పను,
చేజారి పోయిన కలల గురించా...

నా గుండెను కోసి.....రక్తాన్ని సిరగా చేసి......
అందుకో ప్రియా....ఈ ప్రేమలేఖ(లేక)

గమనిక: ఇది నేను సొంతం గా వ్రాసినది కాదు, కాని మద్యలో కొన్ని పదాలు నా సొంతంగా వ్రాసినవే, నా స్నేహితుడి బుక్ లో చూసే వ్రాసాను, బట్ ఇది మరొకరి బ్లాగ్ లో ఉంది అని కూడా గమనించగలరు

నేనంటే అలుసా...?




ద్వేషించే మనసు నీదైతే
ప్రేమించే మనసు నాది
దూషించే మాట నీదైతే
సర్దుకుపోయే మాట నాది
మొహానికి రంగులు వేసుకునే మనస్తత్వం నీదైతే
నువ్వేసే ఆ రంగుల్లో చలించిపోయే వ్యక్తిత్వం నాది
నేను నిన్నే ప్రేమిస్తున్నాను అన్నప్పుడు
మూగబోయిన నీ మాటను చుస్తే
కరిగిపోయే మనసు నాది.....
నా ప్రేమకు నువ్వు చలించేదేప్పుడు??
నా ప్రేమను నువ్వు స్వీకరించేదేప్పుడు?
నువ్వు నాలో మమేకం అయ్యేదేప్పుడు?
నా మనసు ఘోష నీకు వినపడేదేప్పుడు?
ప్రేమించే  మనసు నాకుంటే, అర్ధం చేసుకునే మనసు నీకెందుకు లేదు.???
చివరకు కటికోడు కూడా మేకను కోసేటప్పుడు మంత్రం చదివే కోస్తాడు.
కాని నువ్వు మాత్రం ఒక మాట చెప్పకుండానే నా గుండెను ముక్కలు చేస్తావు.
నీకు హృదయ స్పందన లేదా, లేక వీడి గోల నాకెందుకు అని అనుకుంటున్నావా?
ఏంటి, అసలేంటి.....నా ప్రేమ మీద .....నీ అభిప్రాయం ఏంటి ???

మంచి-చెడు....




కంటితో చుసెవన్ని  నిజాలు కావు
చెవితో విన్నవన్ని అబద్దాలు కావు
అలాగని మనం చుసెవన్నీ  అబద్దాలు కావు...నిజాలు కావు....
నిజం నిలకడగా తెలుస్తుంది.....అబద్దం ఆలస్యంగా తెలుస్తుంది
ఏదైనా ఆలోచించేటప్పుడు మెదడు తో  ఆలోచించకు
నీ మనసుతో ఆలోచించు....
ఎందుకంటే మెదడు నీ మాట వినదు
మనసు మాత్రమె నీ మాట వింటుంది కనుక
నువ్వు చేసేది, చూసేది మంచో, లేక చెడో
నీ మనసుకే తెలుస్తుంది

Wednesday, January 2, 2013

నూతన సంవత్సర శుభాకాంక్షలు....





నా బ్లాగ్మిత్రులకు, మరుయు నా బ్లాగ్ చూసే వాళ్ళకు,
నా స్నేహితులకు, నా శ్రేయోభిలాషులకు,
నా అనుకునే ప్రతి ఒక్కరికి నా తరపున మీకు, మీ
కుటుంబానికి 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ఈ సంవత్సరంలో మీ అందరికి మంచి జరగాలని
మనసారా  కోరుకుంటున్నాను......
 
29501