RSS

Tuesday, November 29, 2011

నే పలికే పదం నీ పేరు..........





ఈ చిరుగాలిలో నీ గానం ఓ పిల్లనగ్రోవిలా నన్ను కట్టిపడేసింది

ఆ అరుణోదయంలో ఓ కాంతిపున్జంలా నీ అందం నన్ను బంధించింది

నీ ఊహ ఆ సంధ్యాకాలం సమీపించకముందే నన్ను త్వరపడమంది

నా మనస్సు నిన్ను గైకొని మరులుగోలుపు మరులోకానికి చేరుకోమంది


కనులు మూసి నిదురిస్తుంటే కలలో నీ జ్ఞాపకాలు
కనులు తెరిచి చూస్తే కనుల ఎదుట నీ తలపులు

పదములు ఎన్నున్నా అనుక్షణం నే పలికే పదం నీ పేరు
వర్ణములు ఎన్నున్నా క్షణ క్షణం నాకు కనిపించేది నీ రూపము

ఒంటరిగా వెళుతున్నా నాతొనే ఉన్నావు అనుకుంటున్నా నువ్వు
ఎందరితో కలిసి ఉన్న నా తలపులలో విహరిస్తున్నావు నువ్వు

చెంతలేకున్నా నా కన్నులు ప్రతిక్షణం ఎదురుచుసేను నీకై
ఏమి అయిపోతనో తెలియకున్నా వేచి ఉన్నాను నీ పిలుపుకై

కరువు...కరువు





కంటికి నిద్ర కరువయ్యింది,
ఆశకి శ్వాస కరువయ్యింది,
మనసుకి మమత కరువయ్యింది,
వయసుకి వలపూ కరువయ్యింది,
నోటిమాటకు పాట కరువయ్యింది,
నటనమయూరికి ఆట కరువయ్యింది,
ఉదయానికి తూరుపు కరువయ్యింది,
హృదయానికి స్పందన కరువయ్యింది,
చూపుకు గమ్యం కరువయ్యింది,
రేపుకు ఆశ కరువయ్యింది,

నాలో ఏమున్నాలేకున్నా,నువ్వూ నీనవ్వూ ఎప్పటికీ నిలిచేవుంటుంది.
తరచి తరచి నానుండి ఎన్ని వెలికి తీసావు,మరెన్ని దూరంచేసావు !
కానీ....
ఇక నువ్వెంత తరచినా వచ్చేది మిగులున్న నీమీద నాకున్న ప్రేమే !!!

Tuesday, November 22, 2011

నా ప్రాణమైన నీకు




కమ్మగా పాడే కోయిలనడిగాను,

నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని ...

చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,

నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...

వర్షించే మేఘాన్ని అడిగాను ,

నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...

హాయిని పంచే వెన్నెలని అడిగాను ,

ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...

పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,

నీ పరుగు నా కోసమేనా ? అని ...

నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,

నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......

Monday, November 14, 2011

అనుబంధం



పెళ్లి రెండు అక్షరాల పదం
రెండు జీవితాల గమ్యం
రెండు ఆత్మల సంబంధం
ఒక్క పదం తో రెండు జీవితాలను ముడి వేసే బంధం
ప్రతి మనిషి జీవితపు మలుపు పెళ్లి
ప్రతి మనిషికి తన బాద్యతలు తెలిపే అనుబంధం ఈ పెళ్లి
సుఖ దుఖల సంగమం ఈ పెళ్లి
తెలుసుకుని మసలు కుంటే స్వర్గం
ఆజగ్రత చేస్తే నరకం

Friday, November 11, 2011

బలి-పశువును చేసారు.........



 
నిజంగా ప్రేమించి పెళ్ళీ చేసుకోవడం నా అదృష్టమో లేక దురదృష్టమో నాకు తెలిదు,
కాని మా పెళ్లిఅయ్యాక మేము ఇద్దరం బాగానే ఉన్నాము, కాని ఒకరోజు
మా మామ గారు ఫోన్ చేసి మా ఆఫీసు దగ్గరకి వచ్చి మమ్మల్ని కలసి
ఒక మాట చెప్పాడు, అయ్యిందేదో అయ్యింది మీరు ఇద్దరు సుఖంగా ఉండాలంటే
సెపరేట్ గా ఉండండి, అప్పుడు మేము మిమ్మల్ని చూడడానికి వస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అన్నాడు,
కాని పెళ్ళయి రెండు సంవత్సరాలు కావస్తుంది, మాకొక పాపా కూడా పుట్టింది, కాని ఇప్పటి వారకి ఎవరు రాలేదు,
మా మామ గారి మాటలను నేను అప్పుడే నమ్మలేదు కూడా, కాని నా భార్యామణి మాట వల్ల సెపరేట్
అవ్వాల్సివచ్చింది, తను వల్ల ఇంట్లో వాళ్ళు దగ్గరవుతరనే ఉద్దేశంతో అల్లా అన్నది కదా అని నేను సరే అన్నాను.
కాని ఇప్పటి వరకు వల్ల ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు, కనీసం మా పాపను చూడడానికి కూడా రాలేదు
మా బావమరదులు, మామ గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు కాని మా అత్తే ఇంకా కులం కులం అంటుంది
మా వల్లే తన ఆరోగ్యం బాగుందడంలేదని అంటున్నది. కాని ఒకటి మాత్రం నిజం
మా మామ & భార్య వల్ల మాత్రం నేను బలి-పశువును అయ్యాను.
 
29501