RSS

Saturday, June 30, 2012

ఓ....నేస్తమా.....



నా మనోవనం లో విహరిస్తున్న
నీకై ఆవిర్భవించిన ఉషోదయాన్ని నేను...
నీ పెదవిపై పూసె
చిరునవ్వుల జల్లులలో తడిసిపోతున్న అభిమానిని నేను...
నీ మదిలో మెదిలే
ఆశల పరంపరకి చిరునామా నేను...
నీవు ఆనందిస్తే
నీ కనుతెప్పాలో దాగిన అనంధభాష్పన్ని నేను....
నీ మనసు పగిలితే
నిన్ను ఓదార్చే మౌనాన్ని నేను....
నీవు చేరువైతే
నీకై ప్రాణమిచ్చే ప్రేమ పిపాసిని నేను.....
నీవు దూరమైతే
నీ క్షేమం  కోరే శ్రేయోభిలషిని నేను......

నేనైతే చాలు.....




నీ ప్రేమ భవంతికో ఇటుక
నీ విశాల నేత్రాలకి కాటుక
నీ పంజరాన గువ్వ
కాలి లోన మువ్వ
చేతిలోన పరుసు
మెడలోన గొలుసు
కొప్పులోన పువ్వు
నీ పెదాలపై నవ్వు
ఏదైనా ...ఓ క్షణమైనా
నేనైతే చాలు.....

Tuesday, June 19, 2012

నేను నా జీవితంలో ఒక పెద్ద పాటం నేర్చుకున్నాను




డియర్ ఫ్రెండ్స్......నేను పుట్టి రేపటికి 25 సంవత్సరాలు పూర్తిచేసుకొని 26వ వసంతంలోకి  వెల్లబోతున్నాను.
అందుకు ముందుగా నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.....
ఈ 25 వసంతాలలో, నేను నా జీవితంలో ఒక పెద్ద పాటం నేర్చుకున్నాను, అదేంటంటే......

మామూలు మనిషిగా వుండడం ప్రపంచంలో అతి కష్టమయిన విషయం.
అసాధారణంగా వుండాలనే అందరూ అనుకుంటారు.
అజ్ఞాతంగా వుండిపోవాలని ఎవరూ అనుకోరు.
మన గురించి పదిమందీ చెప్పుకోవాలని మనుషులు కోరుకుంటారు.
ప్రత్యేకత కోసం పరుగులు పెడతారు.
జీవితంలో మౌనమ్, నిశ్శబ్దం నిర్మలత్వం ముఖ్యమయినవి.
అవి వున్నవాళ్ళలో దైవత్వముంటుంది. వాళ్ళకు ప్రచార ఆర్భాటాలు వుండవు. జీవించడం ఒక్కటే వాళ్ళకు తెలుసు.
ఒకరోజు నేను మా ఊళ్ళో అడవిలోకి వెళ్లాను. అక్కడ చెట్లు కొడుతున్నారు. కానీ మధ్యలో ఒక పెద్ద వృక్షం వుంది. అది విశాలంగా వ్యాపించి వుంది. దానికింద వంద బళ్ళు నిలబడవచ్చు. అన్ని చెట్లను కొడుతున్నా వాళ్ళు దాని జోలికి వెళ్ళడంలేదు. నేను వాళ్ళతో ‘ఇన్ని చెట్లుకొడుతున్నారు కదా. మరి ఆ పెద్ద చెట్టును ఎందుకు కొట్టరు?’ అని అడిగాను. దానికి వాళ్ళు ‘మేము కొడుతున్నవి టేకు మొదలైన ప్రశస్తమైన చెట్లు. వాటివల్ల ఎంతో ప్రయోజనముంది- వాటితో తలుపులు, బల్లలు, కుర్చీలు చెయ్యవచ్చు. ఈ పెద్ద చెట్టు మామూలు చెట్టు. దీని ఆకులు జంతువులు తినవు. దీని కట్టెలు కాలిస్తే విపరీతమైన పొగ వస్తుంది. దీంతో కుర్చీలు లాంటివి చెయ్యలేం. పెళుసుగా వుంటుంది. అందుకని ఎందుకూ పనికిరాని దీని జోలికి పోము’ అన్నారు. అప్పటినించీ నేను ప్రత్యేకత లేకుంటే ఎవరూ మనల్ని పట్టించుకోరు,  పైకి వెళ్ళాలనుకున్నవాళ్ళకి, పేరు సంపాదించాలనుకున్న వాళ్ళకి డబ్బు పట్ల ఆశవున్నవాళ్ళకి సవాలక్ష సమస్యలున్నాయి. సంక్షోభాలున్నాయి. నిజానికి జీవించడానికి వాటన్నిటితో ఏమీ పని లేదు. అందుకని నేను అజ్ఞాతంగా, సాధారణంగా వుండిపోవలనుకున్తున్నాను...

Wednesday, June 13, 2012

పుట్టిన రోజు శుభాకాంక్షలు....



పుట్టిన రోజు ఎన్నోరకాలుగా జరుపుకోవచ్చు
కాని, గతంలో మన తీపి అనుభవాలను
గురుతుకుతెచ్చుకుంటూ,
ప్రతి అనుభవాన్ని మనలో మనం పంచుకుంటూ,
పొందే ఆనందంతో ఏది సరికాదు.
నా స్నేహితులలో నీకు ప్రత్యకే స్థానం ఉంది,
అలాగే నీ జన్మదినం కూడా నాకు ప్రత్యేకమైనదే
నేను ఏమైనా తప్పు చేసి ఉంటె, నన్ను మన్నిస్తావని కోరుకుంటూ...
మన స్నేహపు  పునాదులు ఎవరు బద్దులు కొట్టలేరని.....
నన్ను నా స్నేహాన్ని కలకాలం గుర్తుంచుకుంటావని....
మన స్నేహపు ద్వారాలు ఎల్లప్పుడూ తెర్చుకునే ఉంటాయని...
మనసార కోరుకుంటూ....ఆశిస్తూ.....
నా ప్రియ నేస్తమా....... (శ్రీదేవి) నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు....

Saturday, June 9, 2012

కడదాకా కాదు.....మరుజన్మదాక కాదు....




అందమైన ఆ క్షణాలు....అందుకోలేని దూరాలుగా
మరచిపోలేని జ్ఞాపకాలుగా
మనమాడిన ఆటలు ముద్దుగా
మనం చేసిన అల్లరి సద్దుగా
నిజం చెబుతున్న ఆ దేవుడి సాక్షిగా
ఓ....నేస్తం తిరిగిరాదు ఈ సమస్తం
అందుకే అందుకో ఈ హస్తం
కడదాకా కాదు.....మరుజన్మదాక కాదు....

జ్ఞాపకాలు....



కత్తి ఒక్కసారే గుచ్చుకుంటుంది..
జ్ఞాపకాలు కత్తికంటే డేంజర్
కొన్ని తీపి జ్ఞాపకాలు....మరికొన్ని చేదు జ్ఞాపకాలు........
కాని జ్ఞాపకాలు ప్రతిక్షనం గుండెళ్ళో గుచ్చుకుంటూనే ఉంటాయి........

Friday, June 8, 2012

నాలోంచే పారిపోయి....



'నీకేం....
ఓ చూపు విసిరి, ఓ చిర్నవ్వు రువ్వి
కళ్లనలా అలవోకగా తిప్పేసుకు పోయావ్‌
ఆ చిన్ని చూపు ధ్వనికే
మనసు చెదిరీ, వయసు రగిలీ
కలత నిండిన ఎదతో నేనే కదా
నాలోంచే పారిపోయి నిన్ను చేరుకోవాలనుకొనేది......

Tuesday, June 5, 2012

ఇది నిజం.....







ప్రేమించేటప్పుడు మైసూర్పాకు
పెళ్ళయ్యాక అది కరివేపాకు
ప్రేమ తియ్యగానే ఉంటుంది
కాని అది పెట్టె బాదే కరివేపాకు లా ఉంటదని నా భావం.....

నీ స్నేహం ...



అలిసిన నా కన్నుల్లో ఓ కమ్మని కల నీ స్నేహం
మూగబోయిన నా పెదవుల పై ఓ చిరునవ్వు నీ స్నేహం
ఆగక సాగే నా పయనం లో ఓ చల్లని మజిలి నీ స్నేహం
నా హృదయపు ప్రతి స్పందనకూ... ప్రతిస్పందన నీ స్నేహం ... :)

నా నువ్వని......నీ నేనని.......



ఊహలకు ఊపిరినిచ్చే వరము నీవని
ఊపిరికి వరములనిచ్చే ఊహ నీదని..

ఆశలకు ఆయువు పెంచిన అడుగు నీదని
అడుగులకు ఆయువునిచ్చిన ఆశ నీవని..

శ్వాసకే సరిగమలిచ్చిన స్వరము నీవని
సరిగమలకు స్వరములిచిన శ్వాస నీవని..

చూపులకు వెలుగుని పంచె మెరుపు నీవని
మెరుపులకు వెలుగులనిచ్చే చూపు నీదని..

మౌనమును మాటగ మార్చే మమత నీదని
మాటలకు మమతనిచ్చిన మౌనం నీవని.

తలపుల దాహానికి తొలకరి నువ్వని
తొలకరి తలపుల దాహం నువ్వని..

తళుకుల తారక నీ నవ్వని .. మెరుపుల మాలిక నా నువ్వని .

నీకై ఎదురు చూస్తూ ....




గుండె రేకులు చీల్చివేస్తూ ..
స్వప్న సౌధం కూల్చివేస్తూ..

అత్మనయనం తొలిచివేస్తూ..
హృదయమును రణభూమి చేస్తూ..

ఎచటికో నువు పయనమౌతూ..
నేను నీకై ఎదురు చూస్తూ ....
 
29501