RSS

Wednesday, September 23, 2009

పెద్దల మాట చద్దనం మూట........!!!!




ప్రేమ అంటే...ఎవరినైతే తన ప్రేమికుడు/ ప్రేమికురాలిని ప్రేమిస్తుంటారో, వారు తను ప్రేమించేవారినుండి తిరిగి మళ్ళీ అదే ప్రేమను పొందాలనుకోవడం అవివేకం అంటారు ప్రముఖ హిందీ కవి "కబీర్ దాస్"

కొంతమంది పురుషులు ప్రేమిస్తారు, కాని వారి ప్రేమలో కాసింత గాఢత తక్కువగానే ఉంటుంది, కాని స్త్రీ అలాకాదు, తన ప్రేమ స్థిరంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ద్వేషించడం ఎన్నడూ ఎరుగదని ఆచార్య రజనీష్ "ఓషో" అన్నారు.

ప్రేమ అనేది ఎప్పుడూకూడా తీసుకోవడం ఎరుగదు, దానికి తెలిసిందల్లా ఇవ్వడమే. ప్రేమ అనేది కష్టాన్ని సహిస్తుంది. ప్రేమకు పగ, ప్రతీకారం అనేది తెలియదంటున్నారు జాతిపిత "మహాత్మా గాంధీ."

ప్రేమకు కళ్ళుండవు అది ఎప్పుడూకూడా హృదయంనుంచి మాత్రమే చూస్తుంది, కాబట్టే ప్రేమ గుడ్డిది అన్నారు. అని ప్రముఖ ఆంగ్ల కవి "శేకేపియర్స్" అన్నారు.

పువ్వు పరిమళం ఎలాంటిదో ప్రేమకూడా అలాంటిదేనని "జార్జ్ బెర్నార్డ్ షా" అన్నారు.



నిజమైన ప్రేమ ఏమిటో సహజీవనం చేస్తేనే తెలుస్తుంది.
ప్రేమంటే ఒక వ్యక్తిలోని మంచితనాన్ని ,మంచి గుణాలని ,
కేవలం ఆ ఒక్క వ్యక్తినే ప్రేమించటం కాదు.
ప్రేమంటే 'నువ్వు ఇలా మారు,అలా మారు.అప్పుడు నిన్ను బాగా ప్రేమిస్తాను' అని కండిషన్స్ పెట్టడం కాదు.
ప్రేమంటే -- ఒక వ్యక్తితో పాటూ ఆ మనిషి తాలూకు ప్రపంచాన్ని కూడా ప్రేమించటం.
అది మన ప్రపంచం కన్నా విభిన్నంగా ఉన్నా సరే.
అవతలి వారి అభిప్రాయాలు ,అభిరుచులూ భిన్నంగా ఉన్నా సరే వాటిని గౌరవించటం .
ముఖ్యంగా ఒక మనిషి లోని 'లోపాల్ని' కూడా సుగుణాలతో సమానంగా స్వీకరించగలగటం షరతులు పెట్టకుండా బేషరతుగా ప్రేమించగలగటమే ప్రేమంటే!!
ఎందుకంటే 'ఇవ్వటంలో' ఉన్న ఆనందం,హాయి అనుభవంతోనే అర్ధం అవుతాయి !! "ప్రేమికుడు పండు"

Monday, September 21, 2009

తుమ్మెద హొరులో....!!!!




ప్రియతమా....
వసంత కాలంలోని కోయిల పాటలో "నీవు"
కొండ మీద నుంచి జారిపడే సెలయేటి గలగలలో "నీవు"
సముద్ర తీరము చేరే ప్రతి కెరటములో "నీవు"
రేయిని సైతం పగలుగా మార్చే చల్లని వెన్నెలలో "నీవు"
తేనె కోసం ప్రతి పూవుని వెతికే తుమ్మెద హొరులో "నీవు
కను ముస్తే వచ్చే కరిగిపోయే కలలో "నీవు"
నా కళ్ళలో "నీవు".....నా యెడ లోయలో "నీవు"
నా గుండె చేసే ప్రతి సవ్వడిలో "నీవు"
ఇన్నింటిలో దాగిన నీవు.........
నా కన్నుల ముందుకొచ్చి ఎందుకు కనబదవూ.........!!!!?

Saturday, September 19, 2009

ఒకే గొడుగులో........!!!!




ఒకే గొడుగులో నడిచిన
మన అడుగులకు తెలుసు ప్రేమంటే.....
ఒకే మెరుపుకు కలిసిన
మన కనులకు తెలుసు ప్రేమంటే.....
కంటి సైగతో పలకరిస్తే...బదులు పలికే
నీ చిరునవ్వుల పెదవులకు తెలుసు ప్రేమంటే.....
మమత నిండిన నీ చేతి స్పర్శకు
పులకరించే నా మదికి తెలుసు ప్రేమంటే.....
కలలు నిజమై...కాలము కవితై....
కలిసిపోయే మన హృదయమే ప్రేమంటే..........!!!!!!

ఇది నీకు తగునా.......?

చుపలతో చుట్టేసి చూపుకు అందకుండా వెళ్లావు
నిలువుటద్దంలా కనిపించి నిలువునా నను కల్చేసావు
నీ కలువ కన్నుల్లో కళలను దాచుకొని
నా కన్నుల్లో కలతను రేపావెందుకు?
అందుకే అప్పుడప్పుడు ఆలోచించాను ఆనందంగా విడిపోవాలని, కాని
ఇంక అందంగా అనుబందం పెంచి ఆలోచనలు రేపావు
సాక్ష్యం లేని స్నేహంతో సమస్యలెన్నో సృష్టించావు
ఆశలన్ని అందించి అద్భుతాలెన్నో చేసావు
పరువ్వలు పరిచి పరుగులు తీయించి పిచ్చివాడిని చేసావు
కదిలే కాలంలో కలకాలం ఆగని కన్నీళ్ళు తెప్పించావు, ఇది నీకు తగునా....???

హృదయకవాటంలో.....!!!



నీ చిరునవ్వు....దరహాసం...
ఒక్కటి చిందించు చాలు...
నీ లేత మందహాసం...
ఏ దూర తీరాల్లో ఉన్నా...
నా హృదయకవాటంలో
పదిలంగ దాచుకుంటాను ప్రియా.....!!!

అనంత భావాలు........!!!




కూడలి ఒక్కటే..కెరటాలు అనంతం
తూర్పు ఒక్కటే..కిరణాలు అనంతం
మనసు ఒక్కటే భావాలూ అనంతం
ఆ భావాలకి ప్రతిరూపమైన నీవు
నా ఒంటరి జీవితాన వసంతమైనావు

Friday, September 18, 2009

కలవరమాయే మదిలో............!!!!





తెలుసుకోవాలని వుంది, నాకు ఎం జరుగుతోందో.
అర్ధంకాకుంది, నాలో ఈ మార్పు ఏమిటో.
అంతు చిక్కకుంది, నీతో మాట్లాడాలని ఆరాటమెందుకో.
దిక్కు తోచకుంది, ఈ స్ధితి నుంచి విముక్తి ఎప్పుడో.
ఇదంతా నీకు చెప్పాలని వుంది, ఎం అవుతుందో.
భయమేస్తుంది, చెప్తే నీ స్నేహాన్ని కోల్పోతానేమో.......


చెప్పటానికి ఎన్నో ఊసులు మదినిండా,
నీ చెంత మూగబోతున్నా మాట్లాడకుండా.
చెప్పాలని బాధ,
చెప్పటానికి బాధ,
అఖరికి చెప్పలేదని బాధ.
ఎంత బాధైనా సరే.. దాచుకుంటా మధురంగా పదిలంగా, మర్చిపోకుండా.


పోందాలనుకున్నా నను కలవరపరిచిన నీ నవ్వునంతా..
స్వార్దం వెనుక ఇష్టమని తెలుసుకో, అపార్ధం చేసుకోకుండా
నీ చిరునవ్వులు చూస్తూ వుండాలి,
ఆ నవ్వుల కారణం నేనవ్వాలి
నీ మోములొ సంతోషం నేకావాలి.
పిచ్చివాడిననుకుంటావేమో.. ఎలా వుండగలను చెప్పు, నీ నవ్వు చూసి పరవశించకుండా

ఆరాటపడుతున్నా పంచటానికి నా ప్రేమనంతా..
కేవలం నేస్తాన్ని అంటావేమో, స్వీకరించకుండా.
పెరుగుతూనే వుంది నాలో ప్రేమ
దాన్ని ఒంటరిగా మోయ్యలేను సుమ.
రెక్కలు కట్టుకు వచ్చి, ప్రేమభారాన్ని పంచుకోమా.
శూన్యమైపోతుందేమో ఈ జీవితం, నువ్వు లేకుండా, నీ తోడు లేకుండా......!!!!

తపన....!!!!



మనసులో మనసుకి తెలియని భావన..
కనులలో కనులకే తెలియని కల్పన..
మదిలో మదికే తెలియని తపన..
నాలో నాకే తెలియని ఆలోచన..
అన్నీ నీ కోసమే.........

నీకై ఎదురు చూస్తూ .......



నా ప్రేమకు అర్ధం లేదు
నీ తోడు లేకుంటే...
నా జీవిత గమనానికి గమ్యం లేదు
నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే...
నా నిదురలో స్వప్నం లేదు
నీ ద్యాస లేకుంటే...
నా మనసుకు ఓదార్పు లేదు
నీ స్వరం వినపడకుంటే...
నా దేహనికి జీవం లేదు
నీ శ్వాస తోడవకుంటే...
నీకై ఎదురు చూస్తూ నీ....................!!!

ప్రేమ వ్యవ(సాయం)హారం..........!!!!




ప్రేమ, పైరూ ఒకలాంటివే. "ముందు మనసనే భూమిని దున్నాలి.
స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి.
ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి.
కులమతం, రాజకీయం అనే చీడల నుండిరక్షించుకోవాలి.
అప్పుడుగానీ ప్రేమ అనే పైరుచేతికిరాదు.”

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు.
నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోవవ్వాలి.
కళ కన్న ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.
ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.

ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో...
ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.

ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
ప్రేమ ఇంధ్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ - "ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్సత, స్పర్శ, కామం, ఓదార్పు”
ప్రేమంటే సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా, ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకరి స్మృతులు మరొకరికి చేరాలి.

బాటసారిని.....!!!!



జీవిత పయనం, జీవిత గమ్యం తెలియని నేను
ఓ నిరంతర బాటసారిని.........
ఎక్కడో తెలియని నా గమ్యం
అదేక్కడని నా ఈ పయనం....
అల వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోయాను
ఏదో ఒక రూపం నా మనసుకు కనబడింది
ఎంటా అని నా మనసును అడిగాను
నీ రూపాన్ని నా కంటికి చుపించిది
అపుడు తెలుసుకున్నాను నా ప్రయాణం
నీ చెంతకు చేరడానికని, నీ ప్రేమను సాధించడానికని....
నీ ప్రేమకై నీను అలుపెరుగని బాటసారిలా
పయనిస్తూనే ఉంటాను నీ ప్రేమను సాధించేవరకు

Monday, September 14, 2009

ప్రేమి'కులం'..........!!!!!




మనం భారతీయులం,
కూడు పెట్టని కులం మనకెందుకు,
ప్రేమనివ్వని కులం మనకెందుకు,
మన దృష్టిలో 'కులం'అంటే............
పని చేసేటప్పుడు శ్రామి'కులం'
కష్టపదేటప్పుడు శ్రామి'కులం'
కన్నవారికి సేవ'కులం'
ప్రేమించేతప్పుడు ప్రేమి'కులం'
ఆ ప్రేమని పంచేటప్పుడు ధని'కులం'
ఇవన్ని పాటించేప్పుడు మానవ'కులం..!!!!!

ప్రేమ వర్సస్ కులం.........!!!!!!




"ప్రేమ అనేది ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం, కానీ పెళ్ళి మాత్రం రెండు కుటుంబాలకు చెందిన విషయం" ఇది ముమ్మాటికీ నిజం.
"ప్రేమ-పెళ్ళి రెండూ వేరువేరునా? లేక రెండూ ఒకటేనా?" చాలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్లకపోవడానికి కారణం ఏంటి? ప్రేమకు కులం అడ్డమా?? ఒక అమ్మాయి ఒక అబ్బాయిల కులం ఒకటయితేనే ప్రేమించుకోవలా?? మన ఈ నవసమాజంలో ఈ కులం పిచ్చికి అంతం లేదా?

Friday, September 11, 2009

చిరుగాలి.....!!!!



మంచుకురిసే చల్లని రేయి,
నీకిష్టమయిన ఈ గులాబీ తోట కూడా
వెన్నెల పందిరి కింద నీ రాక కోసం ఎదురు చూస్తుంది
నీవు తిరుగాడిన ఈ పచ్చిక సయితం
మంచు బిందువులను ఏర్చి కూర్చి ముస్తాబయ్యింది నీ స్పర్శ కోసం
అప్పుదేప్పుదేప్పుడో ఎండుటాకుపైన నే రాసిన ప్రేమ లేఖ
రెప రెపల చప్పుడు ప్రేమ గీతంలా వినిపిస్తుంది
నా గుండెలనిండా నిన్నీ నింపుకుందామని నేను వేచి ఉంటె
గుండెలు కోసే ఏకాంతం నా మనసుని భయపెడుతుంది...
నా మనసు నిండా ఉన్న ప్రేమ ఆ వెండి మబ్బులనుండి
జాలువారిన తొలి చినుకంత స్వచంగా ఉంది
నా ప్రేమని ప్రపంచానికి పంచటానికి తోడు రావా నేస్తమా...
నాకే కాదు నా ప్రేమకు కూడా ఒంటరితనమంటే భయమే
నా ప్రాణానికి ఊపిరి పోసావు, నా ప్రేమకి ప్రాణం పోయవా చిరుగాలి........!!!

చితిలోంచి లేచొస్తాను.........




నా కనుల మాటున దాగిన కమనీయ రూపమా.!
నా మదిన నిలచిన సుమధుర స్వప్నమా.!
ఓ నా ప్రాణప్రదమైన హృదయమా.!
నాలోని అణువు అనువున నిండి ఉన్న నిన్ను
నే తుది శ్వాస విదిచేదాక ప్రేమిస్తాను
నేడు నీకోసం నేను పుట్టకపోయినా,
రేపు నీకోసం నే సంతోషంగా మరణిస్తాను
చిరునవ్వుల వరమిస్తావా
చితిలోంచి లేచొస్తాను...............



నీ నీడనై......!!!!




నీ పెదవులు పలికే మాటను నేను,
నువ్వు చూసే కనుచూపునవుతను.
నీ మనసున చేరే ఊపిరి నేను,
నిన్ను తాకే చిరు గాలినవుతాను.
నువ్వు వేసే ప్రతి అడుగును నేను,
నే నీ నీడనై చిరకాలం తోడుంటాను.
నీవు ఊహించే తలపుని నీను,
నిన్ను ఊపె ఊయలనవుతను
నా మనసు పలికే ఈ రాగం, ఈ మనసుని నడిపించే ఈ ప్రాణం,
అన్ని నీ సొట్ట బుగ్గల చిరునవ్వుకే దాసోహం.......

Thursday, September 10, 2009

మరచిపోవాలనుకుంటున్నా కానీ.........!!!




మరచిపోవాలనుకుంటున్నా కానీ
నీ చూపు తాకినా మరుక్షణాన
విషయాన్నీ మల్లి మరచిపోతున్నా...........
మాటల్లో పదకుడదనుకున్నా కానీ
నీ పెదాలు అల ఇలా మెదిలే సమయాన
దాన్ని అలాగే పట్టించుకోక వదిలేస్తున్నా.........
నీ
వయ్యారి నడుము ఊయలూగితే

కిలకిలమని చూడలేక ఉండలేకపోతున్నా........
నాలోని 'మధుర భావాలు
నీ మువ్వల సవ్వడి విన్పించగానే
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నా గుండెల్లో అలజడులు
ఇంకా ఎలా మరవగలను ప్రియా.....!

జడి వాన.......!!!


నా హృదయం అనే పూతోటలో విరసిన తోలి రోజా నువ్వు
నా జీవన ఎడారిలో తొలి జడి వాన నువ్వు
నా కనులలో నిత్యం నాట్యమాడు మయురివి నువ్వు
నా ఊహల ఆశా కెరటం నువ్వు
నా పెదాలపై చెరగని చిరు నవ్వే నువ్వు
కనులు మూసినా ఊహకు రావు, కనులు తెరిచిన కానరావు.....

మనసులో కన్నీరు......


ఆప్యాయతల కోసం ఏదురుచుస్తున్న నా మనసుకి,
బాధతొ గుండె బరువెక్కింది,
చిన్నప్పటి నుండి ఎన్నొ కష్టాలు పడ్డాను,
కడదాకా కన్నీళ్ళే శరణ్యం అనుకున్నాను
ఒక్కసారిగా నీ రాకతో నా జీవితంలో ఎక్కడొ చిన్న ఆశ కలిగింది బ్రతకాలని,
కాని నా ప్రేమ నిన్ను కరిగించలేక పోతుంది
ఐనా ఒక విధంగా ఆలోచిస్తే నేను స్వార్దంతోనే నిన్ను ప్రేమిస్తున్నా,
అందుకే నా ప్రేమ నీ మనసుని ఇంకా గెలవలేకపోతుందేమో
చూపు నాదైనా కన్నులు నీవి అని అనుకున్న
కన్నులు నీవని తెలిసి కూడా బాధ పెడుతున్నావు
నా కంట్లో వచ్చే కన్నీరు మాత్రమె నీకు కనిపిస్తుంది
నా కంట్లో కన్నీరు చుసిన క్షణం మాత్రం
నా కన్నీరు తుడవడానికి ప్రయత్నిస్తూ చేరువగా మాట్లాడుతావు
కాని అంతలోనే మల్లి నన్ను దూరం చేసి పరాయివాడిని చేస్తావు
స్పందన నాదైన హ్రుదయం నీదనుకున్న
హృదయం నీదని తెలిసి కూడా నన్ను దూరంగా ఉంచుతున్నావు
మరి ఇక నాకు ఆ కన్నులేందుకు
ఈ హృదయమెందుకు
నా కన్నీటికి కారణం నువ్వే,
నీకు అన్ని తెలుసు
ఐన నాపట్ల నీ తీరు మారట్లేదు, నా మనసుపడే భాద నీకు తెలియట్లేదు,

నువ్వు తెలిసి అంటావో, తెలీక అంటావో నాకు తెలీదు

కాని అపుడపుడు నువ్వుఅనే మాటలు నా హృదయాన్ని బరువెక్కిస్తున్నాయి
ఇంకా ఆ బరువు మోసే శక్తి నాలో లేదు,
కాని నా మనసులోంచి వచ్చే కన్నీరు నీకు కనిపించాట్ల
అవి కనిపిస్తే అలా మాట్లాడవు,

నా కంట్లో కన్నీరు తుదవకపోయిన బ్రతకగలను
కాని నా మనసులో కన్నీరుతో నేను బ్రతకలేను ప్రియా
నన్ను నా మనసుపడే బాధను అర్ధం చేసుకుంటావని
నా మనసులోని కన్నీరు తుడుస్తావని, నీ ప్రేమకై నే వేచి ఉన్నా................!!!

Wednesday, September 9, 2009

నీ చూపు సోకగా...!!!



అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీవైపే చూడగా
శిరను ఉపింది పువ్వు నీ శిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులె నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యనులే నీ చూపు సోకగా......

ప్రేమ సంకెళ్ళు.....!!!




మురిపెంతో సరసం తిర్చమంటోంది ప్రాయమి వేళలో
తమకంతో దూరం తెన్చమంతోంది తీపి చెరసాలలో
విరహంతో పరవం కరిగిపోతుంది ఆవిరై గాలిలో
కలిసుంటే చాలు కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో.....

ప్రేమ సెగలు.....




చల్ల చల్లని మంచుకు అర్ధం కాదు ప్రేమ చలువేమిటొ
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటొ
వచ్చి రాని కన్నిల్లకే తెలుసు ప్రేమ లోతేమిటొ
ముద్దులేని అధరాలకే తెలుసు ఈడు భాదేమిటొ

ప్రయాణం.....!!!




నలువైపులా నల్లని చికట్లే ఎదురోస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతూ ఉన్నా
కనుపాప కుప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూనే ఉన్నాను.....

Tuesday, September 8, 2009

ప్రేమంటే........!!!!




నీ పరిచయం నాకు ప్రేమను నేర్పించింది

నీ అందం నాకు బంధం వేసింది

నీ మాటలు నా ప్రేమకు బాటలు వేశాయి

నీ నవ్వులు నన్ను మైమరపించాయి

నీ చూపులు నా గుండెను తాకాయి

నీ అభిమానం నీ పై నా ప్రేమను పెంచాయి

నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని

కాని అది నీకు తెలియాలంటే ఎలా

నీవు ఒంటరిగా వున్నప్పుడు నన్ను తలచుకుంటావే అదే ప్రేమ

నేను కనబడనప్పుడు నా సెల్లులొ మెసేజ్ బాక్స్ నిండిపొతుంది చూడు నీ మెసేజ్ లతొ అదే ప్రేమ

నేను ఏ అమ్మయితొ ఐనా మాట్లడుతుంటే నీ కళ్ళు ఎరుపెక్కుతాయే అదే ప్రేమ

పొద్దున్నే నా మెసేజ్ రాకపొతే నువ్వు నన్ను తిడతవు చూడు అదే ప్రేమంటే

ఇంకా అర్ధంకాలేదా నీకు ప్రేమంటే

ఏ బాషలొ చెప్పాలి నీకు

కనీసం నీ మనసునన్న అడిగి చూడు

నా మనసు పడే బాదేమిటో

నీవొక తర్జామా....!!!




నీ జ్ఞాపకాల పందిరిలో
నాది పచ్చదనపు చిరునామా...
నీ ఉహల ఉద్యానవనంలో
నాది పరిమళాల హంగామా....
నీ స్వప్నాల సద్యనురాగంలో
నాది వెలుగుల వీలునామా.....
అవును ప్రియతమా
నేననే మనషికి నీవొక తర్జామా.......

Monday, September 7, 2009

నీ కోసమే.......!!



ప్రేమే తెలియని నా మనసుకు ప్రేమను ప్రేమగా పంచాలి
నీ పరిచయమే జరగకపోతే నా జీవితమంతా వ్రుధాయేగా
నిన్ను చుసిన క్షణమే నాలో సగమై
నా నీడను నేను మరిచాను
నీ ఉహలతో నా మనసుని నింపి
నీకోసమే నేనోచ్చానులే ప్రియా....

Saturday, September 5, 2009

నా గుండె లోతులో


నీటిలో వేసే ప్రతి అడుగు కనిపించదు
మట్టిలో వేసే ప్రతి అడుగు చిరకాలం గుర్తుండదు
కాని మన ఇద్దరం కలిసి నడిచే ప్రతి అడుగు
నా గుండె లోతులో నిలిచిపోతుంది....

నా యెదలో......





నిన్ను చూడలనిపిస్తే నిదురపోతాను
ఎందుకో తెలుసా కలలో నువ్వు కనిపిస్తావని..
నా కలల అలలకు నీటి బిందువులా తోడై నాతో నడవాలని....
నిన్ను తాకాలని అనిపిస్తే నేను డాబాపైకి వెళతాను
ఎందుకో తెలుసా గాలి తగిలితే నీవు తగిలినట్టు అనిపిస్తుంది....
నీతో మాట్లడాలనిపిస్తే నాకు నేనే మాట్లాడుకుంటాను
ఎందుకో తెలుసా నా నాలుకపై కూడా నీవే ఉన్నావని....
ఇలా ఎందుకో తెలుసా నీవు లేవని భ్రమ కాదు
నా యెదలో కూడా నీవే ఉన్నావనే ధీమా.....

నా యువరానివై....!!




చేతికందని నింగిలో తారల్ని నవ్వుతు దోసిళ్ళలో పోసావు..
నేనెరుగని నన్ను నాకే కొత్తగా చూపించవు....
మాదుర్యం తెలియని జీవితంలో వసంతాలు రాప్పించావు..
అన్ని తెలిశాక మాత్రం అందనంత దూరాన నిలిచావు....
కష్టం నా చుట్టమైన...కన్నిల్లతోటే నా పయనమైన....
ఏనాటికైనా నా జీవితంలోకి నా యువరనివై వస్తావని....
చితి మంటలపై చేరిన నా జీవితాన్ని నీ చేతుల్లోకి తిసుకున్టావని...ఆశతో......

నాకు మరో లోకం లేదు...


కనులు మూసుకొని జీవిస్తున్నా..
కలలోనైనా కరునిస్తావని.

నిత్యం ఎదురుచుపులతో బ్రతికేస్తున్నా...
ఏనాటికైనా నా దరికి చేరుతావని.

మదిలోని కబుర్లన్నీ మేఘాలతో చెబుతున్న...
బీడువారిన మనసు పొలంలో చినుకువై వర్షిస్తావని.

నా చుట్టూ నిలిచిన అన్నింటా నిన్నే చూస్తున్నా...
నీవు తప్ప నాకు మరో లోకం లేదని తెలుసుకుంటావని
.

Wednesday, September 2, 2009

నువ్వు తప్ప!!!




నువ్వు నాకు గుర్తొస్తే
ఎవరు ఉండరు...నీ జ్ఞాపకం తప్ప...!
నువ్వు నా పక్కనుంటే....
అసలు నేనే ఉండను, నువ్వు తప్ప...!

ఏమని అడుగుతావు.....?




నిన్ను తొలిసారి చుసిన క్షణం కోసం..
నీ రూపం మరవలేను నా కనులని అడుగు....
నీ జ్ఞాపకాలకోసం..
తలచుకోని క్షణమంటూ లేని నా కాలాన్ని ఆడుగు.....
నీపై ప్రేమ కోసం..
మదిలోని వెలకట్టలేని నీ రూపాన్ని అడుగు....
నిన్ను ప్రేమించిన కాలంకోసం..
కడసారిగా కనుమూసిన క్షణాన నా హృదయాన్ని అడుగు....
ఎలా అడిగిన...... ఏమని అడిగిన...
మదిలో కొలువైన రూపం చెరిగిపోదు...
వేరొక రూపం దరి చేరదు......

నా హృదయం



నీ చుట్టూ కటిక చీకటి
అనుక్షణం స్పందించే గోడలు
ప్రవహిస్తున్న ఎర్రని రక్తం ఉందని
ఏ మాత్రం భయపడవద్దు
నీవు సురక్షితమైన ప్రదేశంలోనే ఉన్నావు
అది నా హృదయం.............

ఒక్కసారైనా జన్మిస్తాను


నేనంటూ బ్రతుకుతున్నది నీ ప్రేమకోసం...
నీ గాలి స్పర్శ తగిలితే చాలు మనసంతా ఏదో మైకం..
నీవు కాదంటే నా జీవితం నరకం కన్నా హీనం...
నీ ప్రేమను పొందడానికి
కొన్ని వేలసార్లైనా మరణిస్తాను...
కాని ఒక్కసారైనా జన్మిస్తాను....ప్రియా......!!!
!!!

Tuesday, September 1, 2009

అంధకారం




నీవు లేక....నిదుర లేక
మనసు లేక మమత లేక
ఎంతకాలమో ఈ జీవనయానం
కదలలేక....మెదలలేక
కలలు రాక కలుసుకోక
ఎందుకోసమో ఈ జీవనరాగం
దినమొక యుగముగా
తనువొక సగముగా
ఎన్నాళ్ళో ఈ అంధకారం.........

నీతోనే మొదలు



నా జీవితం అనే కధకు మూలం నీవే
అది నీ రాకతో మొదలు అవుతుంది
నీవు వెళ్ళిపోతే ముగుస్తుంది
అందులో ప్రతి పదము నీవే.!!
ప్రతి పాఠము పేరు నీపేరే!
ప్రతి వాక్యము నేతోనే మొదలు.....

ఎందుకు నన్ను కలవరపెడుతున్నావు????

ప్రియా........

నీ పండు.......

ఈ జన్మకు తరిస్తాను.......



ఆరాదించే ప్రేమను అభిషేకిస్తావో అసహించుకుంతావో
ప్రేమించే ప్రేమను పురస్కరిస్తావో తిరస్కరిస్తావో
నా మనసుకు తెలియదు గనుక
నా మనోభావాని నీ వలపు వాకిట పరుస్తున్నాను
నా ప్రేమను మన్నించి నీ ప్రేమను పంచిస్తే
ఈ జన్మకు తరిస్తాను

నిశబ్దం!!!

ప్రియా..! మరచిపోవద్దు



ప్రియా
ఆనాటి............
వెన్నెల పొద్దు
కౌగిలి హద్దు
తియ్యటి ముద్దు
మరచి పోవద్దు

ప్రియురాలి హృదయం...!




సాగరం
ఎంత లోతుందో ఎవరికి తెలుసు
నేలను తాకి దాగుండే ముత్యపు చిప్పకు తప్ప
ప్రియురాలి హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు
ప్రేమ అంచుల్ని స్పృశించే ప్రేమికునికి తప్ప...!!
 
29501