RSS

Monday, April 23, 2012

ప్రశ్నిస్తుంది......!!!




నమ్మకమే నేస్తమయినప్పుడు
ఆకురాలు కాలంలోనూ
ఆమనిగీతం వినిపిస్తుంది!
నమ్మకాలు వమ్మైనప్పుడు
తోడయిన నీడ సైతం
నువ్వెవరని ప్రశ్నిస్తుంది...!!!

ప్రశ్నార్థకం...!





రవిబింబమై నువు పయనిస్తుంటే
ప్రొద్దుతిరుగుడు పువ్వునై నిన్ననుసరిస్తా
మబ్బుల చాటున నువ్వు దాక్కుంటే
అచేతనంగా నాలో నేనే ముడుచుకుపోతా...!
నీ అడుగులో అడుగేస్తుంటే
ప్రపంచం అంచులదాకా నడుస్తానన్న విశ్వాసం
నువు కనుమరుగై నే ఒంటరినయితే
నా ఉనికే నాకు తెలియని ప్రశ్నార్థకం...!

Friday, April 20, 2012

ప్రేమాట.....




ప్రేమ జీవితం కాదు..జీవితంలో ఒక భాగం మాత్రమే..కాని ఆ భాగం లేకుంటే జీవితమే లేనట్టు

జీవిత ప్రయానంలో ఒక అందమైన ఆట విడుపు

మనీ- పంచేకొద్ది తగ్గుతుంది
ప్రేమ-పంచేకొద్ది పెరుగుతుంది

ఫరిచయమైన రెండు పదాల అపరిచిత భావం

ఫ్రే అంటే ప్రేమించడం..మ అంటే మరువలేకపోవడం
ఫ్రే మ అంటే ప్రేమించి మరువలేకపోవడం


మనసుకు అందని భావమే ప్రేమ...

ప్రేమంటే పొందడం కాదు... ఇవ్వడం మాత్రమే

ప్రేమ ఉల్లిపాయ లాంటిది
తేసేకొద్ది కన్నేల్లొస్తాయి
తీసాక ఏమి ఉండదు

ఫ్రేమించడానికి హృదయం కావాలి..కాని ప్రేమించబడడానికి ఇంకా చాలా కావాలి

లైఫ్ లో ప్రేమ మంచి కిక్ ఉండే గేం....గెలిసినా ఓడిపోయిన రెండిట్లో కిక్ ఉంటుంది.

ఏమని చెప్పను ప్రేమ గురించి .. ఫ్రేమ అనే ఈ రెండు ఆల్ఫబెట్స్ లేని జీవితం యెక్కడా వుందదేమో .... ఫ్రేమ లేనిదే జీవితం లేదు అనుకొంటుటారు అందరూ.... అలా అని అదే జీవితం అని చెప్పలేం కదా ....

ప్రేమ.........మధురమైన భావన.....
తీయనైన వేదన.........
అంతులేని ఆరాధన........
తీరని తపన.........
గెలుపు ఓటములు లేని సాధన.....

Thursday, April 19, 2012

అమ్మ....నాన్న.....







అమ్మ,నాన్న.... మీకై చిరు కానుక


తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.....
ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న....


కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అమ్మ....కాళ్ళ మీద నిలబడే వరకు కనుపాపలా కాపాడుతాడు నాన్న...


రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ....
ఎంతటి కష్టాన్ని అయినా ఆనందంగా భరిస్తూ బిడ్డలకి సంతోషాన్ని పంచుతాడు నాన్న....


తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ....
అప్పు చేసి అయినా పిల్లల భవిష్యత్తు ని అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న...


ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ...
మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న....


అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ....
జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప....


వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా.....
ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా ... ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దితున్న మా అమ్మ,నాన్నలకి నా ఈ చిరు కానుక...

అమ్మ , నాన్న ను ప్రేమించండి ... మనస్పూర్తిగా వారు అనుకోని సమయాల్లో మనతో ఏమైనా అన్నా .. మన మంచి గురించే
వాళ్ల దృష్టిలో ఎంత ఎదిగిన మనం చిన్న వాళ్లమే ...
ఎప్పుడూ .. వాళ్లను విడిచి దూరంగా , చూడకండి ...
ప్రేమించండి .. అవధులు లేకుండా..... మీరు పెద్దగా సంపాదించి ఇవ్వకపోయినా .. ప్రేమగా వాళ్లతో ఉంటే చాలు ..
 ... అమ్మ నాన్నలను ప్రేమించండి ...

Wednesday, April 18, 2012

మాత్రుదేవోభవ.........



మాతృత్వం కూడ ఓ ఉద్యొగమైతే...
ప్రపంచంలొ అత్యతిక జీతం అమ్మకే ఇవ్వాలి...
అమ్మ ముద్దల వెనుకే కాదు...
అమ్మ దెబ్బల వెనుక కూడ అపారమైన ప్రేమ ఉంటుంది...
దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం...
సృష్టిలొ ప్రతి జీవికి అమ్మ ఉండటం...
నీకంటు ఓ అస్తిత్వం లేనప్పుడు...
నిన్ను కొరుకునేది అమ్మ...
నువ్వెలా ఉంటావొ తెలియనప్పుడు...
నిన్ను ప్రేమించేది అమ్మ...
జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు...
నేనేమిచ్చిన తక్కువే...
బాల్యంలొ చలిపులికి వణుకుతుంటే...
వెచ్చని తన కౌగిలొ నిద్రపుచ్చుతుంది...
సమస్యలతొ సతమతమవుతుంటే...
ఆరాధనతొ నిండిన తన ప్రార్ధనతొ కాపాడుతుంది..
అమ్మ నీకు ఇదే నా పాదాభివందనం.........

Friday, April 13, 2012

నా మహారాణి.....



రవి వర్మ కుంచె నుండి - జాలువారిన చిత్రానివొ
బాపు చేతి కలము చేత - గీయ బడిన ఓ బొమ్మవొ
శ్రీనాథుడు సృష్టించిన - రమ్యమైన సుందరివొ
తెలుసు నాకు నీవెవరొ - నా మది గెలిచిన రాణివిలే
మహరాణివి నీవెలే.......

Friday, April 6, 2012

నా గుండెకు ఇక కదలికే రాదు.......



నీ కోసమే కలం పట్టాను
నీ కోసమే కలలు కన్నాను
కాదని కాలదన్నితే
కాటికి సాగనంపితే
జీవచ్చవమై బ్రతుకుతున్నాను
యదను పరచి స్వాగతిస్తే ....
నీవు వ్యధను పెంచి ఉసురు తీస్తే
శ్వాస బరువై భరిస్తున్నాను
మాటకు బదులు రాదు
పాటకు కదిలి రావు
తూట్లు పడిన నా గుండెకు ఇక కదలికే రాదు
కన్నీటి కలలకెదురుగా ఎన్నాళ్ళీ ఎదురీత
పదునెక్కిన మౌన శిలల మధ్య ఎన్నాళ్ళీ యదకోత
 
29501