RSS

Saturday, March 20, 2010

క్షుద్ర పూజలు (చేతబడి) నిజంగానే ఉంటాయ.....


నన్ను మరచిపోవడానికి నా ప్రియురాలి ఇంట్లో ఏవో పూజలు చేస్తున్నారంట
తను నన్ను మరచిపోకపోతే నన్ను బస్మం చేస్తానని వాళ్ళ అత్తమ్మ గారు పూనకం వచినపుడు చెప్పిందట 
తనేమో నాకు నిజంగా ఏదో చేస్తారని కంగారు పడుతుంది....
ఈ కాలాల్లో కూడా ఇంకా ఇలాంటివి ఉన్నాయంటార?
అసలు అలంటి పూజలు ఉంటాయ....అసలు నమ్మొచ్చ...
కానీ తను మాత్రం పూర్తిగా నేమ్మేసింది...
నన్ను మరచిపోడానికి ఆమెకు ఏదో పూజ చేసి నిమ్మకాయ తల కింద పెట్టుకొని పడుకో అన్నదంట...
ఇవ్వన్ని నిజంగా నమ్మొచ..

Wednesday, March 17, 2010

ఆర్యసమాజ్ లో పెళ్లి చేస్కోవడం ఎలా........?


మా ఇంట్లో గాని వాళ్ళింట్లో గాని ఒప్పుకునే దారులన్నీ మూసుకుపోయాయి
ఇప్పుడు ఇక మేము పారిపోయి పెళ్లి చేసుకోవడమే దిక్కు
బయట గుడిలో పెళ్ళే చేసుకోవడం మంచిదా...లేక ఆర్యసమాజ్ లో చేస్కుకోవడం మంచిదా...?
ఆర్యసమాజ్ లో చేసుకోవాలంటే కావలసిన రుజువులు ఏమిటో ఎవరైనా చెప్పగలరా.....???

Monday, March 15, 2010

ప్రేమకు కులం అడ్డు.... మరి స్నేహానికి...???


నా బుజ్జి వాళ్ళ నాన్న గారు నిన్న మా స్నేహితురాలి ఇంటికి వెళ్లి
నా గురుంచి, నా కులం గురుంచి అడిగారంటా....
అల అడుగుతూ అడుగుతూ....ఒక పెద్ద మాట అన్నారంటా
"ఎప్పుడైనా స్నేహం చేసే ముందు మనకన్నా పెద్ద కులం వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి" 
అని అన్నారంటా......
స్నేహం విషయంలోనే ఇంతగా ఆలోచిస్తున్నారంటే....మరి ప్రేమ విషయంలో ఇంకెలా ఆలోచిస్తారో మరి.... 
ఇప్పుడు చెప్పండి....వాళ్ళింట్లో నేను ఏమని మాట్లాడాలి....ఎలా ఒప్పించాలి..?

Friday, March 12, 2010

నన్ను ఏమి చేయమంటారు.........


ఇప్పుడు నా ప్రేమ సంగతి నా బుజ్జి వాళ్ళింట్లో తెలిసిపోయింది.....అసలు మేమే చెప్పాలి అనుకున్నాము
కాని వాళ్ళకెలా తెలిసిందో అర్ధం అవడంలేదు. వాళ్ళింట్లో మాత్రం కులాంతర వివాహం అంటే ససేమిరా అంటారు
నాకేం చేయాలో తోచడం లేదు....మా ఇంట్లో వాళ్ళను నేను ఒప్పించ్చగలను....కానీ బుజ్జి వాళ్ళింట్లో ఎలా  ఒప్పించాలో తెలియడం లేదు...ప్రతి ప్రేమికులకు ఎదురయ్యే సమస్యే ఇప్పుడు మాకు ఎదురు అయ్యింది....కాని ఎలా అధిగమించాలో తెలియడం లేదు.
నాకైతే ఎప్పుడు ఏమి జరుగుతదో అని భయంగా ఉంది...నాకే ఇలా ఉందంటే తన పరిస్తితి ఇంకెలా ఉందొ......
ప్రేమకు, పెళ్ళికి "కులం" ఎందుకు....
తను "పద్మశాలి BC", నేనేమో "మాల SC"...
మరి వాళ్ళింట్లో కులం పిచ్చి ఎక్కువగా ఉంది....వాళ్ళతో మాట్లాడిన ఒప్పుకునే పరిస్తితి కనిపించడంలేదు
తనకు నేను కావలి...నాకు తను కావలి.....ఇద్దరం మేజర్సే...కానీ ఇద్దరికీ పారిపోయి పెళ్లి చేస్కోవడం ఇష్టం లేదు
వాళ్ళింట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో....ఏమని చెప్పాలో తెలియడం లేదు.....
ఈ పెద్దలు మారార.... పిల్లల ప్రేమను అర్ధం చేస్కోర....
చిన్నప్పుడు కొనే ప్రతి వస్తువుని...నీకు నచ్చిందా అని అడుగుతారు....
మరి పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకల ఆలోచించరు....
ఓ పెద్దలారా ఒక్కసారి ఆలోచించండి....మా ప్రేమను అర్ధం చేస్కొండి..
కలకాలం సంతోషంగా ఉంటాము  అనే వారిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండమంటార....
లేక మీరు ఎవరితోనే చేసే పెళ్లి చేసుకొని ఇష్టం లేకుండా చచ్చిన శవంలా బ్రతకమంటారా.... 
మా ప్రేమే వివలమైతే మీరు ఆనందిస్తారేమో....కాని మాకు మాత్రం యమపాషమే దిక్కు
మీలో ఎవరైనా కులాంతర వివాహం చేస్కునే ఉంటారు కదా.....మీరేమి చేసారో కాస్త చెప్పండి
మా ప్రేమకు మీవంతు సహాయం చేయండి దయచేసి..............

మెల్‌బోర్న్‌లో ప్రేమ....యాదగిరిగుట్టలో పెళ్లి....


మనసులో మెదిలే భావాలు…. ఊహకందని రాగాలు. వాటిని అదుపులో వుంచటం ఎవరికి సాధ్యం కాదు. అది ప్రేమైతే ఇక చెప్పనవసరమే లేదు. ఆ… సరిగమల తాకిడికి చిత్తవని హృదయం వుండదు. గుండె లోతుల్లో చిగురించే ఆ ప్రేమ… ఓ రెండు హృదయాలను ఒక్కటి చేసింది. ఖండాంతరాలు దాటిన వారి సరాగాల ప్రేమ పల్లకిపై టీవీ5 ప్రత్యేక కధనం అక్కడ అమ్మాయి … ఇక్కడ అబ్బాయి… ఇదేదో సినిమా టైటిల్‌ అనుకుంటే పొరపాటే. ప్రేమకు కులం మతం అడ్డురాదని ఆస్తి ఆంతస్తు పట్టింపు లేదని అంటుంటారు. కాని ఈ సువిశాల ప్రపంచం కూడా క్షణకాలంలో చిగురించే ఈ రెండక్షరాల ప్రేమకు అతీతమేం కాదు. గుంటూరు జిల్లాకు చెందిన నర్సింహ చైతన్య విషయంలో కూడా అదే జరిగింది. ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళిన అతనికి అక్కడే మెల్‌బోర్న్‌కు చెందిన లుచియాతో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. మామూలుగానే ప్రేమకు ఎదురయ్యే సమస్యలన్నీ ఈ జంటకు హాయ్‌ చెప్పాయి. కాని అచంచల ఆత్మవిశ్వాసంతో వారు పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్ళిపీటల దాకా తీసుకొచ్చారు. దాంతో ఇండియాకు తిరిగివచ్చి యాదగిరి గుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ఒక్కటయ్యారు. అందమైన గులాభి లాంటిదే ప్రేమ. పరిమళాలు వెదజల్లే ఆ ప్రేమకు ముళ్ళ లాంటి సమస్యలు వుంటాయి. ప్రియురాలి కోసం… ప్రేమికుడు ముళ్ళను అధిగమించినపుడే విజయం సొంత మౌతుంది. ప్రేమ కలకాలం అతనితోనే వుంటుంది.

జయహో ప్రేమా...............
  
 
29501