RSS

Monday, October 22, 2012

ఇడియట్....??




"నాన్నా, నోనొక అబ్బాయిని ప్రేమించాను"
అని అమ్మాయి వాళ్ళ నాన్నతో చెబితే...
"ఎవడా ఇడియట్? అంటారు.
"నాన్నా నేనొక అమ్మాయిని ప్రేమించాను"
అని అబ్బాయి వాళ్ళ నాన్నకు చెబితే-
"ఇడియట్, ఎవరా అమ్మాయి" అంటారు..

నీతి: ఎవరు ఎవరిని లవ్ చేసిన నాన్న దృష్టిలో అబ్బాయి ఎప్పుడు ఇడియటే!

ఫైనల్ మ్యాచ్..!









ఒక అమ్మాయి పెళ్ళికి ఆమె ఎక్ష్-బాయ్ఫ్రెండ్ వచ్చాడు.
కొందరు ఆ అబ్బాయిని అడిగారు....
"స్మార్ట్ గా ఉన్నారు. మీరేనా పెళ్ళికొడుకు?"
దానికి ఆ అబ్బాయి ఇలా జవాబు ఇచ్చాడు.
"కాదు సెమిఫైనల్ వరకు వచ్చి ఓడిపోయాను,
ఫైనల్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను!"

కింది నుంచి పైకి....






అబ్బాయ్: ఈరోజు కోసం నేను ఎన్నో రోజుల నుంచు ఎదురుచూస్తున్నాను.
అమ్మాయి: నన్ను వెల్లమంటావా?
అబ్బాయ్: నో....నో...
అమ్మాయి: డు  యు లవ్ మీ?
అబ్బాయ్: నిన్న-అవును, ఇవ్వాళ-అవును, రేపు-అవును
అమ్మాయి: నన్ను మోసం చేస్తావా?
అబ్బాయ్: నో, అవసరమైతే చనిపోతాను.
అమ్మాయి: నన్ను ముద్దు పెట్టుకొవలని ఉందా?
అబ్బాయ్: యస్...ఐ లైక్ ఇట్!
అమ్మాయి: నువ్వు నన్ను కొడతావా?
అబ్బాయ్: నేను అలాంటి మనిషిని కాదు
అమ్మాయి: నేను నిన్ను నమ్మవచ్చా?
అబ్బాయ్: యస్.
అమ్మాయి: ఓహ్...దార్లింగ్ !


పెళ్లి తరువాత...
కింద నుండి పైకి చదవండి....

గమనిక: సాక్షి పేపర్ లో నుండి సేకరించినదిగా గమనించగలరు

Friday, October 5, 2012

వివాహాలు.....!!!






భ్రాహ్మీ, దైవ (ఆర్షం) ప్రజాపత్య, రాక్షస, అసుర, కన్యాశుల్క, గాంధర్వ, పైశాచిక మని వివాహాలు ఎనిమిదైన, ఆర్యధర్మ ప్రకారం వివాహాల్లో నాలుగు రకాలు ప్రఖ్యాతం,

1 భ్రాహ్మీవివాహం
2 గాంధర్వ వివాహం
౩. క్షాత్ర వివాహం
4 రాక్షస వివాహం

నాకు తెలిసిన రెండు వివాహాలను చెప్పదలచుకున్నాను....

భ్రాహ్మీవివాహం: ఋషి సంప్రదాయ బద్దమైన భ్రాహ్మీవివాహం ఆర్యసమ్మతమైన వివాహం, వధూ వరుల కుల పెద్దలు, తల్లిదండ్రులు అనుమతించి అంగీకరించి, ఆశీర్వదించి వైదిక విధితో ఆచారయుక్తంగా జరిపించేది భ్రాహ్మీవివాహం. ఇది సనాతన జన సమ్మతం! సత్సంప్రదాయం.

గాంధర్వ వివాహం: యువతీ యువకులిద్దరూ యుక్తవయసు గలవారైయుండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దలెవరి అంగీకారము లేకుండా, తమంతట తాముగా రహస్యంగా కానీ, వేరొకచోటికి పారిపోయి కానీ చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. ఈ వివాహం బ్రహ్మ వివాహమంతా గొప్పది కాదు...పవిత్రమైనది కాదు. శకుంతల దుష్యంతుని ఈ విధంగానే పెండ్లాడి కష్టాల పాలైంది. అందరి రాతలు రాసే బ్రహ్మ కుమార్తెకే తప్పలేదు ఇటువంటి కష్టాలు, ఇక సాదారణ రోజు కూలి చేసుకునే తండ్రికి పుట్టిన నాకు మాత్రం కష్టాలు తప్పవా  చెప్పండి.
అందుకే అనుభవిస్తున్నాను.

ఏమిటంటే, నూటికి తొంభై ప్రేమ వివాహాలు మంచి ఫలితాని ఇవ్వటం లేదు. యవ్వన ఉద్రేకాన్ని, సహజంగా యవ్వనంలో ఉండే ఆకర్షణను ప్రేమ అనుకొని పొరబడిపోయి ఎందరో తమ జీవితాలను పాడు చేసుకోవడం చూస్తున్నాము.

యవ్వన దశ చాలా ప్రమాదకరమైనది. యవ్వనమంటే ఒరిపిడి కలిగితే భగ్గున మండే అగ్గిపుల్లలాంటిది. మండటం మొదలయ్యాక పూర్తిగా మందు మొత్తం కాలేవరకు ఆగదు! యవ్వనదశ కూడా అంతే! అగ్గిపుల్లతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. వినియోగ పరచుకునేవారి వివేకం అది.

Thursday, October 4, 2012

నెమలిగా పుట్టాలని ఉంది.!





నాకంటూ మరో జన్మ ఉంటె కనుక నేను మన జాతీయ పక్షి
నెమలిగా జన్మించాలని కోరుకుంటా....
ఎందుకో చెప్పనా..........!
ఈ స్ప్రుష్టిలో ఆడమగ కలిసి
సంభోగం చేయని ప్రాణి నెమలి ఒక్కటే!
మగ నెమలి కంటి నీటిని త్రాగి ఆడ నెమలి గ్రుడ్డు పెడుతుంది
ఈ పవిత్ర పక్షి ఈకలు తలపై ధరించిన కారణం తన పవిత్రతను
లోకానికి తెలియచేప్పటానికే....
అందుకే కారణ జన్ముడైన శ్రీ కృష్ణుడు
తన సిగలో నెమలి పించం ఉంటుంది......
అందుకే మరు జన్మంటూ ఉంటే నెమలిగా పుట్టాలని ఉంది!

దేవుడు ఎందుకు కనిపించడు...??






ఎందుకు కనిపించడు!
దేవుడు తప్పకుండా కనిపిస్తాడు.
ప్రతివారికి, ప్రతిరోజూ, ప్రతిచోట, ఎక్కడో ఒకచోట కనిపిస్తుంటాడు
మనమే అతనిని గుర్తించడం లేదు.


ఒకసారి తొందరలో రోడ్డుకి అడ్డంగా వస్తుపోయే వాహనాలను గమనించకుండా పరిగెత్తావు గురుతుందా! నీ వెనుకనుండి నీకు తెలియని నీకు సంబంధం లేని ఎవరో "బాబు! బస్సొస్తుంది" అంటూ కేకవేసారు. గుర్తోచిందా! ఆ కేక వేయించిదేవరో గుర్తించావా! ఆయనే దేవుడు!

మరొకసారి మోటర్ స్కూటర్ ఎక్కి కుడి ఎడమలు గమనించకుండా పనితోన్దరలో దూసుకొని పోబోతుంటే కాకి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి (పోలీసు) నిన్ను గట్టిగ మందలించాడు. గుర్తుకు వచ్చిందా! ఆయనే దేవుడు!

మరల ఒకసారి నడివీధిలో ఒకడి చొక్కపట్టుకొనే వాడిని నాలుగు గుద్డుతూ వానిచేత నాలుగు గుడ్డిన్చుకుంటూ క్రింద పడి పైనపడి చొక్కా చించుకొని ఉన్న సమయంలో దారినబోయే ఒకాయన "ప్లీజ్జ్స్సార్! వదిలేయండి! తెలిసినవారు మీరుకూడా" అంటూ మిమ్మల్ని ప్రక్కకు నెట్టిన ఒక మనిషి గుర్తున్నాడా నీకు! అయ్యో ఆయనే మనిషిరుపంలోని దేవుడు!

ఇన్ని సార్లు నీ వద్దకు తనంతతానుగా వచ్చినా గుర్తించలేదా!

మనిషి రూపంలో వస్తేనే చుడలేకపోయవ్. ఎంత పిచ్చివాడివి!
అనంతానంత దివ్య శక్తులతో వస్తే నీవిన్కేం చూస్తావ్?!?
అందుకే అసలు రూపంలో కనిపించడు నీకు.

పైన చెప్పిన సంగటనలు నాకు జరిగినవే అని గమనించగలరు.

Wednesday, October 3, 2012

అమ్మో అమ్మాయిలు.......




వేమన......
ఇతని గురుంచి యావత్భారతానికి తెలుసు,
ఇతని గురుంచి ఒక పుస్తకంలో చదివిన
విషయం ఏమిటంటే....
మహారసికుడైన వేమన తన ప్రియురాలు
విశ్వదను నగ్నంగా చూడడం వల్లనే
విరక్తి కలిగి పరమ యోగిగా మారిపోయి
చివరకు దిగంబరుడు అయ్యాడట......

Monday, October 1, 2012

ఏది గొప్ప.....?



ప్రేమించడం గొప్పా???
ప్రేమించబడడం గొప్పా....???

ప్రేమించడం: మన మనసుకు నచ్చిన వాళ్ళను ప్రేమిస్తాము, వాళ్ళు హితులు కావొచ్చు, సన్నిహితులు కావొచ్చు, స్నేహితులు కావొచ్చు, కాని వాళ్ళు మనల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా......లేక మనము మనసులో ఏదైనా అనుకుంటామో అని భయంతో వాళ్ళు ఒకే అంటారో నా మట్టి బుర్రకు అర్ధం అవడం లేదు.

ప్రేమించబడడం: నాకు తెలిసినంత వరకు ప్రేమించడం మాత్రమే గొప్ప  అని అనుకుంటాను. కాని అప్పుడప్పుడు మాత్రం ప్రేమించడం కన్నా  ప్రేమించబడడం గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే మనము ప్రేమించిన వాళ్ళ కంటే మనల్ని ప్రేమించే వాళ్ళను ఎంచుకోవడం మంచిదని నా అభిప్రాయం. కాని రెండు గొప్పే అని ఎప్పుడు అనిపిస్తదో అని ఎదురుచూస్తున్నాను.
 
29501