RSS

Wednesday, February 3, 2010

హారతి కర్పూరంలా..........


ఒకప్పుడు......
అంతులేని విశ్వాసం ఉండేది నాలో
గట్టు తెగిన గోదారిలంటి ఆవేశం ఉండేది
అప్పుడు నాకు తెలియదు....అదంతా నా వయసు తొందరని
ఆలోచించనివ్వని ఆవేశం...అనుకోని ఇక్కట్లలోకి తోసింది
ఆవేశం మనిషి ఆలోచనల్ని బందిస్తుందని తెలుసుకునే సరికి
నా సగం జీవితం ఖర్చయి పోయింది
వేకువకి వేకువకీ మధ్య ఎన్ని ఆశలో
అవన్నీ అనుభవంలోకి రాకుండానే గడుస్తోంది కాలం...నిశ్శబ్దంగా జారుకుంటోంది కాలం

అరిగేలా నడిచే కాళ్ళకు....కరిగేలా చూసే కళ్ళకు.....తహ తహలాడే తనువుకు తప్ప నీకేం తెలుసు…
నీ కోసం నా హృదయం హారతి కర్పూరంలా కరిగి పోతొందని.
నీకు తెలుసా ప్రియా!
నా ప్రపంచం నీవేనని.... నా కన్న వాళ్ళూ.. నాకయిన వాళ్ళూ నీవేనని!
నా ఊహల్లో ఊసుల్లో.....నా ఆశల్లో – బాసల్లో.....కళ్ళల్లో – గుండెలో
నా మనసులో – మమతలో....నీవేనని… నీకెలా తెలుపను
ఎడారిలో నీటి బిందువును చూస్తే ఎంత ఆనందమో
నా జీవిత పయనంలో నీ తీపి ఙ్ఞాపకాలు అంతటి ఆనందం
నువున్నావన్న ఆలోచనే నాకు వెయ్యేనుగుల బలం
వెళ్ళకు…వెళుతూ.. వెళుతూ…నా హృదయాన్ని గాయపరచకు...నాకు విషాదాన్ని మిగల్చకు
రాత్రి గడుస్తోందటే చాలు.......ఉదయం గురించి భయం వేస్తుంది

మన ప్రేమ నాకు చావు బ్రతుకుల మధ్య యుద్ధం లాంటిది
కళ్లు మూస్తే కలలో...కళ్లు తెరిస్తే ఇలలో
ప్రతి పువ్వులో నీ నవ్వు...అనుక్షణం కవ్విస్తుంటే
స్పందిస్తున్న ఈ గుండె చప్పుడు నీకు వినిపించేదేప్పుడు
నువ్వు నాకు సొంతం అయ్యేదేప్పుడు

4 మీ మనసులోని మాటలు:

చెప్పాలంటే...... said...

Assalu ame ku chepparaa ledaa!! Me prema sangati?

Unknown said...

తనకు చెప్పడం జరిగింది...తను కాస్త aalasyamga oppukovadam kuda jarigipoyindi.......ippudu ma peddavallanu oppinche panilo unnamu.......kaani vallintlo caste feeling chala chala ekkuva.......maa intlo kuda anukondi......maa intlo nenu oppinchagalanu...but vallintlo oppukovadam chala kashtame.........tananu oppinchadaniki nenu chala kashta paddanu.......tane anta latega oppukundi ante ika vallintlo vallu ela oppukuntara ani na benga........tanu vallintlo vallanu vadili natho raanani cheppesindi.....ika naku valla intlo oppinchadame na premaku maargam........tanaku nenu kaavali, valla intlo vallu kuda kaavali antundi........kaani tanu lekunda maatram nenu bratakalenandi................kaalame na premaku daari chupinchali ika

Padmarpita said...

మీరన్నట్లు కాలమే కొన్నింటికి పరిష్కారం చూపుతుంది.

Unknown said...

మన సమాజంలో కులం, మతం అనే మత్తు వదలద ఇక......ఈ కులాలు మతాలూ దేవుడే స్ప్రుష్టించాడ.......ఫలానా మనిషి ఫలానా కులం లోనే పుట్టాలని దేవుడు ముందే వ్రాసి పెడుతాడ........ఏంటోనండి ఏమి అర్ధం అవడం లేదు.......జీవితం అంత ఒక (?)లా ఉంది

Post a Comment

 
29501