RSS

Friday, September 18, 2009

ప్రేమ వ్యవ(సాయం)హారం..........!!!!




ప్రేమ, పైరూ ఒకలాంటివే. "ముందు మనసనే భూమిని దున్నాలి.
స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి.
ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి.
కులమతం, రాజకీయం అనే చీడల నుండిరక్షించుకోవాలి.
అప్పుడుగానీ ప్రేమ అనే పైరుచేతికిరాదు.”

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు.
నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోవవ్వాలి.
కళ కన్న ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.
ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.

ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో...
ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.

ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
ప్రేమ ఇంధ్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ - "ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్సత, స్పర్శ, కామం, ఓదార్పు”
ప్రేమంటే సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా, ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకరి స్మృతులు మరొకరికి చేరాలి.

0 మీ మనసులోని మాటలు:

Post a Comment

 
29501