RSS

Wednesday, September 23, 2009

పెద్దల మాట చద్దనం మూట........!!!!




ప్రేమ అంటే...ఎవరినైతే తన ప్రేమికుడు/ ప్రేమికురాలిని ప్రేమిస్తుంటారో, వారు తను ప్రేమించేవారినుండి తిరిగి మళ్ళీ అదే ప్రేమను పొందాలనుకోవడం అవివేకం అంటారు ప్రముఖ హిందీ కవి "కబీర్ దాస్"

కొంతమంది పురుషులు ప్రేమిస్తారు, కాని వారి ప్రేమలో కాసింత గాఢత తక్కువగానే ఉంటుంది, కాని స్త్రీ అలాకాదు, తన ప్రేమ స్థిరంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ద్వేషించడం ఎన్నడూ ఎరుగదని ఆచార్య రజనీష్ "ఓషో" అన్నారు.

ప్రేమ అనేది ఎప్పుడూకూడా తీసుకోవడం ఎరుగదు, దానికి తెలిసిందల్లా ఇవ్వడమే. ప్రేమ అనేది కష్టాన్ని సహిస్తుంది. ప్రేమకు పగ, ప్రతీకారం అనేది తెలియదంటున్నారు జాతిపిత "మహాత్మా గాంధీ."

ప్రేమకు కళ్ళుండవు అది ఎప్పుడూకూడా హృదయంనుంచి మాత్రమే చూస్తుంది, కాబట్టే ప్రేమ గుడ్డిది అన్నారు. అని ప్రముఖ ఆంగ్ల కవి "శేకేపియర్స్" అన్నారు.

పువ్వు పరిమళం ఎలాంటిదో ప్రేమకూడా అలాంటిదేనని "జార్జ్ బెర్నార్డ్ షా" అన్నారు.



నిజమైన ప్రేమ ఏమిటో సహజీవనం చేస్తేనే తెలుస్తుంది.
ప్రేమంటే ఒక వ్యక్తిలోని మంచితనాన్ని ,మంచి గుణాలని ,
కేవలం ఆ ఒక్క వ్యక్తినే ప్రేమించటం కాదు.
ప్రేమంటే 'నువ్వు ఇలా మారు,అలా మారు.అప్పుడు నిన్ను బాగా ప్రేమిస్తాను' అని కండిషన్స్ పెట్టడం కాదు.
ప్రేమంటే -- ఒక వ్యక్తితో పాటూ ఆ మనిషి తాలూకు ప్రపంచాన్ని కూడా ప్రేమించటం.
అది మన ప్రపంచం కన్నా విభిన్నంగా ఉన్నా సరే.
అవతలి వారి అభిప్రాయాలు ,అభిరుచులూ భిన్నంగా ఉన్నా సరే వాటిని గౌరవించటం .
ముఖ్యంగా ఒక మనిషి లోని 'లోపాల్ని' కూడా సుగుణాలతో సమానంగా స్వీకరించగలగటం షరతులు పెట్టకుండా బేషరతుగా ప్రేమించగలగటమే ప్రేమంటే!!
ఎందుకంటే 'ఇవ్వటంలో' ఉన్న ఆనందం,హాయి అనుభవంతోనే అర్ధం అవుతాయి !! "ప్రేమికుడు పండు"

0 మీ మనసులోని మాటలు:

Post a Comment

 
29501