నీ ఆకలి తీరకున్నా...మా ఆకలి తీరుస్తున్నావు
ప్రపంచానికి అన్నం పెట్టి....నువ్వు గంజితో సరిపెట్టుకున్నావు
ఏ ఫలము ఆశించని నీ త్యాగానికి వందనం
బరువెక్కిన హృదయం, బక్క చిక్కిన శరీరం వద్దంటున్న
అందకున్న ఏ సాయం, ఆపనన్నావు వ్యవసాయం
సాటి లేని నీ ఆత్మవిశ్వసానికి వందనం
ప్రకృతి సహకరించలేకపోయినా....వర్షం పలకరించకపోయినా
కష్టపడితే కరుణించే మట్టి తల్లిని నమ్ముకున్నావు
అంతు లేని నా నమ్మకానికి వందనం
దళారులు మోసగిస్తున్న...నేతలు పట్టించుకోకపోయినా
సమస్యలను ఎదిరిస్తున్నావు, సేద్యాన్ని కొనసాగిస్తున్నావు
ఎదురులేని నీ ధైర్యానికి వందనం
మనకోసం కష్టపడే కర్శకుడ్ని గౌరవిద్దాం
ఆకలి తీర్చే అన్నదాతకు ఆకలి చావు లేకుండా చేద్దాం
రైతును సేవించే భాద్యతను అదృష్టంగా భావిద్దాం....
ఇది వ్రాసింది నా స్నేహితుడు....ప్రత్యేకంగా ఈ బ్లాగ్ లో పెట్టడానికి కారణం రైతన్న అయిన మా "నాన్న" కోసం
నాన్న... నీకు పాధాబివందనం...
5 మీ మనసులోని మాటలు:
చక్కగా చెప్పారు.
thanx for your comment, credit goes to one of my frnd
nice one nijanga raitulanu gurtinchaalandi..
thanx for ur comments shruti gaaru....
అద్భుతంగా చెప్పారు గురు గారు
Post a Comment