RSS

Friday, December 28, 2012

ఏది నిజం....ఏది అబద్దం....




కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, ప్రాణం లేని మనసు....ఉన్న ఒకటే లేకకపోయిన ఒకటే

ఆశ కాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది,
భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది.

అడిగిన దానికి సమాధానం చెబితే తెలివితేటలూ అంటారు
చెప్పకపోతే పొగరు అంటారు..... మరి నన్నేమి చేయమంటారు?

నువ్వంటే ఎందుకిష్టమో చెప్పలేను గాని, ఎంత ఇష్టమో చెప్పగలను

క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు,
కాని ఎక్షమ్ లో వ్రాసే వాడే టాపర్ అవుతాడు

మనకు తెలిసిన పని ఫ్రీ గా చేయకూడదు
మనకు రాని  పనిని ట్రై చేయకూడదు 

బ్రతకడమే కష్టం అనుకున్నప్పుడు బొంగులోది "మంచి" ఏంటి "చెడు" ఏంటి


ఆకలి వేసినప్పుడు తినడానికి తిండి ఉండి తినకపోవడం ఉపవాసం,
నిదుర వచ్చినపుడు ఎదురుగ మంచం ఉండి కూడా పడుకోకపోవడమే జాగారం,


అమ్మా.. ఆడది ఎలాంటి భర్త ఉంటె సుఖపడుతుంది..?
"కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ అని ప్రతి వాళ్ళు ఆడది ఎలా ఉండాలో చెప్పారు కాని మగాడు ఎలా ఉండాలో, ఎలా ఉంటె ఆడది సుఖపడుతుందో ఎవ్వరు చెప్పలేదు.. బహుశా పురాణాలు మగవాళ్ళు రాయడం వల్ల వాళ్లకి ఈ ప్రశ్న ఎపుడూ తట్టి ఉండదు..

మా అమ్మ నాకో మాట చెప్పేది , చాల మంది మగాళ్ళకి డబ్బు సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న భార్య ప్రేమ సంపాదించడం మీద ఉండదు అని..

ఇపుడు చాల మందికి పెళ్లి అంటే పుట్టిన రోజు కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి చేస్కునే ఒక ఫంక్షన్ ,, కాని నిజానికి పెళ్ళంటే ఒకే గదిలో రెండు వేర్వేరు కుటుంబాల నుంచి, అలవాట్ల నుంచి వొచ్చిన మనుషులు కలిసి బ్రతకడం ..

అందుకే పెళ్లి అయ్యాక ఏ మగాడు అయితే 'నేను' అనే మాట కంటే 'మనం' అనే మాట ఉపయోగిస్తారో అలాంటి వాళ్ళ దగ్గర భార్య సుఖపడుతుంది..


2 మీ మనసులోని మాటలు:

చంద్రశేఖర్ కాటుబోయిన said...

chalaa bagundi...

Unknown said...

thanx chandrasekhar gaaru....

Post a Comment

 
29501