అబ్బాయిలు:
మనసులో ఉన్న భావాలను ధైర్యంగా తనకు నచ్చిన అమ్మాయితో చెప్పడం కొంతమంది అబ్బాయిలకే సాధ్యం. అందులో నేనొకడిని. అదేవిధంగా ఆమెపై తనకు గల ప్రేమను వ్యక్తపరిచినపుడు, ఆ అమ్మాయి దానిని తిరస్కరించినా, బాధపడక స్పోర్టివ్‌గా తీసుకుని, స్నేహితులుగా ఉందామని ఒప్పించే నైజం కలిగి ఉంటారు కొందరు. స్నేహంలో తన మంచితనం ఎటువంటిదో ఆమెకు చూపించడం ద్వారా, తిరిగి ఆమె మనసులో స్థానం సంపాదించుకుంటారు.
కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారో తెలియదు కానీ... ఎవరితోనూ కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడని ఓ అందమైన అమ్మాయి, తెల్లారేసరికి అతని ప్రక్కనే ప్రత్యక్షమవుతుంది. ఇదెలా సాధ్యం...? దీనినే తొలిచూపు ఆకర్షణ అనుకోవాలా..? సదరు అబ్బాయి తీయని మాటల బాణాలు ఆమె ఎదలోతులను మృదు"మధు"రంగా స్పృశించి మనసు చలించి, అతనితో (ప్రేమకు)స్నేహానికి ఓకే చెప్పింది అనుకోవాలా..? అసలెలా అంత త్వరగా ఓ అమ్మాయి సదరు అబ్బాయి వెంట చనువుగా తిరుగుతుందీ... అనే ప్రశ్న చాలామంది కుర్రాళ్లను వేధిస్తుంటుంది.???అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే రై.. రై.... మంటూ బైక్‌లో దూసుకెళుతూ, చక్కర్లు కొడుతుంటారు. అబ్బాయి అమ్మాయి వెంట పడీ పడీ అలసిపోయి, అవమానాలు, సత్కారాలు, తిట్లు, చెప్పుకుంటే ఎన్నెన్నో.... అమ్మాయితో పరిచయం పెంచుకోవడానిక అన్ని అవస్థలు పడుతుంటారు, కానీ అమ్మాయి నుంచి రెస్పాన్స్ ఉండదు. అసలు అమ్మాయిని ఆకర్షించడం ఎలా?
అమ్మాయిలు:
అబ్బాయిల ప్రేమని పొందడానికి అమ్మాయిలు చాల చిట్కాలే ఉపయోగిస్తారు. ఇద్దరమ్మాయిలు రోడ్ల పైన అల నడుచుకుంటూ వెళ్తుంటే......పక్కనుండే ఒకబ్బాయి నడుస్తుంటే.....ఇక ఆ ఇద్దరమ్మాయిల సంభాషణలు చెప్పనక్కరలేదనుకుంట... చూసావా వాడు నన్నే చూస్తున్నాడు అని మనసులో ఒకరికొకరు అనుకుంటారు....(కాని ఆ అబ్బాయి వాళ్ళను పట్టించుకుంటాడో కూడా తెలియదు) ఇది రోడ్ల పైన మనం రోజు చుసేటివే.....
ఇక వాళ్ళ ఇంటిదగ్గర అబ్బాయిల గురుంచైతే ఇక చెప్పక్కర్లేదు.....అబబ్బో ఎన్నో ఉహలు, ఎన్నో ఆశలు....వాడు నన్నే చూస్తున్నాడు అని తెగ మురుసిపోతారు.....కాని అక్కడ అబ్బాయి మాత్రం తూ తూ మంత్రంగనే ఒక చిన్న చిరున్నవు ఇచ్చి వాడి పని వాడు చేసుకుంటాడు. ఇంకోదరు అబ్బాయిలు మాత్రం ఇక అమ్మాయి కనిపించిందంటే చాలు లేని పోని బిల్డుప్ ఇస్తాడు అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యడానికి......వాడో హీరో....అమ్మాయో హీరోయిన్ మరి అన్నట్లుగా......
అమ్మాయిలు, ఒక అబ్బయిని నిజంగా ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవాలంటే, మొదటగా వాడిపై ఆ అమ్మాయి అభిప్రాయం తెలియాలి, ఆ అమ్మాయి చూసే చూపులకు అర్దాలు తెలియాలి, అమ్మాయి చేసే సైగలు తెలుసుకోవాలి,
ఇవన్ని తెలుసుకునే సరికి ఆ అబ్బాయికి తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేస్తాయి...
నిజం చెప్పాలంటే అమ్మాయిల ప్రేమను చాల తేలికగా తెలుసుకోవచ్చు. అదెలా అంటే ఆమె నిన్ను చూడగానే ఆ అమ్మాయి మొహం లో చాల మార్పులు వస్తాయి....నీపై ఇష్టం ఉంటె ఆమె మాట్లాడదు ......ఆమె కళ్ళు మాట్లాడుతాయి.....ఆమె పెదాలు మాట్లాడుతాయి, ఆమె చిరునవ్వు మాట్లాడుతుంది..... వీటిని అర్ధం చేస్కుంటే చాలు అది ప్రేమా.....లేక ఆకర్షణా అని తెలియడానికి.......
4 మీ మనసులోని మాటలు:
Day by Day u r becoming Like Love Guru Dear...
amayi side abayi side mery cheypthunaru anni......... edi trapppp anukuntaaaaa.......
శృతి గారు మీరు అనుకున్నట్లే నేను లవ్ గురు అవలనుకున్తున్నాను.....
రామ్ కుమార్ శర్మ గారు.....నేను చెప్పేది తప్పైతే, ఏది కరెక్ట్ మీరే చెప్పండి మరి
Post a Comment