RSS

Monday, August 31, 2009

మరవకు నేస్తమా


కిరణానికి చీకటి లేదు,
సిరిమువ్వకు మౌనమ్ లేదు,
చిరునవ్వుకి మరణం లేదు,
మన స్నేహానికి అంతం లేదు,
మరిచే స్నేహం చెయ్యకు,
చేసే స్నేహం మరవకు నేస్తమా!!!

అలకి అలుపు రాదేమో




నీ మొదటి ఆలోచన నా మదిని తాకినప్పుడు,
అది నా ఆలోచన ప్రవాహంలో కొట్టుకొచ్చిన అల ఏమో అని,
అన్ని అలల్లాగే అది కూడా ఎగసి పడుతుందిలే అనుకున్నాను..

ఆ రోజు నిను చూసినప్పుడు, నా గుండెలో తెలియని అలజడి..
నీవు నా ఎదురుగ, నేను నీ ఎదురుగ..
నీవు నన్ను చూడలేదు అని నే అనుకున్నా..
(కాని అమ్మాయి కళ్లు కొనచూపులో ప్రపంచాన్ని చుట్టేయగలవు అని తెలియలేదు..)
నీ వైపు చూడాలన్న తహ తహ ఒక వైపు, తెలియని భయం మరో వైపు..
ఎలాగైనా మరొకసారి చూడాలన్న నా కనుల కోరిక ముందు,
నా గుండె సవ్వడి వినిపించలేదు..

నే చూసా!!
ఆ చూపు నా కనుపాపలకి అందాన్ని పంచితే,
ఆ కనుపాపలు నా పెదవులకి ఆనందాన్ని అరువిచ్చాయి..

ఇంతలోనే నా కళ్లు నీ చూపుల తాకిడికి ఎర్రబడ్డాయి..
అప్పుడు నా గుండె సవ్వడి నే గెలుస్తున్నానన్న సంకేతాలని పంపుతూ ఉంది....
ఆ నీ చూపు, కోపంగా చూసిన ఏదో ఒక తెలియని చల్లదనపు అనుభూతిని మిగిల్చి,
రోజు ఇలా నా హృదయాన్ని తాకుతూనే ఉంది..

ఆ అలకి అలుపు రాదేమో..
సరే, పోనీలే అని వూరుకుందామంటే, అది అన్నింటిని ముంచేస్తోంది..

ఆ స్పర్శ నువ్వేనా!!



నా వూపిరిలోని గాలిలో, నీ శ్వాశ వెచ్చదనం నింపెను..
కనుల కలల తీరపు నిశీదిన, నీ రూపు జ్యోతిలా వెలిగెను..
నే పలికే ప్రతి పదమున, నీ గత స్మృతులే జతకలిసేను..
వినిపించే ప్రతి సవ్వడిలో, నీ మాటల గలగలలే జాలువారెను..
ఏమీ ఈ పిచ్చిదనమని,
నను నేను తడిమి చూడగా, ఆ స్పర్శన నువ్వే చేరావు.. !!

నా వెంటే ఉన్నావన్న ఆశతో



ఒంటరిగా వెళుతున్న జీవితంలోకి
అనుకోకుండా నువ్వొచ్చావు
అన్నీ తెలుసనుకునే నాకు
అనుభూతులెన్నో చూపించావు
ఎదురుచూపంటె తెలియని నాకు
ఎన్ని జన్మలయినా ఎదురుచూసేలా చేశావు
సృష్టి నిండా స్నేహం ప్రేమ రెండే గొప్పవనుకున్నాను
వీటికన్నా గొప్పది మన అనుబంధం అని తెలుసుకున్నాను
ఇద్దరు మనుషులు కలసి ఉంటేనే బంధం అనుకున్నాను
మనస్సులు కలిస్తే కూడా బంధమవుతుందని తెలుసుకున్నా
దూరంలో ఉన్నావని బాధలో ఉన్నా
నా వెంటే ఉన్నావన్న ఆశతోబ్రతుకుతున్నా ...

Tuesday, August 25, 2009

నాలో నువ్వు



రెండు హృదయాల స్పన్దనకు " ప్రేమ" అనే చినుకు పుట్టింది
ఆది ఇంతై , ఇంతింతై , వా గై సెలయెరై , నదై ఉరకలు వేసింది
చివరికి సముద్రమై నిలిచింది
ఆ ప్రేమ సముద్రంలో ఒక నావ
ఆ నావలొ నేను, నాలో నువ్వు.....!!

నీతో ఇలా!!!!



నిన్ను మరచనని తలచి...
నన్ను మరచి పోకుమా...
కదిలే గాలిని అడుగు...
నన్ను కదిలించిన నీ మనసును అడుగు...
పున్నమి రేయిలో ఓ వెన్నెల శిల్పంలా...
చలి రాత్రిలో ఓ వెచ్చని ఆలోచనలా...
నిన్న నీవు కట్టిన చీరలా...
నేడు నెతో ఉన్న నా మనసులా...
నా కంటి పాప కలలా...
చిరునవ్వులా...కన్నీరులా...నీతో ఇలా......!!

అలజడి




సూర్యుడు ఉదయించేవేల సుప్రభాతంలా...
చంద్రుడు కనిపించేవేల వేనుగానంలా ....
మల్లెలు వికసించేవేల సుగంధంలా...
నా మనస్సు స్పందించే వేల మనోగేతంలా ...
ఎందుకు నా మదిలో ఇంత అలజడి రేపుతున్నావు......!

నీ కోసం వేచివున్న!!



రాత్రి కోసం వేచి ఉన్న
ఉదాయ రాగం పలకాలంటు.!

మెరుపుల కోసం వేచి ఉన్న
నెమలిల ఆడాలంటు.!

వరద కోసం వేచి ఉన్న
చేపల ఎదురెడలంటు.!

మేఘం కోసం వేచి ఉన్న
వర్షంలా కురవాలంటు.!

వసంతం కోసం వేచి ఉన్న
కోయిలల పాడాలంటూ.!

నీ కోసం వేచి ఉన్న
నా మనసు తలుపులై
నీలోనే కారాగాలని.........!!

అమ్మాయిలా మజాకా!!



అమ్మాయిలను అర్ధం చేసుకోవడం మహా కష్టం………..


వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నమంటారు,
పొగడకపోతే సౌందర్య దృష్టి లేదంటారు.

చెప్పినదానికల్లా ఒప్పుకుంటే దూదుభసవన్నని వెక్కిరిస్తారు,
ఒప్పుకోకపోతే అర్ధం చేసుకునే మనసు లేదని నిందిస్తారు.

చక్కగా తయరయతే పూలరంగడు అని చురకలేస్తారు,
సింపుల్ గా వుంటే “తాతయ్యల టేస్ట్” అంటారు.

ఎక్కువ మాట్లాడితే ’బోర్ ’అంటారు,
మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు.

ముద్దు పెట్టుకుంటే జెంటిల్మెన్ వి కాదంటారు ,
పెట్టుకోక పోతే మగాడివే కాదు పొమ్మంటారు.

చెయ్యి పట్టుకోబోతే- అందుకోసమే కాసుకుని వున్నావంటారు,
బుద్ధిగా కూర్చుంటే ముద్దపప్పు అంటారు.

వేరే ఆడవాళ్ళ వయస్సు చూస్తే మగబుద్ధి అంటారు ,
వాళ్ళు వేరే అబ్బాయిల వయస్సు చూస్తే ‘క్యాజువల్ లుక్ ’అంటారు .

హే భగవాన్..…

నాలోనే



వేధానల వస్తావా
వేధంలా వస్తావా
గాయంల వస్తావా
గానంలా వస్తావా
క్రోధంలా వస్తావా
మొధంలా వస్తావా
ఉరిల వస్తావా
సిరీల వస్తావా
శిలల వస్తావా
శిల్పమ్‌లా వస్తావా
నువు ఎలా వచ్చిన స్వేకరిస్తా
ఎందుకంటే
నువు నాలోనే వున్నావు కనుక

Tuesday, August 18, 2009

మాటలెందుకు



వేయి మాటల్లో చెప్పలేని భావాన్ని
ఒక్క చూపుతో చెప్పొచ్చు!
వేయి చూపులతో చెప్పలేని భావాన్ని
ఒక్క మౌనంతో చెప్పొచ్చు!!

నిరీక్షణ



నీకోసమే ఈ నిరీక్షణ!
నీకోసమే ఈ అన్వేషణ!
నిన్ను చూసే ఆ క్షణం కోసం
కొన్ని వేల సార్లు మరణించిన
ఒక్కసారి జన్మిస్తాను ప్రియా!!

నా ఊపిరి !!



నా ఆశకు శ్వాస నీ ప్రేమ !
నా ఊహకు ఊపిరి నీ ప్రేమ !
నా తనువుకు ప్రాణం నీ ప్రేమ !
నా నడకకు గమ్యం నీ ప్రేమ !
అందరికి ఆదర్శం మన కమ్మని ప్రేమ !!
 
29501