RSS

Wednesday, December 30, 2009

నువ్వు కరుణిస్తే......



భ్రుకుటిలోంచి బాణం లాంటి చినుకు

కంటిలోంచి వెన్నెల బోలిన చినుకు

దేహన్ నుండి గాడాను రాగపు చినుకు

ఇన్ని రకాల చినుకులు చిలికి చిలికి

కోరికలను తట్టి లేపుతున్నాయి

అవి రగిలి అగ్ని పర్వతాలవుతున్నాయి

నువ్వు కరుణిస్తే ఆ చినుకులు ఆగిపోతాయి

నీవు కరునిన్చకపోతే ఇన్ని రకాల చినుకులు

నన్ను తడిపి తడిపి చంపుతాయి ప్రియా.....

మనసును చేసింది చోరి.......


నాకు వచ్చింది లవ్వేజి...
నాకు నచ్చింది ఓ పోరి...
ఆ సుందరాంగి పేరు బుజ్జి....
ప్రేమంటే ఏమిటో నేర్పి
నా మనసును చేసింది చోరి
దానితో చెప్పుకున్న నా లవ్ స్టొరీ
అంతలో వచ్చింది తల్లిదండ్రుల అడ్డుదారి
అప్పుడు అయ్యాను నేను ప్రేమ బికారి.......

అన్నీ నేనే అవుతా........




నిన్ను పిలిచే పిలుపు నేనవుతా
నిన్ను వెతికే చూపు నేనవుతా
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపు నేనవుతా
నీఎకు నాకన్నా మీ అమ్మ నాన్నే ముఖ్యమంటావ్ కదా......
మీ వాళ్ళకు నచ్చకుండా నీతో ఏడడుగులు వేస్తె......
నీ మనసు దిగాలవుతుందని తెలుసు....
నీ గుంగే చాటు భాదను నేను తీర్చుతా.....
నీ కంటికి రెప్పల కడవరకు తోదవుతా......
నా మనసే నీకిచ్చాను.....నిన్ను నాలో సగం చేస్కున్నాను కదా.....
ఇన్ని చేసే నేను.....మీ అమ్మానాన్నల చుసుకోలేనా ప్రియా.....

ప్రేమదారి...............

జీవితంలో వంద దార్లుంటాయి
వెయ్యి గల్లిలుంటాయి
లక్ష సందులుంటాయి
శతకోటి పిల్ల దారులుంటాయి
కాని నాకు మాత్రం ఒకటే దారి.......ప్రేమదారి.....
నువ్వు కాదంటే నా జీవితం ఎడారి.......

Tuesday, December 29, 2009

నీ ప్రేమదాసునిగా..........




నిన్ను చూస్తుంటే చలికాలం, ఎండాకాలం, వానాకాలాలు కాకుండా ప్రేమకాలాలు కనిపిస్తుంటాయి
పండు మిర్చి లాంటి పెదాలు, నల్లద్రాక్షల్లాంటి నయనాలు చూసి నేను ఫ్లాటై పోయాను
ఏది మరొక్కసారి నీ నవ్వు అనే అమృతపు జల్లు నాపై కురిపించు
ఆ అమృతాన్ని నేను తనివి తీరా ఆస్వాదించి అమరున్నై కలకాలం నీ ప్రేమదాసునిగా ఉండిపోతా
నిన్ను చూడకుండా ఉన్న రోజు నాకు పొద్దే పొడవదు
నీతో మాట్లాడకుండా ఉన్న రోజస్సలు నిద్రే పట్టదు
మొన్న నేను నేనుగా ఉన్నాను....నిన్న నేను నిన్ను చూసాను.....నన్ను నేను మర్చిపొయాను
ఇంకా చెప్పాలంటే నేను కన్ను తెరిస్తే నువ్వు......మూసుకుంటే నువ్వు
ఇంతెందుకు నువ్వు లేకపోతే నేను బతికున్నా చచ్చినట్టే...........

Saturday, December 26, 2009

నా ప్రేమాభివందనం.......






నాకోసం దిగి వచ్చిన దేవకన్య......నయనానందానికి ఇంపుగా
ఉహా సుందరివలె.....
నన్ను ఉహల్లో ఊరేగించి....మైమరపించిన ఓ దేవత...
నీకు నా ప్రేమాభివందనం

Wednesday, December 23, 2009

నా స్వప్నం చెదరనీయకు......




నీవు రోజు నాతో కలిసి ఉండకపోవచ్చు.......కాని నా ఉహల్లో ప్రతి క్షణం నాతోనే ఉంటావు
నాకు రాత్రి పగలు నిద్ర రాక సతమతమవుతున్న.....నా హార్ట్ ని హైజాక్ చేసావు
నా ప్రేమ నీకు స్వార్ధంలా కనిపిస్తుందేమో.....కాని స్వార్ధం ఉన్న ప్రేమే నిజమైనది
నా ప్రేమకు....ఆకాశానికి హద్దు ఒకటే
నాకు చావైనా......బ్రతుకైనా అన్నీ నీతోనే
నా స్వప్నం చెదరనీయకు....నన్ను నీకు దూరం చేయకు
నా సౌఖ్యమే ముఖ్యమని నేను అనుకోని ఉంటే.....
నీవు ఎప్పుడో నా సొంతం అయ్యేదానివి
కాని నాకు నీ ప్రేమతో పాటు......నీ ఆనందం కూడా కావలి
నా ప్రేమకు దారి చుపిస్తావో....లేక దహిస్తావో ఇక నీ ఇష్టం బుజ్జి.........

Friday, December 18, 2009

మళ్ళీ మళ్ళీ కావాలనుకునే మధురమైన క్షణం..........



ఓ ప్రియా....!
నిర్మల నీలి కన్నుల నీ సోయగాలు మధురం
నీ చిరు పెదవులు కురిపించు నవ్వుల వెన్నెల మధురం
అలలవలె పరుగులు తీసే నీ కోమల పాదాలు మధురం
పసిడి కాంతులీను నీ మేని ఛాయ మధురం
నా మనసుతో దోబూచులాడు నీ మనోహర రూపం మధురం
నిను చూసి మాటరాక నిలిచిపోయిన ఆ క్షణం మధురం
నిన్ను చూడాలని తపించు నా యెద అలజడి మధురం
నీకోసం నీరిక్షణలో తలచే ఆ తలపు మధురం
నా తోడు నీడ నీవై ఉండాలని నిలుస్తావన్న ఆ ఆశ మధురం
నిన్ను చూస్తూ ఉంటె నాకు పొద్దు తెలియని మధురం
ప్రతి క్షణం నీ ప్రక్కనే ఉండి, అ సమయాన్ని అపేయలనుకోవడం మధురం
మధురమైన ప్రేమ సాక్షిగా ఈ జగాన మిగిలిపోవు మన శాశ్వత అనుబంధం మధురం మృదు మధురం.......

ఆరోప్రాణం.......




నిన్ను చూడకపోతే నా కంటిపాప కలత చెందుతుంది
కలలో కూడా నీ రూపం నన్ను కలవర పెడుతుంది
పాపం నా కంటికి తెలీదు అది కలే అని.....
నా మనసును మాయ చేసావు......నా కవితకు ప్రాణం పోసావు......
నీ చేతితో ఒక మెతుకైనా అన్నం తినాలని ఆశగా ఉండేది......
కాని నిన్న నన్ను కరుణించి రెండు ముద్దలు పెట్టావు......
నా ఉహలకు ఆయువు అయ్యావు...నా ఆనందానికి అర్ధం తెలిపావు....
నా ఆనందానికి అవధులు లేకుండా చేసావు.....ఆశలనే శ్వాసగా జీవిస్తున్న....
నా పంచ ప్రాణానికి ప్రాణమా......కడవరకు నీతోడై నేనుంటా మన ప్రేమ సాక్షిగా....

Wednesday, December 16, 2009

ముద్దు ఎందుకో చెప్పనా.........



ముద్దు చరిత్ర......

కేవలం - రతీ మన్మధులకోసమే ఓ తీయని ఫలం పండేది. దాన్ని వారిద్దరూ ఏకాంతంలో రుచిచూస్తూ ఆ అద్భుతమైన తీయదనాన్ని ఆస్వాదిస్తూండేవారు.
ఇంత తీపిని మనమేకాదు ... మానవులక్కూడా పంచుదామా స్వామీ అడిగింది రతి.
అలాగే రతి. కానీ ఫలరూపంలో కాదు
మరి?
ముద్దు రూపంలో అన్నాడు రసిక మన్మధుడు.
అందుకే ముద్దు మన్మధుని మొదటి అస్త్రం


ప్రేమను వ్యక్తపరచే ఓ అద్భుతమైన సాధనం ముద్దు‌. బయొలాజికల్‌ భాషలో చెప్పాలంటే ఓ కెమికల్‌ రియాక్షన్‌ అన్నమాట. స్పర్శలతో తీరని కాంక్ష ఒకటి గట్టిగా గుండెను పట్టుకునుండిపోతుంది. ఎంత చూస్తున్నా ఇంకేదో చవిచూడాలనేభావం నిలవనీయదు. అందుకే ... క్షణానికోసారి వేడి ఆవిర్లు ... చల్లని వొణుకు రెండూ కలిసి రక్తవేగాన్ని పెంచుతాయి. పెదాలు వెచ్చగా ... ఏ కొలబద్దకు అందనంత ఉష్ణోగ్రతతో అదుర్తుంటాయి. అప్పుడు నీకు- దగ్గరగా ... చాలా దగ్గరగా కూర్చున్నపుడు - నిన్ను- ఒడిసిపట్టుకుని ముద్దుపెట్టుకోకుండా ఉండలేను. చెలరేగే తాపాన్ని ఓ చిన్న ముద్ది చ్చి తీర్చచ్చు కదా అని భావిస్తాను. పెట్టాలని మాకెంత ఇదిగా వుంటుందో పెట్టించుకోవాలని మీకు అంతే ఇదిగానే వుంటుంది. కాని బయటకి చెప్పడానికి మొహమాటం తో కూడిన సిగ్గు అడ్డు కదా మీకు....ఎందుకంటే మేము అమ్మాయిలం కదా అంటారు.......అదే - ముద్దంటే...

నేను ముద్దు ఎందుకు ఇస్తానో చెప్పనా.....

1 మనసులోని తీవ్రమైన తాపాన్ని తట్టుకోలేక ముద్దిస్తాను.
2 మన ఇద్దరి మద్య ఉండే ఘర్శనకి ఫుల్‌స్టాప్‌గా ముద్దు పెడుతను.
3 స్పర్శానుభూతిని అనుభవించడానికి ముద్దు ఇస్తాను.
4 నువ్వంటే నాకింతిష్టమని చెప్పడానికి ముద్దు ఇస్తాను.
5 నువ్వు దేవతలా కనిపించేసరికి కానుకగా ముద్దిస్తాను చెలీ......



ఒక్కో ముద్దుకు ఒక్కో అర్ధం

1 నిద్రనుంచి లేస్తూ నుదుటి మీద పెట్టే ముద్దు నిత్యముద్దు.
2 ముద్దలు తిన్పిస్తూ పెట్టే ముద్దు చెంపమీద చిరకాలం నిల్చే ముద్దు.
3 ఆఫీసుకెళ్తూ వొకరినొకరు యిచ్చుకునే ముద్దు ఉత్సాహభరితమైన ముద్దు.
4 గుర్తొచ్చినపుడు - ఫోన్లో మాట్లాడుకుంటూ ముద్దుతో క్రెడిల్‌ చేసే ఫోన్‌ ముద్దు లవ్లీ
ముద్దు.
5 ఇంటికి రాగానే అలసిపోయిన ఇద్దరూ ఒకరివొళ్ళో ఒకరు సేద తీర్చుకుంటూ చేతులమీద
పెట్టుకునే ముద్దు ఓదార్పు ముద్దు.
6. అడగకుండా ఒకరికొక యిచ్చుకునే ముద్దు ఆకాశమంత ముద్దు.
7 అందీ అందకుండా ఒకరికొకరు యిచ్చుకునే ముద్దు అబ్బ అనేంత ముద్దు
8 కొసరికొసరి పెట్టించుకునే ముద్దు కొండంత ముద్దు.
9 ఆపదల్లో - నీటి తెరకప్పిన కన్రెప్పలపై యిచ్చే ముద్దు ఆస్తంత ముద్దు.

ఇన్ని రకాల ముద్దల్లో నువ్వు ఇచ్చే మొదటి ముద్దుకోసం ఎదురుచూస్తూ.....


నీ పండు...........

Friday, December 11, 2009

నే నిన్నే ప్రేమించా




తోలి సారి నిను చూసి - నే మై మరిచా
ప్రతి రేయి ఊహలలో - నిన్నే తలిచా

రేయి పగలు – నీ అడుగులో అడుగై
అనుక్షణం - నీ వెంటే నడిచా

వెచ్చని కౌగిలిలో – నే కర్పూరం లా
కరుగుతూ - నీ బంధినై నిలిచా

దేహం రెండైనా – ప్రాణం ఒకటే లా
ప్రతి నిత్యం – నే నిన్నే ప్రేమించా
బుజ్జి.....ఐ లవ్ యు రా...........

నీవొక......



నీవొక
అందమైన ఫిగర్
నిన్ను చూడకపోతే వస్తుంది ఫీవర్
నిన్ను చుస్తే వస్తుంది పవర్
నీ పెదవుల్లో దాగి ఉంది షుగర్
నీ సొగసు ఓ అందమైన ఫ్లవర్
అందుకే అయ్యాను నీకు లవర్
నీ ముందు ఎవరైనా నెవెర్

Tuesday, December 8, 2009

పరుగాపని పాదం......



నలువైపులా నల్లని చీకట్లే ఎదురోస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతూ ఉన్నా
కనుపాప ఉప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీవైపే పయనిస్తూ ఉన్నా......!!

Tuesday, November 24, 2009

ప్రేమ ఇంధనం......





నా గుండెల్లో దాగిన ఉహవు నీవు...
నా ఉహకు చేరే ఊపిరి నీవు...
నా స్వచ్చమైన ప్రేమకు చిరునామా నీవు...
నా ప్రతి జన్మకు జతవి నీవు...
నా గుండె చేసే చప్పుడు నీవు...
నే నడుస్తుంటే తోడుగా వచ్చే నా నీడవి నీవు....
నా జీవితం అనబడే వాహనం సాఫీగా నడవాలంటే
ప్రేమ అనబడే ఇంధనం కావలి......అది నాకు ఇస్తావు కదూ....

నీ ఊహే నాలో.......




కనులు మూతపడితే కనుపాప నీవై .....
మనసు మంద్రమైన వేల నా మది తలుపులు తీసి ....
చికాకు పడ్డ నా మనసును నీ మాటలతో మురిపిస్తూ
హృదయమనే నా ముంగిట కరాల ధ్వనులు చేస్తావు.
నీ కేరింతలు నా గుండె లయలై ఈ ఊహకు ప్రేరణగా నిలిచి నన్ను నీ మనిషి గా మలిచాయి.
కేవలం నీ ఊహే నాలో ఇంతటి మార్పును తెస్తే??
ఇక నీ సహచర్యంతో నన్ను నేను ఎలా ఊహించుకోను??????

ఒక చిన్న మాట........




నిన్ను రోజు ఉదయాన్నే ఎందుకు ఫోన్ చేయమంటానో తెలుసా..?
నీ ముచ్చటైన మాటలతో నా ఈ రోజును మొదలుపెట్టాలని...
నీ ముసి ముసి నవ్వులు.....నీ చిలక పలుకులే.......
నాకు సుప్రభాతం ల వినిపిస్తాయి కనుక....
ఉదయం పూట నా ఫోన్ రింగ్ అవగానే
గాబరాగా నా ఫోన్ వైపు పరుగులు తీస్తాను....చేసింది నీవేనని....
ఆశగా దగ్గరకు వెళ్లి చుస్తే మరెవరో చేస్తారు....నాకు నిరాశే....!
నీవు చెప్పే ఒక చిన్న మాట "ఐ లవ్ యు"
అని ఒక్కరోజు చెప్పకపోయినా
నాకారోజు ఆయుష్షు తగ్గినట్టుగా ఉంటుంది చెలీ.......

Monday, November 23, 2009

నా చెలి మనసు...........





చిరు నవ్వులు

చిలిపి చూపులు

చిలక పలుకులు నా చెలికే సొంతం ...

సరస సాగరాల నా చెలి సొగసు

విరహ వయ్యారాల నా చెలి వయసు

ముద్దు మురిపాల నా చెలి మనసు నాకే సొంతం

నీవులేని నేను........




నీతోడు దొరకడం నాకు ఒకవరం..
నీవు లేకపోతే నాకు కలవరం..
నా జీవితం, నా ప్రాణం, నా సర్వం నీకే అంకితం..
గులాబీ లాంటి నిన్ను చేరుకోడానికి అడ్డుగావున్న ముళ్ళ గాయాల్ని లెక్కచేయ్యను
అమ్మ పొత్తిళ్ళలోని హాయినీ, నాన్న దగ్గర వున్నా చనువును నీలో కనుగొన్నాను
మంచులోని చల్లదనం వెన్నెల్లో వెలుగులు నీ లోగిళ్ళలో పొందగలను
నువ్వు నా చెంత వుంటే ఈ ప్రపంచాన్నే మరిచిపోయి ఉండగలను

నీవులేని నేను "దేవుడు లేని గుడి ఒకటే" ప్రియతమా.........

ఐ లవ్ యు.....




ఒకపరి నవ్వుల పువ్వులా
తదుపరి కోపపు ఝల్లులా
యోచనకందని చందనా
నన్నూరించకే వందనా
నే నేనేనా నువ్వయ్యానా….

తలపులు తాకే వేళ
మది తలుపులు వేస్తావేళ
కళ కళలాడే కవితా
మరి కవ్వించకే మ్రధులలితా

వేకువ వాకిటి ముగ్గులా
సాయం సంధ్యపు పొద్దులా
జాబిలి ముద్దుల చెల్లిలా
నను మైమరపించిన వెన్నెలా
ఐ లవ్ యు..... లవ్ యు రా……

Thursday, November 19, 2009

నీ ప్రేమికుడుని.....





నీవు తలుచుకుంటే నీ జ్ఞాపకాన్ని నేను...

నీవు మలుచుకుంటే నీ రూపాన్ని నేను...

నీవు పాడుకుంటే నీ రాగాన్ని నేను...

నీవు నవ్వుకుంటే నీ హసాన్ని నేను....

నీవు రాసుకుంటే నీ భావాన్ని నేను....

నీవు ఇమ్మంటే నీ ప్రాణాన్ని నేను....

నీవు మరిచిపొతే నీ స్మృతిని నేను....

నీవు రమ్మంటే నీ వెలుగును నేను....

నీవు దాచుకుంటే నీ బంగారాన్ని నేను...

ఎందుకంటే....సదా నీ ప్రేమికుడుని నేను....

తొలి ముద్దు......




సుప్రభతాపు సూర్యుని మేనిలో,
నీ రూపు చూసి కవినై కవితలు వల్లిస్తూ ,
మైమరచి నిన్నే చూస్తూ,నన్ను నేను మరచిపోయాను ప్రియా.....!
ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించిందా..? యన్న సంతోష సందిద్గంలో నే వుంటే,
ఒక చిన్న చిరునవ్వుతో నా ఆదరాలతో నీ బుగ్గపై ఓ చిరుముద్దు,
ఆ క్షణం కలిగిన అద్వితీయ అనుభూతి అనిర్వచనీయం.

Tuesday, November 3, 2009

అనిత ఓ వనితా....



నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
నీ ప్రేమ లో నన్ను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది....
అనిత... . అనితా.. ..
అనిత ఓ వనిత.. .... నా అందమైన అనిత... ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
నీ ప్రేమ లో నన్ను కరగనీకుమా......

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్న
నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్న
కలలో కూడా నీ రూపం నను కలవర పరిచేనే
కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే....

నువోకచోట... నేనోకచోట...
నిను చూడకుండా నే క్షనముండలేను గా

నా పాటకు ప్రాణం నీవే
నా రేపటి స్వప్నం నీవే
నా అసలా రానివి నీవే
నా గుండెకు గాయం చేయకే.....
అనిత ఓ వనిత..... నా అందమైన అనితా.....
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
నీ ప్రేమ లో నన్ను కరగనీకుమా......

నువ్వేనా దేవతవని ఎదలో కొలువుంచా
ప్రతిక్షణము ధ్యానిస్తూ పసి పాపల చూస్తా
విసుగురాని నా హృదయం నీ పిలుపుకే ఎదురు చూసే
నిను పొందని ఈ జన్మే నాకేండుకంటున్నది
కరునిస్తావో కాటేస్తావో
నను కాదని అంటే నే సిలనవుతానే
నా వీడని నీడవు నీవే
ప్రతి జన్మకు తోవి నీవే
నా కమ్మని కలలు కూల్చి నను ఒంటరి వాడ్ని చేయకే... ...
అనిత.... అనితా..
అనిత ఓ వనిత...... నా అందమైన అనితా..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
నీ ప్రేమ లో నన్ను కరగనీకుమా......
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది
వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది
అనిత.. . అనితా.. ..
అనిత ఓ వనిత...... నా అందమైన అనితా...
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన

ఏదో రోజు నా పై నీకు ప్రేమ కలుగుతుందని
ఓ చిన్న ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న
వట్టేసి చెపుతున్న నా ఊపిరి ఆగేవరకు నిను ప్రేమిస్తూనే ఉంటా.. .
అనిత.. . అనితా.. ..
అనిత ఓ వనిత...... నా అందమైన అనితా...
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన




ఈ పాట మీ phone లోకి download చేయుటకు...

http://www.mediafire.com/download.php?yjyo3lydak4



This is a song by a great lover towards his goddess..! Girl friend Anita. He wrote this song on remembrance of his girl friend after her marriage, With that depression he lost his life...!
This song has become a very popular song in Vizag and Vijayanagram districts...
These are the lines which are revolving around internet about this song
But the fact is that he is still alive
This song is sung and written by Nagaraju (Karim Nagar)
This poor guy is not revealing anything whether he is in love or not But song became very popular. And all the tv channels are behind him And so many directors and producers are also thinking about him
Famous actor "Charan Raj" offered him a film in a live interview
This song turned his life.......

Wednesday, September 23, 2009

పెద్దల మాట చద్దనం మూట........!!!!




ప్రేమ అంటే...ఎవరినైతే తన ప్రేమికుడు/ ప్రేమికురాలిని ప్రేమిస్తుంటారో, వారు తను ప్రేమించేవారినుండి తిరిగి మళ్ళీ అదే ప్రేమను పొందాలనుకోవడం అవివేకం అంటారు ప్రముఖ హిందీ కవి "కబీర్ దాస్"

కొంతమంది పురుషులు ప్రేమిస్తారు, కాని వారి ప్రేమలో కాసింత గాఢత తక్కువగానే ఉంటుంది, కాని స్త్రీ అలాకాదు, తన ప్రేమ స్థిరంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ద్వేషించడం ఎన్నడూ ఎరుగదని ఆచార్య రజనీష్ "ఓషో" అన్నారు.

ప్రేమ అనేది ఎప్పుడూకూడా తీసుకోవడం ఎరుగదు, దానికి తెలిసిందల్లా ఇవ్వడమే. ప్రేమ అనేది కష్టాన్ని సహిస్తుంది. ప్రేమకు పగ, ప్రతీకారం అనేది తెలియదంటున్నారు జాతిపిత "మహాత్మా గాంధీ."

ప్రేమకు కళ్ళుండవు అది ఎప్పుడూకూడా హృదయంనుంచి మాత్రమే చూస్తుంది, కాబట్టే ప్రేమ గుడ్డిది అన్నారు. అని ప్రముఖ ఆంగ్ల కవి "శేకేపియర్స్" అన్నారు.

పువ్వు పరిమళం ఎలాంటిదో ప్రేమకూడా అలాంటిదేనని "జార్జ్ బెర్నార్డ్ షా" అన్నారు.



నిజమైన ప్రేమ ఏమిటో సహజీవనం చేస్తేనే తెలుస్తుంది.
ప్రేమంటే ఒక వ్యక్తిలోని మంచితనాన్ని ,మంచి గుణాలని ,
కేవలం ఆ ఒక్క వ్యక్తినే ప్రేమించటం కాదు.
ప్రేమంటే 'నువ్వు ఇలా మారు,అలా మారు.అప్పుడు నిన్ను బాగా ప్రేమిస్తాను' అని కండిషన్స్ పెట్టడం కాదు.
ప్రేమంటే -- ఒక వ్యక్తితో పాటూ ఆ మనిషి తాలూకు ప్రపంచాన్ని కూడా ప్రేమించటం.
అది మన ప్రపంచం కన్నా విభిన్నంగా ఉన్నా సరే.
అవతలి వారి అభిప్రాయాలు ,అభిరుచులూ భిన్నంగా ఉన్నా సరే వాటిని గౌరవించటం .
ముఖ్యంగా ఒక మనిషి లోని 'లోపాల్ని' కూడా సుగుణాలతో సమానంగా స్వీకరించగలగటం షరతులు పెట్టకుండా బేషరతుగా ప్రేమించగలగటమే ప్రేమంటే!!
ఎందుకంటే 'ఇవ్వటంలో' ఉన్న ఆనందం,హాయి అనుభవంతోనే అర్ధం అవుతాయి !! "ప్రేమికుడు పండు"

Monday, September 21, 2009

తుమ్మెద హొరులో....!!!!




ప్రియతమా....
వసంత కాలంలోని కోయిల పాటలో "నీవు"
కొండ మీద నుంచి జారిపడే సెలయేటి గలగలలో "నీవు"
సముద్ర తీరము చేరే ప్రతి కెరటములో "నీవు"
రేయిని సైతం పగలుగా మార్చే చల్లని వెన్నెలలో "నీవు"
తేనె కోసం ప్రతి పూవుని వెతికే తుమ్మెద హొరులో "నీవు
కను ముస్తే వచ్చే కరిగిపోయే కలలో "నీవు"
నా కళ్ళలో "నీవు".....నా యెడ లోయలో "నీవు"
నా గుండె చేసే ప్రతి సవ్వడిలో "నీవు"
ఇన్నింటిలో దాగిన నీవు.........
నా కన్నుల ముందుకొచ్చి ఎందుకు కనబదవూ.........!!!!?

Saturday, September 19, 2009

ఒకే గొడుగులో........!!!!




ఒకే గొడుగులో నడిచిన
మన అడుగులకు తెలుసు ప్రేమంటే.....
ఒకే మెరుపుకు కలిసిన
మన కనులకు తెలుసు ప్రేమంటే.....
కంటి సైగతో పలకరిస్తే...బదులు పలికే
నీ చిరునవ్వుల పెదవులకు తెలుసు ప్రేమంటే.....
మమత నిండిన నీ చేతి స్పర్శకు
పులకరించే నా మదికి తెలుసు ప్రేమంటే.....
కలలు నిజమై...కాలము కవితై....
కలిసిపోయే మన హృదయమే ప్రేమంటే..........!!!!!!

ఇది నీకు తగునా.......?

చుపలతో చుట్టేసి చూపుకు అందకుండా వెళ్లావు
నిలువుటద్దంలా కనిపించి నిలువునా నను కల్చేసావు
నీ కలువ కన్నుల్లో కళలను దాచుకొని
నా కన్నుల్లో కలతను రేపావెందుకు?
అందుకే అప్పుడప్పుడు ఆలోచించాను ఆనందంగా విడిపోవాలని, కాని
ఇంక అందంగా అనుబందం పెంచి ఆలోచనలు రేపావు
సాక్ష్యం లేని స్నేహంతో సమస్యలెన్నో సృష్టించావు
ఆశలన్ని అందించి అద్భుతాలెన్నో చేసావు
పరువ్వలు పరిచి పరుగులు తీయించి పిచ్చివాడిని చేసావు
కదిలే కాలంలో కలకాలం ఆగని కన్నీళ్ళు తెప్పించావు, ఇది నీకు తగునా....???

హృదయకవాటంలో.....!!!



నీ చిరునవ్వు....దరహాసం...
ఒక్కటి చిందించు చాలు...
నీ లేత మందహాసం...
ఏ దూర తీరాల్లో ఉన్నా...
నా హృదయకవాటంలో
పదిలంగ దాచుకుంటాను ప్రియా.....!!!

అనంత భావాలు........!!!




కూడలి ఒక్కటే..కెరటాలు అనంతం
తూర్పు ఒక్కటే..కిరణాలు అనంతం
మనసు ఒక్కటే భావాలూ అనంతం
ఆ భావాలకి ప్రతిరూపమైన నీవు
నా ఒంటరి జీవితాన వసంతమైనావు

Friday, September 18, 2009

కలవరమాయే మదిలో............!!!!





తెలుసుకోవాలని వుంది, నాకు ఎం జరుగుతోందో.
అర్ధంకాకుంది, నాలో ఈ మార్పు ఏమిటో.
అంతు చిక్కకుంది, నీతో మాట్లాడాలని ఆరాటమెందుకో.
దిక్కు తోచకుంది, ఈ స్ధితి నుంచి విముక్తి ఎప్పుడో.
ఇదంతా నీకు చెప్పాలని వుంది, ఎం అవుతుందో.
భయమేస్తుంది, చెప్తే నీ స్నేహాన్ని కోల్పోతానేమో.......


చెప్పటానికి ఎన్నో ఊసులు మదినిండా,
నీ చెంత మూగబోతున్నా మాట్లాడకుండా.
చెప్పాలని బాధ,
చెప్పటానికి బాధ,
అఖరికి చెప్పలేదని బాధ.
ఎంత బాధైనా సరే.. దాచుకుంటా మధురంగా పదిలంగా, మర్చిపోకుండా.


పోందాలనుకున్నా నను కలవరపరిచిన నీ నవ్వునంతా..
స్వార్దం వెనుక ఇష్టమని తెలుసుకో, అపార్ధం చేసుకోకుండా
నీ చిరునవ్వులు చూస్తూ వుండాలి,
ఆ నవ్వుల కారణం నేనవ్వాలి
నీ మోములొ సంతోషం నేకావాలి.
పిచ్చివాడిననుకుంటావేమో.. ఎలా వుండగలను చెప్పు, నీ నవ్వు చూసి పరవశించకుండా

ఆరాటపడుతున్నా పంచటానికి నా ప్రేమనంతా..
కేవలం నేస్తాన్ని అంటావేమో, స్వీకరించకుండా.
పెరుగుతూనే వుంది నాలో ప్రేమ
దాన్ని ఒంటరిగా మోయ్యలేను సుమ.
రెక్కలు కట్టుకు వచ్చి, ప్రేమభారాన్ని పంచుకోమా.
శూన్యమైపోతుందేమో ఈ జీవితం, నువ్వు లేకుండా, నీ తోడు లేకుండా......!!!!

తపన....!!!!



మనసులో మనసుకి తెలియని భావన..
కనులలో కనులకే తెలియని కల్పన..
మదిలో మదికే తెలియని తపన..
నాలో నాకే తెలియని ఆలోచన..
అన్నీ నీ కోసమే.........

నీకై ఎదురు చూస్తూ .......



నా ప్రేమకు అర్ధం లేదు
నీ తోడు లేకుంటే...
నా జీవిత గమనానికి గమ్యం లేదు
నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే...
నా నిదురలో స్వప్నం లేదు
నీ ద్యాస లేకుంటే...
నా మనసుకు ఓదార్పు లేదు
నీ స్వరం వినపడకుంటే...
నా దేహనికి జీవం లేదు
నీ శ్వాస తోడవకుంటే...
నీకై ఎదురు చూస్తూ నీ....................!!!

ప్రేమ వ్యవ(సాయం)హారం..........!!!!




ప్రేమ, పైరూ ఒకలాంటివే. "ముందు మనసనే భూమిని దున్నాలి.
స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి.
ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి.
కులమతం, రాజకీయం అనే చీడల నుండిరక్షించుకోవాలి.
అప్పుడుగానీ ప్రేమ అనే పైరుచేతికిరాదు.”

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు.
నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోవవ్వాలి.
కళ కన్న ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.
ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.

ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో...
ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.

ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
ప్రేమ ఇంధ్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ - "ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్సత, స్పర్శ, కామం, ఓదార్పు”
ప్రేమంటే సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా, ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకరి స్మృతులు మరొకరికి చేరాలి.

బాటసారిని.....!!!!



జీవిత పయనం, జీవిత గమ్యం తెలియని నేను
ఓ నిరంతర బాటసారిని.........
ఎక్కడో తెలియని నా గమ్యం
అదేక్కడని నా ఈ పయనం....
అల వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోయాను
ఏదో ఒక రూపం నా మనసుకు కనబడింది
ఎంటా అని నా మనసును అడిగాను
నీ రూపాన్ని నా కంటికి చుపించిది
అపుడు తెలుసుకున్నాను నా ప్రయాణం
నీ చెంతకు చేరడానికని, నీ ప్రేమను సాధించడానికని....
నీ ప్రేమకై నీను అలుపెరుగని బాటసారిలా
పయనిస్తూనే ఉంటాను నీ ప్రేమను సాధించేవరకు

Monday, September 14, 2009

ప్రేమి'కులం'..........!!!!!




మనం భారతీయులం,
కూడు పెట్టని కులం మనకెందుకు,
ప్రేమనివ్వని కులం మనకెందుకు,
మన దృష్టిలో 'కులం'అంటే............
పని చేసేటప్పుడు శ్రామి'కులం'
కష్టపదేటప్పుడు శ్రామి'కులం'
కన్నవారికి సేవ'కులం'
ప్రేమించేతప్పుడు ప్రేమి'కులం'
ఆ ప్రేమని పంచేటప్పుడు ధని'కులం'
ఇవన్ని పాటించేప్పుడు మానవ'కులం..!!!!!

ప్రేమ వర్సస్ కులం.........!!!!!!




"ప్రేమ అనేది ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం, కానీ పెళ్ళి మాత్రం రెండు కుటుంబాలకు చెందిన విషయం" ఇది ముమ్మాటికీ నిజం.
"ప్రేమ-పెళ్ళి రెండూ వేరువేరునా? లేక రెండూ ఒకటేనా?" చాలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్లకపోవడానికి కారణం ఏంటి? ప్రేమకు కులం అడ్డమా?? ఒక అమ్మాయి ఒక అబ్బాయిల కులం ఒకటయితేనే ప్రేమించుకోవలా?? మన ఈ నవసమాజంలో ఈ కులం పిచ్చికి అంతం లేదా?

Friday, September 11, 2009

చిరుగాలి.....!!!!



మంచుకురిసే చల్లని రేయి,
నీకిష్టమయిన ఈ గులాబీ తోట కూడా
వెన్నెల పందిరి కింద నీ రాక కోసం ఎదురు చూస్తుంది
నీవు తిరుగాడిన ఈ పచ్చిక సయితం
మంచు బిందువులను ఏర్చి కూర్చి ముస్తాబయ్యింది నీ స్పర్శ కోసం
అప్పుదేప్పుదేప్పుడో ఎండుటాకుపైన నే రాసిన ప్రేమ లేఖ
రెప రెపల చప్పుడు ప్రేమ గీతంలా వినిపిస్తుంది
నా గుండెలనిండా నిన్నీ నింపుకుందామని నేను వేచి ఉంటె
గుండెలు కోసే ఏకాంతం నా మనసుని భయపెడుతుంది...
నా మనసు నిండా ఉన్న ప్రేమ ఆ వెండి మబ్బులనుండి
జాలువారిన తొలి చినుకంత స్వచంగా ఉంది
నా ప్రేమని ప్రపంచానికి పంచటానికి తోడు రావా నేస్తమా...
నాకే కాదు నా ప్రేమకు కూడా ఒంటరితనమంటే భయమే
నా ప్రాణానికి ఊపిరి పోసావు, నా ప్రేమకి ప్రాణం పోయవా చిరుగాలి........!!!

చితిలోంచి లేచొస్తాను.........




నా కనుల మాటున దాగిన కమనీయ రూపమా.!
నా మదిన నిలచిన సుమధుర స్వప్నమా.!
ఓ నా ప్రాణప్రదమైన హృదయమా.!
నాలోని అణువు అనువున నిండి ఉన్న నిన్ను
నే తుది శ్వాస విదిచేదాక ప్రేమిస్తాను
నేడు నీకోసం నేను పుట్టకపోయినా,
రేపు నీకోసం నే సంతోషంగా మరణిస్తాను
చిరునవ్వుల వరమిస్తావా
చితిలోంచి లేచొస్తాను...............



నీ నీడనై......!!!!




నీ పెదవులు పలికే మాటను నేను,
నువ్వు చూసే కనుచూపునవుతను.
నీ మనసున చేరే ఊపిరి నేను,
నిన్ను తాకే చిరు గాలినవుతాను.
నువ్వు వేసే ప్రతి అడుగును నేను,
నే నీ నీడనై చిరకాలం తోడుంటాను.
నీవు ఊహించే తలపుని నీను,
నిన్ను ఊపె ఊయలనవుతను
నా మనసు పలికే ఈ రాగం, ఈ మనసుని నడిపించే ఈ ప్రాణం,
అన్ని నీ సొట్ట బుగ్గల చిరునవ్వుకే దాసోహం.......

Thursday, September 10, 2009

మరచిపోవాలనుకుంటున్నా కానీ.........!!!




మరచిపోవాలనుకుంటున్నా కానీ
నీ చూపు తాకినా మరుక్షణాన
విషయాన్నీ మల్లి మరచిపోతున్నా...........
మాటల్లో పదకుడదనుకున్నా కానీ
నీ పెదాలు అల ఇలా మెదిలే సమయాన
దాన్ని అలాగే పట్టించుకోక వదిలేస్తున్నా.........
నీ
వయ్యారి నడుము ఊయలూగితే

కిలకిలమని చూడలేక ఉండలేకపోతున్నా........
నాలోని 'మధుర భావాలు
నీ మువ్వల సవ్వడి విన్పించగానే
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నా గుండెల్లో అలజడులు
ఇంకా ఎలా మరవగలను ప్రియా.....!

జడి వాన.......!!!


నా హృదయం అనే పూతోటలో విరసిన తోలి రోజా నువ్వు
నా జీవన ఎడారిలో తొలి జడి వాన నువ్వు
నా కనులలో నిత్యం నాట్యమాడు మయురివి నువ్వు
నా ఊహల ఆశా కెరటం నువ్వు
నా పెదాలపై చెరగని చిరు నవ్వే నువ్వు
కనులు మూసినా ఊహకు రావు, కనులు తెరిచిన కానరావు.....

మనసులో కన్నీరు......


ఆప్యాయతల కోసం ఏదురుచుస్తున్న నా మనసుకి,
బాధతొ గుండె బరువెక్కింది,
చిన్నప్పటి నుండి ఎన్నొ కష్టాలు పడ్డాను,
కడదాకా కన్నీళ్ళే శరణ్యం అనుకున్నాను
ఒక్కసారిగా నీ రాకతో నా జీవితంలో ఎక్కడొ చిన్న ఆశ కలిగింది బ్రతకాలని,
కాని నా ప్రేమ నిన్ను కరిగించలేక పోతుంది
ఐనా ఒక విధంగా ఆలోచిస్తే నేను స్వార్దంతోనే నిన్ను ప్రేమిస్తున్నా,
అందుకే నా ప్రేమ నీ మనసుని ఇంకా గెలవలేకపోతుందేమో
చూపు నాదైనా కన్నులు నీవి అని అనుకున్న
కన్నులు నీవని తెలిసి కూడా బాధ పెడుతున్నావు
నా కంట్లో వచ్చే కన్నీరు మాత్రమె నీకు కనిపిస్తుంది
నా కంట్లో కన్నీరు చుసిన క్షణం మాత్రం
నా కన్నీరు తుడవడానికి ప్రయత్నిస్తూ చేరువగా మాట్లాడుతావు
కాని అంతలోనే మల్లి నన్ను దూరం చేసి పరాయివాడిని చేస్తావు
స్పందన నాదైన హ్రుదయం నీదనుకున్న
హృదయం నీదని తెలిసి కూడా నన్ను దూరంగా ఉంచుతున్నావు
మరి ఇక నాకు ఆ కన్నులేందుకు
ఈ హృదయమెందుకు
నా కన్నీటికి కారణం నువ్వే,
నీకు అన్ని తెలుసు
ఐన నాపట్ల నీ తీరు మారట్లేదు, నా మనసుపడే భాద నీకు తెలియట్లేదు,

నువ్వు తెలిసి అంటావో, తెలీక అంటావో నాకు తెలీదు

కాని అపుడపుడు నువ్వుఅనే మాటలు నా హృదయాన్ని బరువెక్కిస్తున్నాయి
ఇంకా ఆ బరువు మోసే శక్తి నాలో లేదు,
కాని నా మనసులోంచి వచ్చే కన్నీరు నీకు కనిపించాట్ల
అవి కనిపిస్తే అలా మాట్లాడవు,

నా కంట్లో కన్నీరు తుదవకపోయిన బ్రతకగలను
కాని నా మనసులో కన్నీరుతో నేను బ్రతకలేను ప్రియా
నన్ను నా మనసుపడే బాధను అర్ధం చేసుకుంటావని
నా మనసులోని కన్నీరు తుడుస్తావని, నీ ప్రేమకై నే వేచి ఉన్నా................!!!

Wednesday, September 9, 2009

నీ చూపు సోకగా...!!!



అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీవైపే చూడగా
శిరను ఉపింది పువ్వు నీ శిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులె నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యనులే నీ చూపు సోకగా......

ప్రేమ సంకెళ్ళు.....!!!




మురిపెంతో సరసం తిర్చమంటోంది ప్రాయమి వేళలో
తమకంతో దూరం తెన్చమంతోంది తీపి చెరసాలలో
విరహంతో పరవం కరిగిపోతుంది ఆవిరై గాలిలో
కలిసుంటే చాలు కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో.....

ప్రేమ సెగలు.....




చల్ల చల్లని మంచుకు అర్ధం కాదు ప్రేమ చలువేమిటొ
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటొ
వచ్చి రాని కన్నిల్లకే తెలుసు ప్రేమ లోతేమిటొ
ముద్దులేని అధరాలకే తెలుసు ఈడు భాదేమిటొ

ప్రయాణం.....!!!




నలువైపులా నల్లని చికట్లే ఎదురోస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతూ ఉన్నా
కనుపాప కుప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూనే ఉన్నాను.....

Tuesday, September 8, 2009

ప్రేమంటే........!!!!




నీ పరిచయం నాకు ప్రేమను నేర్పించింది

నీ అందం నాకు బంధం వేసింది

నీ మాటలు నా ప్రేమకు బాటలు వేశాయి

నీ నవ్వులు నన్ను మైమరపించాయి

నీ చూపులు నా గుండెను తాకాయి

నీ అభిమానం నీ పై నా ప్రేమను పెంచాయి

నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని

కాని అది నీకు తెలియాలంటే ఎలా

నీవు ఒంటరిగా వున్నప్పుడు నన్ను తలచుకుంటావే అదే ప్రేమ

నేను కనబడనప్పుడు నా సెల్లులొ మెసేజ్ బాక్స్ నిండిపొతుంది చూడు నీ మెసేజ్ లతొ అదే ప్రేమ

నేను ఏ అమ్మయితొ ఐనా మాట్లడుతుంటే నీ కళ్ళు ఎరుపెక్కుతాయే అదే ప్రేమ

పొద్దున్నే నా మెసేజ్ రాకపొతే నువ్వు నన్ను తిడతవు చూడు అదే ప్రేమంటే

ఇంకా అర్ధంకాలేదా నీకు ప్రేమంటే

ఏ బాషలొ చెప్పాలి నీకు

కనీసం నీ మనసునన్న అడిగి చూడు

నా మనసు పడే బాదేమిటో

నీవొక తర్జామా....!!!




నీ జ్ఞాపకాల పందిరిలో
నాది పచ్చదనపు చిరునామా...
నీ ఉహల ఉద్యానవనంలో
నాది పరిమళాల హంగామా....
నీ స్వప్నాల సద్యనురాగంలో
నాది వెలుగుల వీలునామా.....
అవును ప్రియతమా
నేననే మనషికి నీవొక తర్జామా.......

Monday, September 7, 2009

నీ కోసమే.......!!



ప్రేమే తెలియని నా మనసుకు ప్రేమను ప్రేమగా పంచాలి
నీ పరిచయమే జరగకపోతే నా జీవితమంతా వ్రుధాయేగా
నిన్ను చుసిన క్షణమే నాలో సగమై
నా నీడను నేను మరిచాను
నీ ఉహలతో నా మనసుని నింపి
నీకోసమే నేనోచ్చానులే ప్రియా....

Saturday, September 5, 2009

నా గుండె లోతులో


నీటిలో వేసే ప్రతి అడుగు కనిపించదు
మట్టిలో వేసే ప్రతి అడుగు చిరకాలం గుర్తుండదు
కాని మన ఇద్దరం కలిసి నడిచే ప్రతి అడుగు
నా గుండె లోతులో నిలిచిపోతుంది....
 
29501