RSS

Friday, December 28, 2012

ఏది నిజం....ఏది అబద్దం....




కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, ప్రాణం లేని మనసు....ఉన్న ఒకటే లేకకపోయిన ఒకటే

ఆశ కాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది,
భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది.

అడిగిన దానికి సమాధానం చెబితే తెలివితేటలూ అంటారు
చెప్పకపోతే పొగరు అంటారు..... మరి నన్నేమి చేయమంటారు?

నువ్వంటే ఎందుకిష్టమో చెప్పలేను గాని, ఎంత ఇష్టమో చెప్పగలను

క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు,
కాని ఎక్షమ్ లో వ్రాసే వాడే టాపర్ అవుతాడు

మనకు తెలిసిన పని ఫ్రీ గా చేయకూడదు
మనకు రాని  పనిని ట్రై చేయకూడదు 

బ్రతకడమే కష్టం అనుకున్నప్పుడు బొంగులోది "మంచి" ఏంటి "చెడు" ఏంటి


ఆకలి వేసినప్పుడు తినడానికి తిండి ఉండి తినకపోవడం ఉపవాసం,
నిదుర వచ్చినపుడు ఎదురుగ మంచం ఉండి కూడా పడుకోకపోవడమే జాగారం,


అమ్మా.. ఆడది ఎలాంటి భర్త ఉంటె సుఖపడుతుంది..?
"కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ అని ప్రతి వాళ్ళు ఆడది ఎలా ఉండాలో చెప్పారు కాని మగాడు ఎలా ఉండాలో, ఎలా ఉంటె ఆడది సుఖపడుతుందో ఎవ్వరు చెప్పలేదు.. బహుశా పురాణాలు మగవాళ్ళు రాయడం వల్ల వాళ్లకి ఈ ప్రశ్న ఎపుడూ తట్టి ఉండదు..

మా అమ్మ నాకో మాట చెప్పేది , చాల మంది మగాళ్ళకి డబ్బు సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న భార్య ప్రేమ సంపాదించడం మీద ఉండదు అని..

ఇపుడు చాల మందికి పెళ్లి అంటే పుట్టిన రోజు కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి చేస్కునే ఒక ఫంక్షన్ ,, కాని నిజానికి పెళ్ళంటే ఒకే గదిలో రెండు వేర్వేరు కుటుంబాల నుంచి, అలవాట్ల నుంచి వొచ్చిన మనుషులు కలిసి బ్రతకడం ..

అందుకే పెళ్లి అయ్యాక ఏ మగాడు అయితే 'నేను' అనే మాట కంటే 'మనం' అనే మాట ఉపయోగిస్తారో అలాంటి వాళ్ళ దగ్గర భార్య సుఖపడుతుంది..


నేను సంతోషంగానే ఉన్నాను......







నేను నా జీవితం లో సంతోషంగానే ఉన్నాను
ఇప్పుడు నాకు 14 నెలల పాప కూడా ఉంది,
భార్య, పిల్లలను పోషించే జీతం కూడా సంపాదిస్తున్నాను
సంపాదిస్తున్న జీతం తో కూడా సంతోషంగానే ఉన్నాను
సంపాదిస్తున్న పనిలో కూడా సంతోషంగానే ఉన్నాను
మొన్నటి మొన్న మా పాప మొదటి పుట్టిన రోజు కూడా బ్రహ్మాండంగా చేశాను
రోజు ఉదయం ఆఫీసు కు వచ్చే సమయంలో
మా పాపను బైక్ పై ఒక రైడ్ వేయించడంలో కూడా సంతోషంగానే ఉన్నాను
తన ముద్దు ముద్దు మాటలతో "నాన్న..నాన్న" అంటుంటే, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను
నేను బయటకి వెళ్ళేటప్పుడు నాకు "బై, బై " అంటూ చేతులు ఉపుతూ ......ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంటే ఇంకా ఇంకా
సంతోషంగా అనిపిస్తుంటది .......ఇన్ని సంఘటనలు చాలవా? నేను సంతోషంగా ఉన్నను అనడానికి....
సంతోషం అనేది బయటకి చెప్పితేనే సంతోషంగా ఉంటామా ఏంటి ??

ప్రేమంటే ఇదేనా.....??




బట్టలు మార్చినంత తేలికగా అమ్మాయిలను...
తల వెంట్రుకలను దువ్వుకునేంత తేలికగా అబ్బాయిలను
మారుస్తున్న ఈ రోజుల్లో..... నిజమైన ప్రేమకు త్రావు లేదు
అది ప్రేమ అని నీకు  అనిపిస్తే అది నీ ఖర్మ,
ఒకప్పుడు ప్రేమంటే ఒక ఎవరెస్ట్ శిఖరం
కాని ఇప్పుడు రోడ్ మిద దొరికే శిల్పంలా అయింది
అప్పటి భగ్న ప్రేమికులు లైలా-మజ్ను, సలీం-అనార్కలీ
దేవదాస్-పారు లు ఇప్పుడు లేరు,
వాళ్ళు ఇప్పుడు ఉండి ఉంటె ప్రేమ జోలికే వెళ్ళేవారు కాదేమో
అప్పటి ప్రేమకు నేను సలాం పెడతా
కాని ఇప్పటి ప్రేమ మాత్రం ఎవరేమనుకున్న అంతా ట్రాష్...
డబ్బునోడికే ప్రేమ, దోమ, అంతే గాని సామాన్యుడుకి మాత్రం కాదు
నీ దగ్గర డబ్బు ఉన్నంత సేపే....ఆ అమ్మాయి(ప్రేమ) నీది
తరువాత.....ఇంకేవరిదవుతుందో చెప్పెలేము
బైక్ ఉండగానే సరిపోదు, దాంట్లో పెట్రోల్ ఉండాలి,
జేబులో పర్సు ఉండగానే సరిపోదు, దాంట్లో డబ్బు ఉండాలి
ఇవి అన్ని ఉన్నంత సేపే ప్రేమైన, ఇంకేమైనా......

Monday, December 24, 2012

అమ్మాయిలు-అబ్బాయిలు.....





అబ్బాయిలు:
మనసులో ఉన్న భావాలను ధైర్యంగా తనకు నచ్చిన అమ్మాయితో చెప్పడం కొంతమంది అబ్బాయిలకే సాధ్యం. అందులో నేనొకడిని. అదేవిధంగా ఆమెపై తనకు గల ప్రేమను వ్యక్తపరిచినపుడు, ఆ అమ్మాయి దానిని తిరస్కరించినా, బాధపడక స్పోర్టివ్‌గా తీసుకుని, స్నేహితులుగా ఉందామని ఒప్పించే నైజం కలిగి ఉంటారు కొందరు. స్నేహంలో తన మంచితనం ఎటువంటిదో ఆమెకు చూపించడం ద్వారా, తిరిగి ఆమె మనసులో స్థానం సంపాదించుకుంటారు.

కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారో తెలియదు కానీ... ఎవరితోనూ కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడని ఓ అందమైన అమ్మాయి, తెల్లారేసరికి అతని ప్రక్కనే ప్రత్యక్షమవుతుంది. ఇదెలా సాధ్యం...? దీనినే తొలిచూపు ఆకర్షణ అనుకోవాలా..? సదరు అబ్బాయి తీయని మాటల బాణాలు ఆమె ఎదలోతులను మృదు"మధు"రంగా స్పృశించి మనసు చలించి, అతనితో (ప్రేమకు)స్నేహానికి ఓకే చెప్పింది అనుకోవాలా..? అసలెలా అంత త్వరగా ఓ అమ్మాయి సదరు అబ్బాయి వెంట చనువుగా తిరుగుతుందీ... అనే ప్రశ్న చాలామంది కుర్రాళ్లను వేధిస్తుంటుంది.???అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే రై.. రై.... మంటూ బైక్‌లో దూసుకెళుతూ, చక్కర్లు కొడుతుంటారు. అబ్బాయి అమ్మాయి వెంట పడీ పడీ అలసిపోయి, అవమానాలు, సత్కారాలు, తిట్లు, చెప్పుకుంటే ఎన్నెన్నో.... అమ్మాయితో పరిచయం పెంచుకోవడానిక అన్ని అవస్థలు పడుతుంటారు, కానీ అమ్మాయి నుంచి రెస్పాన్స్ ఉండదు. అసలు అమ్మాయిని ఆకర్షించడం ఎలా?



అమ్మాయిలు:
అబ్బాయిల ప్రేమని పొందడానికి అమ్మాయిలు  చాల చిట్కాలే ఉపయోగిస్తారు. ఇద్దరమ్మాయిలు రోడ్ల పైన అల నడుచుకుంటూ వెళ్తుంటే......పక్కనుండే ఒకబ్బాయి నడుస్తుంటే.....ఇక ఆ  ఇద్దరమ్మాయిల సంభాషణలు చెప్పనక్కరలేదనుకుంట... చూసావా వాడు నన్నే చూస్తున్నాడు అని మనసులో ఒకరికొకరు అనుకుంటారు....(కాని ఆ అబ్బాయి వాళ్ళను పట్టించుకుంటాడో కూడా తెలియదు) ఇది రోడ్ల పైన మనం రోజు చుసేటివే.....

ఇక వాళ్ళ ఇంటిదగ్గర అబ్బాయిల గురుంచైతే ఇక చెప్పక్కర్లేదు.....అబబ్బో ఎన్నో ఉహలు, ఎన్నో ఆశలు....వాడు నన్నే చూస్తున్నాడు అని తెగ మురుసిపోతారు.....కాని అక్కడ అబ్బాయి మాత్రం తూ తూ మంత్రంగనే ఒక చిన్న చిరున్నవు ఇచ్చి వాడి పని వాడు చేసుకుంటాడు. ఇంకోదరు అబ్బాయిలు మాత్రం ఇక అమ్మాయి కనిపించిందంటే చాలు లేని పోని బిల్డుప్ ఇస్తాడు అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యడానికి......వాడో హీరో....అమ్మాయో హీరోయిన్ మరి అన్నట్లుగా......

అమ్మాయిలు, ఒక అబ్బయిని నిజంగా ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవాలంటే, మొదటగా వాడిపై ఆ అమ్మాయి అభిప్రాయం తెలియాలి, ఆ అమ్మాయి చూసే చూపులకు అర్దాలు తెలియాలి, అమ్మాయి చేసే సైగలు తెలుసుకోవాలి, 
ఇవన్ని తెలుసుకునే సరికి ఆ అబ్బాయికి తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేస్తాయి...


నిజం చెప్పాలంటే అమ్మాయిల ప్రేమను చాల తేలికగా తెలుసుకోవచ్చు. అదెలా అంటే ఆమె  నిన్ను చూడగానే ఆ అమ్మాయి మొహం లో చాల మార్పులు వస్తాయి....నీపై ఇష్టం ఉంటె ఆమె మాట్లాడదు ......ఆమె కళ్ళు మాట్లాడుతాయి.....ఆమె పెదాలు మాట్లాడుతాయి, ఆమె చిరునవ్వు మాట్లాడుతుంది..... వీటిని అర్ధం చేస్కుంటే చాలు అది ప్రేమా.....లేక ఆకర్షణా అని తెలియడానికి.......
  

Friday, December 21, 2012

ప్రేమ-అమ్మాయి......







అమ్మాయిలకు ప్రేమంటే అలసేందుకో
ప్రేమ అంటే రెండు అక్షరాల పదం అనే అనుకుంటారేగాని
ప్రేమంటే రెండు మనసుల కలయిక అని తెలుసుకోరెందుకు
ఒక్కసారి ప్రేమించాను అని...మరొకసారి నేను నిన్ను ప్రేమించడం లేదు
లైట్ తీసుకో అని అనడానికి వీళ్ళకు మనసెల ఒప్పుకుంటధో
నిజం చెప్పాలంటే ఇప్పటి తరం అమ్మాయిలకు
నిజాయితిగా ప్రేమించే వాళ్ళ కంటే....నటించే వాళ్ళంటేనే ఇష్టపడతారు
అందుకే వీళ్ళకు తగ్గట్టుగా అబ్బాయిలు కూడా అలాగే తయారవుతున్నారు
అలాగని అందరు అమ్మాయిలను ఉద్దేశించి ఇలా అనడం లేదు
కొందరు ఉన్నారు అని మాత్రమె నా ఉద్దేశం.
ప్రేమవల్ల  అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా బలవుతున్నారు అన్నది నగ్న సత్యం
ఒక ఉదాహరణ: నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను రా అని తెగ ప్రేమను ఒలకపొస్తారు.
ప్రామిస్ నేను నిన్నే ప్రేమిస్తున్నాను....నిన్ను మాత్రమె ప్రేమిస్తున్నాను అంటారు
కాని కొన్ని రోజులు గదిసెకొద్ది.......ఒరేయ్ నేను డ్రాప్ అవుతున్నాను అంటారు.....
డ్రాప్ అవడానికి ప్రేమ ఏమైనా పందెమా....?
ప్రేమను ఒక పందెం లా ఫీల్ అయ్యే వాళ్ళు సైకో లాంటి వాళ్ళు
వాళ్ళు చస్తారో తెలియదు....ఎదుటి వాళ్ళను చంపుతారో తెలియదు
అబ్బాయిలు, అమ్మాయిల మీద ఎంతో నమ్మకంతో ప్రేమిస్తారు
కాని వాళ్ళు మాత్రం తూ తూ మంత్రంగానే ప్రేమిస్తారు
చివరకు ఎవడో తల మాసిన ఎదవనో పెళ్లి చేసుకుంటారు...
నమ్మి ప్రేమించినోడిని నడి సముద్రంలో పడేస్తారు...


జరిగిందేదో జరిగింది అని అబ్బాయిలు ఊరుకుంటారా?
హత్యలు.....లేక ఆత్మహత్యలు........
ఇలాంటి సంఘటనలు రోజు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి....
మనము పేపర్లో చదువుతున్నాం....టీవీ లలో చూస్తున్నాం కుడా...
కొందరి వల్ల  "ప్రేమ" అనే పదం వింటేనే ఒళ్ళు గుభేలుమంటుంది
అర్ధం చేసుకునే మనసుంటే.....వెయ్యి మార్గాలుంటాయి
తొందరపాటు నిర్ణయాల వల్ల....ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి
పెద్దల మాట చద్దన్నం మూట.......ప్రేమ(అమ్మాయి) మాయలో పడి
తల్లిదండ్రుల మాటలను పెడ   చెవిన  పెట్టి
వాళ్ళ గోతిని వాళ్ళే తోవ్వుకుంటున్నారు
అందులో నేనొకడిని.....







ఎవరినైనా నొప్పించి ఉంటె నన్ను క్షమించండి........
ఇది నా పర్సనల్ గా మాత్రమె ఫీల్ అవ్వండి......

.....పండు(పుచ్చిపోయింది)

Thursday, December 20, 2012

అమ్మాయి.....బులెట్....!!


ప్రేమించే హృదయాన్ని ఎంతా భాధపెట్టిన అది
ప్రేమించడం మరువదు....కానీ ఆ హృదయాన్ని మోసం చేస్తే...
మోసపోయిన హృదయం మళ్లి ఎవరిని ప్రేమించదు........
అందనంత వరకు ఏదైనా అద్భుతంగానే ఉంటుంది
అందిన తర్వాతే అతి సామాన్యంగా అనిపిస్తుంది !!!!
రెండక్షరాల ప్రేమ Success ని చూపుతుందో Failure ని చూపుతుందో ఎవ్వరికి
తెలియదు.
ఒక్కపుడు నిజమైన ప్రేమ తాజ్ మహల్ రూపంలో కనపడితే..ఇప్పటి ప్రేమ సినిమాలలోన
మాత్రమే కనపడుతుంది...
నీతో పయనం కొన్ని గడియలు...నీ మాటలు కొన్ని నిముషాలు...
నీ నవ్వులు కొన్ని సెకన్లు ...కానీ అలోచించి చూస్తే నా జీవితమంతా నివ్వే వున్నావు
నిజానికీ కలలకీ ఉన్న దూరం....భూమికీ ఆకాశానికీ ఉన్నంత !!!!
ప్రపోసే చేయకుండా అమ్మాయి పడదు !! బుల్లెట్స్ లేకుండా గన్ పేలదు :.............))
ప్రపోస్ చేసాక అమ్మాయి మనసును చంపేస్తుంది.......బులెట్ పెల్తే మనిషిని కాల్చేస్తుంది
ఇక్కడ అమ్మాయికి, బులెట్ కి పెద్ద తేడ ఏమి లేదు సుమండీ.....

నిర్ణయం నీదే......కానీ జీవితం నాది ..




గుడిలో దేవుడులాగే గుండెల్లో ప్రేమ కూడా ఒక నమ్మకం ...
నువ్వు ఉంది అనుకుంటే ఉంది... లేదు అనుకుంటే లేదు...
గుడిలో దేవుణ్ణి ఐతే అందరూ చూడొచ్చు ...
కానీ గుండెల్లో ఉన్న ప్రేమని(నిన్ను) నేను మాత్రమే చూడగలను
వంట రుచి తినేదాకా తెలీదు ...
పుస్తకం గొప్పతనం చదివేదాక తెలిదు...
ప్రేమంటే ఏంటో మనల్ని ప్రేమించే వాళ్ళని కోల్పోయేదాకా తెలిదు...
నిర్ణయం నీదే......కానీ జీవితం నాది ...!!!

Wednesday, December 19, 2012

కలిసి వచ్చే కాలానికై....



నువ్వు నాతో లేని ఈ దేహం పై,
నాకు మొహం లేదు,
ముక్కలు చేసిన ఈ గుండెకి,
ఇక గాయమన్నది తెలియదు...

చిన్న ఆశేదో ఇంకా మిగిలి వుంది,
అందుకే వేచి చూస్తున్నా,
కలిసి రాని కాలానితో పోటి పడలేక,
కలిసి వచ్చే కాలానికై ఎదురుచూస్తున్నా,

నీ తోడు లేని ప్రతి క్షణం,
నిన్నే కలవరిస్తున్నా...
నేనింకా జీవించి ఉన్నానంటే,
మన ప్రేమ ఇంకా చావలేదనుకుంటున్నా...

అమ్మ.....





దూరంలో వున్నా, చేరువలో వున్నా,
నీతో వున్నా , నిన్ను నే మరిచినా,

కడుపు నింపినా, కష్టపెట్టినా,
మేలు చేసిన, కీడు చేసినా,

దుఃఖంలో నీ కంట్లో నీళ్ళు కదులుతున్నా,
అనుక్షణం నా మేలుని కోరి,
నువ్వు సల్లంగా వుండు బిడ్డ అని,
కరుణించి దీవించే ఓ అమ్మా,

దైవాన్ని చూడాలంటె గుడికే వెళ్ళాలా..?
నీలో చూసుకుంటే చాలదా...?

Saturday, December 8, 2012

రైతన్నా నీకు వందనం......!



నీ ఆకలి తీరకున్నా...మా ఆకలి తీరుస్తున్నావు
ప్రపంచానికి అన్నం పెట్టి....నువ్వు గంజితో సరిపెట్టుకున్నావు  
ఏ ఫలము ఆశించని నీ త్యాగానికి వందనం



బరువెక్కిన హృదయం, బక్క చిక్కిన శరీరం వద్దంటున్న
అందకున్న ఏ సాయం, ఆపనన్నావు వ్యవసాయం
సాటి లేని నీ ఆత్మవిశ్వసానికి వందనం



ప్రకృతి సహకరించలేకపోయినా....వర్షం పలకరించకపోయినా
కష్టపడితే కరుణించే మట్టి తల్లిని నమ్ముకున్నావు
అంతు లేని నా నమ్మకానికి వందనం


దళారులు మోసగిస్తున్న...నేతలు పట్టించుకోకపోయినా
సమస్యలను ఎదిరిస్తున్నావు, సేద్యాన్ని కొనసాగిస్తున్నావు
ఎదురులేని నీ ధైర్యానికి వందనం


మనకోసం కష్టపడే కర్శకుడ్ని గౌరవిద్దాం
ఆకలి తీర్చే అన్నదాతకు ఆకలి చావు లేకుండా చేద్దాం
రైతును సేవించే భాద్యతను అదృష్టంగా భావిద్దాం....


ఇది వ్రాసింది నా స్నేహితుడు....ప్రత్యేకంగా ఈ బ్లాగ్ లో పెట్టడానికి కారణం రైతన్న అయిన మా "నాన్న" కోసం
నాన్న... నీకు పాధాబివందనం...

Friday, December 7, 2012

జ్ఞాపకాలు.....!




ప్రియతమా,
సుదూర తీరాన నువ్వున్నా
మన మద్య చనువు తగ్గదు.
ఎడబాటు తాలూకు జ్ఞాపకాలు
గుండెల్లో నిలిచిన్నంత కాలం
మన ప్రేమ తరగదు.
కాలగర్భంలో నాళ్లు ఏళ్లుగా గడిచిన
మన ప్రేమ మారదు.
కలిసేది ఎన్నాళ్లకైన
కలకాలం మనం ప్రేమికులమే.
ఆలోచన్లలో మార్పు వచ్చినా
ఎప్పటికీ మనం ఆప్తులమే.
గడిచిపోయిన ప్రతి సెకను
మన ప్రేమను పెంచాలి.
గడిచిన ప్రతి సంవత్సరం
మర్చిపోలేని "మధు"ర క్షణాలే అవ్వాలి.
ఇదే మన ప్రేమ.....

Tuesday, December 4, 2012

ప్రేమికా...!




మై డియర్ ప్రేమికా...!
"చేంజ్ ప్రకృతి లక్షణం
ఛాలెంజ్ మనిషి లక్షణం
కాబట్టి......
చేంజ్ ను ఛాలెంజ్ చెయ్
చాలెంజ్ నే చేంజ్ చేయకు.....!

ప్రేమ పాట.....!



లవ్ అనేది ఐ-పాడ్ కాదు
నీ ఫేవరేట్ సాంగ్స్ వినడానికి
లవ్ అనేది రేడియో లాంటింది
ఏ పాట వచ్చినా చచ్చినట్లు వినాల్సిందే......

జబ్ తక్ హై జాన్.....!





నువ్వు ఎప్పుడు నవ్వుతుంటే
ఎప్పుడు చూడాలని ఉంటుంది!
కాని ఎప్పుడు నవ్వడం
ఎవరికైనా అసాధ్యమే!
కాని ఎప్పుడు నిన్ను ప్రేమించడం
మాత్రం నాకు సాధ్యమే!
 
29501