RSS

Saturday, March 28, 2015

నీవై పోయాను....




ప్రతి క్షణం నీకు దూరం
అవుతున్నానని అనుకున్నా 
కాని ప్రతి క్షణం నీ ఆలోచనలతో  
నీకు మరింత చేరువ అవుతున్నానని తెలుసుకోలేకపోయాను 
భరించలేని భాదను, పట్టరాని ఆనందాన్ని ఒకేసారి అనుభవిస్తున్నాను 
నాలా నేను లేను, నీ ప్రేమలో పడి నన్ను నేను మరచి 
నీవై పోయాను 
ఎదురు చూసే ప్రేమలో తియ్యదనం ఉంటుందని నేర్చుకున్నాను
నీతో గడిపిన ప్రతి క్షణం నాకో స్వర్ణ యుగం
నీ రూపం ఒక వరం
నా మనసే నీ వశం..........  




తనకు మాత్రమె........



మనసు తెలిపేటి భావాలతో
నా చెలియ అందాలను
ఆణువణువూ వర్ణించాలని నా ఆశ......
కాని నా చెలియ అందాలను
కలంతో రాయలేను, పదాలతో వర్ణించలేను, కాని 
నా చేష్టలతో తనకు మాత్రమె చూపించగలను





ప్రేమకు అంతం లేదు.........




ప్రేమ సఫలమైతే మంచి కాపురం అవుతుంది
విఫలమైతే మధుర  కావ్యమవుతుంది
ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ
విషాదాంతలే అని అంటారు కదా
అనతoమైన  ప్రేమకు అంతం లేదు
విషాదం అంతకన్నా లేదు
స్మరించినకొద్ది  ప్రేమ మధురం

పెళ్లి రోజు శుభాకాంక్షలు........






 అది 24th మార్చ్  2010,
శ్రీరామ నవమి,
గుడిలో పంతులు చేతుల మీదుగా రాములోరి లగ్గం 
నాది పంతులు లేకుండా అదే రాములోరి గుడిలో నా లగ్గం 
ఈరోజుకి నాకు పెళ్లి అయ్యి 5 సంవత్సరములు పూర్తి అయ్యయి. 
ఈ 5  సంవత్సరములలో నా జీవితంలో ఎన్నో చేదు... 
మరెన్నో తీపి జ్ఞాపకాలు.......... 
అందులో బయటకు చెప్పేటివి కొన్నైతే, చెప్పలేనివి మరెన్నో 
ఏది ఏమైనా, జీవితం అనేది తీపి చేదు జ్ఞాపకాల సమ్మేళనం అని నేర్చుకున్నాను    

Friday, March 13, 2015

హాయ్....





నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు నా యొక్క నమస్కారములు,
ఇన్ని రోజులు మీతో చాల విషయాలు పంచుకోలేకపోయాను, ఇప్పటినుండి 
గడిచిన నా జీవితంలోని సంఘటనలను మీతో పంచుకుంటాను

Saturday, August 10, 2013

ఎలా విడవను

 
 
 
నువ్వు నన్ను విడిచిన క్షణాన....
నా కన్నీటి బొట్టులో నువ్వు కనిపించావు... 
ఆ కన్నీరు ఆవిరైపోతుంటే తట్టుకోలేని....
నా హృదయం ఊపిరి విడవమంది....
ఆలోచించు....
నా ఊపిరిగా ఉన్న నిన్ను, మరలా ఎలా విడవను

Monday, August 5, 2013

స్నేహితుల రోజు....



‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి’అని
ఓ కవి అంటే, ‘స్నేహమేరా జీవితం...
స్నేహమేరా శాశ్వతం’ అన్నాడు మరో
కవి. ఎవరైనా స్నేహాన్ని అంతలా
పొగుడుతూ పాటలు రాశారంటే
అందులోని మాధుర్యాన్ని
అర్థం చేసుకోవచ్చు.
స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్ట
కాదు. అంతటి త్యాగం చేసే
స్నేహితుణ్ణి పొందటమే కష్టం.
కొన్ని స్నేహాలు పారిజాతాలు.
కొన్ని స్నేహాలు గులాబీలు.
కొన్ని స్నేహాలు కాగితం పూలు.
కొన్ని స్నేహాలు నైట్ క్వీన్లు.
కొన్ని స్నేహాలు ఆకుపచ్చని సంపెంగలు.
కొన్ని స్నేహాలు కలువపూలు.
కొన్ని స్నేహాలు చంద్రకాంతలు.
కొన్ని స్నేహాలు సన్నజాజులు.
కొన్ని స్నేహాలు బంతులు,చామంతులు
కొన్ని స్నేహాలు కనకాంబరాలు.
కొన్ని స్నేహాలు పొద్దుతిరుగుళ్ళ
ఇలా ఎన్ని రకాల స్నేహాలు ఉన్నా
నిజమైన స్నేహితులకు తెలిసిన
మంత్రమొక్కటే --
ప్రపంచం తలక్రిందులైనా...వీడకుండా నిలవటం.
కొందరినైనా అలాంటి స్నేహితులను
నాకిచ్చినందుకు భగవంతునికి
కృతజ్ఞతలు తెలుపుతూ..
స్నేహితులందరికి స్నేహదిన శుభాకాంక్షలు..!

జీవిస్తు... మరనిస్తున్నాను..

 
 
గుండెలోని బాధలే
కళ్ళలోన కన్నీరై పొంగుతుంటే
ఆత్మాభిమానమే బయట పడనీయక  పోతే
అవి గుండెలోని ఆవిరి ఇంకిపోక
మనసులేని మనిషిలా జీవిస్తున్నాను
జీవిస్తు... మరనిస్తున్నాను.. 

నన్ను నేను కాల్చుకున్నాను .............



ప్రేమ లో పడ్డ మనిషినే మారాను ,నిదురను వదిలి
నిన్నే తలిచాను........
మనసు మాట వినక ,నీ  ప్రేమ గుడిలో
చేరలేక ...............
నీ గుండె తలుపుల
కోసం ఎదురుచుసను ...........
చివరివరకు చెప్పలేక
నన్ను నేను కాల్చుకున్నాను .............
భగవంతుడు నన్ను చేరి వరము ఇస్తే,
నీ హృదయములో చేరాలి అని కోరుకుంట ..........

Saturday, August 3, 2013

నీ ద్యాస ఆగదు...



ఇందుకా ప్రియా నేను నీకు దూరమైనది,
ఇన్నాళ్ళు మూగగా ప్రేమించింది,
నా ప్రేమను నా గుండెల్లోనే దాచుకున్నది,
నీ పైగల ఆరాటాన్ని కనురెప్పల మాటునే అణగదొక్కుకున్నది
నీ చిరునవ్వే నాకు చాలని,
అలా నిన్నే తలచుకుంటూ.. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని,
నీ ఆనందంలో నా సంతోషం చూసుకుంటున్నాను
నీ గెలుపులో నా చిరునవ్వును వెతుకుంటున్నాను
ఇలా అజన్మాంతం నిన్నే పిచ్చిగా.. మూగగా ....
ఆరాదిస్తూ ప్రేమిస్తూ బ్రతుకుదామనుకుంటే
ఎందుకు చేసావిలా ..........
ఇందుకేనా నన్ను నేను నీకు దూరం చేసుకున్నది
చివరకు నా బ్రతుక్కి అర్ధం లేకుండా చేసావుగా?
నా ఉపిరి ఆగినా నీపై ప్రేమ ఆగదు
ఈ కట్టే కాలిపోయే వరకు నా మదిలో నీ ద్యాస ఆగదు...

బర్త్ డే గిఫ్ట్...



ఒక అమ్మయి తన లవర్‌ నీ ఇలా  అడిగింది
next week నా బర్త్‌డే కదా ఏ గిఫ్ట్‌ ఇస్తున్నావు రా అని
తన లవర్‌ అన్నాడు ఇంకా వారం వుంది కదా, అప్పుడే అడుగుతే ఎలా చెప్పను
సరే చెప్తున్నా ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్‌ నీకు నేను ఇస్తా అని మాట ఇచ్చాడు......
అమ్మయి బర్త్‌డే కి మూడు రోజులు ముందు ఆ అమ్మయి సృహ తప్పి పడిపోయింది వెంటనే హస్పిటల్‌ కు తీసుకు వెళ్ళారు.....
డాక్టర్‌ ఆ అమ్మయినీ చెక్‌ చేసి తన కుటుంబ సభ్యులతో ఇలచెప్పాడు
తను ఎక్కువ రోజులు బ్రతకదు, తనకు వెంటనే సేమ్‌ గ్రూప్‌ వున్నా గుండెకాయ  కావలి ఎవరైన హర్ట్‌ డోనేట్‌చేయాలి, లేకపోతే చనిపోతుంది అని చెప్పాడు......
ఆ అమ్మయి తన లవర్‌ చేతులు పట్టుకొని ఏడుస్తు ఇల చెప్పింది రే నేను కొద్దిరోజుల్లో చనిపోతనంట నువ్వు నన్ను మర్చిపోరా PLS RAA నా చివరి కోరిక ఇదేర,
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, నా కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోరా అని అంది......
ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి నువ్వు ఎక్కడకి పోతావు రా నన్ను వదిలి నీకుఏమి కాదురా నేను ఉన్నాను కదా.......
ఆ అమ్మయి ఏడుస్తు అంది, నువ్వు అంతా నమ్మకంగా ఎలా చెబుతున్నావు రా నేను బ్రతుకుతాననీ.....
ఆ అబ్బాయి అమ్మయి నుదుటి మీద ముద్దు పెట్టి నీకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వలేదుకదా,
ఆ గిఫ్ట్‌ చూడు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు......
రెండు రోజులు తర్వాత ఆ అమ్మయి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది......
తన బ్‌డ్‌రూంలో ఒ లెటర్‌ వుంది, ఆ లెటర్‌లో ఇల రాసి వుంది
Dear,
బుజ్జి.. నీవు ఇ లెటర్‌ చదువుతున్నావు కదా, నువ్వు బ్రతుకుతావునీ చెప్పాను కదా
నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలా చనిపోతావు రా
నా ఆకరి శ్వాస వరకు నీ కోసమే బ్రతుకాలి అనుకున్నా
నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాలనీ అనుకున్నా
"బుజ్జి"నువ్వు మొన్న అడిగావు కదా నా బర్త్‌డే కిఏ గిఫ్ట్‌ ఇస్తావనీ
నీకు అప్పుడు చెప్పాను కదా నీకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్‌ నేను ఇస్తాననీ
నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్‌
( నా గుండే నీకు గిఫ్ట్‌ గా ) ఇచ్చ బంగారం ఏడవకు రా నేను చనిపోయిన
నా గుండే నీ దగ్గరే వుంది కదరా, నాగుండే లో వున్నది నీప్రాణమే
" బుజ్జి " I Love u Bujji..  True love never dies.....
నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు...
ఆ అబ్బాయి తన గుండేను డోనెట్‌ చేసాడు తన ప్రియురాలి కోసం.....
ఇప్పటికి అబ్బాయిలు ప్రేమకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వున్నారు కనుకనే ప్రేమ అనే పదం
బ్రతికుంది.... 

Monday, July 8, 2013

మనీ.... మనీ....





నోరు లేకుండానే పలకరిస్తుంది
కళ్ళు లేకుండానే శాశిస్తుంది
చేతులు లేకుండానే ఆడిస్తుంది
కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది
లేని బంధాలను కలిపేస్తుంది
ఉన్న బంధాలను తుడిపేస్తుంది
మనసు లేని "మనీ"
మనిషి చేసిన "మనీ"....

ఆలోచించు........


  
 
గెలిచి ఓడించు ద్వేషాన్ని,
ఓడైన గెలిపించు స్నేహాన్ని,
కొత్త స్నేహితులకోసం పాత స్నేహితలను
వదిలేయకండి...
ఈ రోజుల్లో నీకు మోసం చేయడం రాకపోతే
నువ్వే మోసపోతావ్ ....
ఎవరో సాయం చేస్తారని
కూర్చుంటే... మిగిలేది చీకటే!
నీ స్వయం కృషితో ముందుకు వేస్తే
కనిపించేది వెలుగు బాటే !!!

ఎక్కడో విన్నా....



దేవుడు మనిషిని స్రుష్టించింది ప్రేమించటానికి,
వస్తువుని స్రుష్టించింది వాడుకోవటానికి,
కాని మనిషే వస్తువుని ప్రేమిస్తున్నాడు...
మనిషిని వాడుకుంటున్నాడు..!

దేవుడు నాకు దూరమేమో ఇలా వ్రాసుకున్నా..

మనిషి మనిషిని స్రుష్టించుకుంది ప్రేమను పంచటానికి,
వస్తువుని స్రుష్టించుకుంది వాడుకోవటానికి,
కాని ఆ మనిషే వస్తువుని ప్రేమిస్తున్నాడు...
మనిషిని వాడుకుంటున్నాడు..!

Thursday, June 20, 2013

అమ్మ-నాన్న, నన్ను దీవించండి.......



నేను నా తల్లి కడుపులోంచి బయటకు వచ్చి
నేటికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను
మా అమ్మ కడుపులోంచి నేను బయటకు వచ్చేటప్పుడు
పురటి నొప్పులను అమ్మ ఆనందంగా అస్వాదించింది
కాని  దానికి ప్రతిఫలంగా నేను మా అమ్మకు ఏమి చేయలేకపోయాను
అమ్మ నాన్నలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ మాటను కాదన్నాను,
నా తలపై అక్షింతలు వేద్దామన్న వాళ్ళ కోరికను నెరవేర్చలేకపోయాను
అయినా వాళ్ళు నన్ను క్షమించి, నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు.
ఈరోజు నా పుట్టినరోజు....... కాని అమ్మ-నాన్నలు ఊరికి 5 రోజులు గడుస్తున్నాయి
వాళ్ళ దీవెనలు అందుకోలేకపోయాను,  వాళ్ళకు ఫోన్ కూడా లేదు,
ఎక్కడున్నా వాళ్ళు నన్ను తప్పక దీవిస్తారనుకోండి,
కాని దగ్గరుండి అందుకోలేకపోయనే అనే దిగులు మనసులో ఉంది
మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను చెప్పండి, నా జన్మంతా మీకు సేవలు చేసే భాగ్యం ప్రసాదించండి చాలు........
మాతృదేవోభవ....పిత్రుదేవొభవ...గురుదేవొభవ
అందరు నన్ను ఆశిర్వదించండి  

- -
మీ
పండు

Friday, June 14, 2013

నా ప్రాణమే నువ్వు కదా...




ఆవేదనలోంచి వచ్చేది ఆలోచన కాదు, అనాలోచన
ప్రశాంతతలో  పుట్టేది మంచి ఆలోచన....
నా ప్రేమ పునాదిలాంటిది, ఎందుకంటే
నా ప్రేమ మనసులోంచి పుట్టింది.
నీ ఆవేదన నాకు అర్ధమైంది....కాని ఏమి చేయను చెప్పు?
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్తితి నాది. 
ప్రేమించేప్పుడు సంపాదించలేము...
సంపాదించేప్పుడు ప్రేమించలేము,
రెండు ఒకేసారి చేయలేము కదా... అలా అని
నిన్ను ప్రేమించడం లేదు అని ఎప్పుడు అనుకోకు,
నా మనసంతా నువ్వే, నా సర్వస్వం నువ్వే
నేను గడిపే ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తావు
నేను చేసే ప్రతి పనిలో నువ్వే కనిపిస్తావు
నా మనసులో నీపై ఆకాశమంత ప్రేమ,
నాకు అమ్మంటే ఎంత ప్రేమనో ... నువ్వంటే కూడా అంతే ప్రేమ 
I LOVE YOU SWEET HEART......... 
అది నీకు బయటకు కనపడక పోవొచ్చు.. 
నీ దగ్గర ఉన్నంత సంతోషంగా ఎవరితోనూ లేను 
నీవల్లే సంతోషం, నీవల్లే కన్నీటి భాష్పాలు,
ఒకసారి సముద్రంకేసి దూరంగా చూడు, 
ఆకాశం, సముద్రం రెండు కలిసే ఉన్నట్లుగా కనిపిస్తాయి
కాని అది ఎంత వరకు నిజమో అందరికి తెలుసు.   
నువ్వు లేక నేను లేను అని నేను అనను,
నా శ్వాస లేక నేను లేను అంటాను... ఎందుకో తెలుసా
నా శ్వాసే నువ్వు కదా..... నా ప్రాణమే నువ్వు కదా...

Thursday, June 13, 2013

పుట్టినరోజు శుభాకాంక్షలు...



దేవి.........
నా ప్రియ మిత్రామా  ...
నువ్వు పరియచమయ్యి ఐదు వసంతాలు పూర్తయ్యాయి
ఈ ఐదు సంవత్సరాలలో మన మధ్య ఎన్నో సంఘటనలు చోటు చెసుకున్నయి...
అందులో మొదటిది నా వల్ల నీ స్నేహానికి దూరం అవ్వడం
దానికి  కారణం ఏంటో కూడా నీకు బాగా తెలుసు
నీ స్నేహం విలువ తెలిసి కూడా నీకు దూరం అయ్యాను, నీతో మాటలు లేవు,
నిన్ను కలవడం లేదు, కాని నీ పుట్టినరోజు మాత్రం నేను మరవను
ప్రతి  సంవత్సరం నా ఈ బ్లాగ్ లో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నాను...
నువ్వు చుస్తున్నవో లేదో నాకు మాత్రం తెలియదు, కాని నా wishes మాత్రం
ఎప్పుడు నీకు ఉంటాయని మరవకు, wish u many many happy return of the day my dear sweet friend........

dear frnd: meeru kuda naa tarapuna naa mitruraaliki puttinaroju shubhakaankshalu chepputarani korukutunna.... 

Saturday, June 8, 2013

ఒక చిన్న మాట.....

 

 
ప్రేమకు సంబంధించి సాధారణంగా రెండు పొరపాట్లు  చేస్తారు
తమను నిర్లక్ష్యం చేసేవారిని ప్రేమించడం,
లేదా తమను ప్రేమించేవారిని నిర్లక్ష్యం చేయడం,
ఈ సమస్యకు పరిష్కారం....?
నిన్ను "నిన్ను"గా ప్రేమించే వారిని ప్రేమించడం 

Tuesday, March 26, 2013

నువ్వే అనుకున్నా..........



నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతోంది,
ఫోన్ చేసింది నువ్వే అనుకున్నా....
నా ఫోన్ లో మెస్సేజ్ వచ్చింది
అది చేసింది నువ్వే అనుకున్న
బైక్ పై అలా వెళ్తూ ఉంటే ఓయ్...  అని శబ్దం వినిపించిది
పిలిచింది  నువ్వే అనుకున్నా,
అలా వీధిలో నడుస్తున్నా,
వెనక నుండి ఎవరో తడిమినట్టు అనిపించింది
అది నువ్వే అనుకున్నా......
నువ్వు నాకు దూరంగా ఉన్నా....
నా మది మాత్రం నీ ద్యాసలోనే....ప్రతి క్షణం.
నా మదిలో నీకు చోటిచ్చాను, ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను
మరి నీ మదిలో ఉన్న నన్ను మాత్రం దూరంగా  ఎందుకు పెడుతున్నావు
నా ప్రేమంటే అలుసా.......లేక నా ప్రేమ నీకు తెలియకన??
రోజు రోజు కి నాలో ఒంటరితనం ఎక్కువ అవుతుంది,
అది నీ వల్లే................

Monday, March 25, 2013

ప్రేమ+దైర్యం=నేను



మాటల్లో చెప్పలేనంత ప్రేమ,
కంటికి కనిపించనంత ప్రేమ,
ఉహకు అందనంత ప్రేమ,
నేను చచ్చాక కూడా ప్రేమించెంత ప్రేమ,
నీ మనసు  "ముళ్ళ" కంచె అని తెలిసి కూడా ప్రేమించెంత ప్రేమ నాది..
నువ్వు నా కంఠం పట్టుకొని వద్దన్నా కూడా నిన్నే ప్రేమించెంత ప్రేమ,
నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను కాని,
ఎంత ప్రేమో...   చెప్పగలిగాను, చూపించగలను కూడా
నువ్వు వద్దన్నా నాకు కావలసింది నేను తీసుకుంటాను,
నువ్వు దూరంగా ఉన్నా, ఎప్పుడు నాతోనే ఉంటావనే కల(కాదు నిజం)
నాది స్వచ్చమైన ప్రేమ, నిజాయితితో కూడుకున్న ప్రేమ,
ఇంకా నా ప్రేమను ఎన్నో రకాలుగా చూపించగలను,
నీకు చూసేంత దైర్యం ఉంటే....ఉందా?
 
29501