Wednesday, August 8, 2012
Friday, August 3, 2012
Wednesday, August 1, 2012
చీకటి లేదు....
నీ కంటి చూపుల వెలుగులతో చీకటి అనేది లేకుండా చేశావు
నీ నవ్వుల గలగలలతో నాకు నిదురని దూరం చేశావు
మౌనంగా ఉండే నా పెదవులను అనుక్షణం నీ పేరే తపించేల చేశావు
హృదయం పగిలేల సవ్వడి చేస్తూ ఊహల్లో నాట్యం చేస్తున్నావు
నీవు లేకుండా నా జీవితం ఇక సాగదేమో అనుకునేల చేస్తున్నావు
నీవు నాకు లేవు అని తెలిస్తే ఇక నేను లేనేమో అనుకుంటున్నాను
నా శివరంజని రాగం....
ప్రపంచం ఎదురొచ్చినా పోరాడే నా ధైర్యం నువ్వు
ఎవరు కాదన్నా అవునన్నా నా ధ్యాస... నా ధ్యానం నువ్వు
కన్ను మూసిన తెరచిన నా రెప్పల మాటున దాగిన స్వప్నం నువ్వు
మూగవోయిన గాత్రంతో అనుక్షణం నేనాలపించే నా శివరంజని రాగం నువ్వు
దూరమైనా చేరువైన నా పయనానికి గమ్యం నువ్వు
నీ నీడనై ఉంటా నిసి రాత్రి మింగేస్తున్న వెన్నెల వెలుగువై నాతొ ఉంటావని నువ్వు