Friday, March 12, 2010
నన్ను ఏమి చేయమంటారు.........
ఇప్పుడు నా ప్రేమ సంగతి నా బుజ్జి వాళ్ళింట్లో తెలిసిపోయింది.....అసలు మేమే చెప్పాలి అనుకున్నాము
కాని వాళ్ళకెలా తెలిసిందో అర్ధం అవడంలేదు. వాళ్ళింట్లో మాత్రం కులాంతర వివాహం అంటే ససేమిరా అంటారు
నాకేం చేయాలో తోచడం లేదు....మా ఇంట్లో వాళ్ళను నేను ఒప్పించ్చగలను....కానీ బుజ్జి వాళ్ళింట్లో ఎలా ఒప్పించాలో తెలియడం లేదు...ప్రతి ప్రేమికులకు ఎదురయ్యే సమస్యే ఇప్పుడు మాకు ఎదురు అయ్యింది....కాని ఎలా అధిగమించాలో తెలియడం లేదు.
నాకైతే ఎప్పుడు ఏమి జరుగుతదో అని భయంగా ఉంది...నాకే ఇలా ఉందంటే తన పరిస్తితి ఇంకెలా ఉందొ......
ప్రేమకు, పెళ్ళికి "కులం" ఎందుకు....
తను "పద్మశాలి BC", నేనేమో "మాల SC"...
మరి వాళ్ళింట్లో కులం పిచ్చి ఎక్కువగా ఉంది....వాళ్ళతో మాట్లాడిన ఒప్పుకునే పరిస్తితి కనిపించడంలేదు
తనకు నేను కావలి...నాకు తను కావలి.....ఇద్దరం మేజర్సే...కానీ ఇద్దరికీ పారిపోయి పెళ్లి చేస్కోవడం ఇష్టం లేదు
వాళ్ళింట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో....ఏమని చెప్పాలో తెలియడం లేదు.....
ఈ పెద్దలు మారార.... పిల్లల ప్రేమను అర్ధం చేస్కోర....
చిన్నప్పుడు కొనే ప్రతి వస్తువుని...నీకు నచ్చిందా అని అడుగుతారు....
మరి పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకల ఆలోచించరు....
ఓ పెద్దలారా ఒక్కసారి ఆలోచించండి....మా ప్రేమను అర్ధం చేస్కొండి..
కలకాలం సంతోషంగా ఉంటాము అనే వారిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండమంటార....
లేక మీరు ఎవరితోనే చేసే పెళ్లి చేసుకొని ఇష్టం లేకుండా చచ్చిన శవంలా బ్రతకమంటారా....
మా ప్రేమే వివలమైతే మీరు ఆనందిస్తారేమో....కాని మాకు మాత్రం యమపాషమే దిక్కు
మీలో ఎవరైనా కులాంతర వివాహం చేస్కునే ఉంటారు కదా.....మీరేమి చేసారో కాస్త చెప్పండి
మా ప్రేమకు మీవంతు సహాయం చేయండి దయచేసి..............
11 మీ మనసులోని మాటలు:
మీరేమి అధైర్య పడకండి . స్వచ్చమైన మీ ప్రేమ తప్పకుండా success అవుతుంది .
ద్యన్యవాదములు శివరంజని గారు........ఆ నమ్మకంతోనే ఇంకా బ్రతికే ఉన్నాను...
meeru bayapadavaddu parents bada padatharani alochinchavaddu.. meeru iddaru kalasi matladukoni oka plan alochinchadi aa plan follow avvandi.. ippudu parents feel avvuthani meeru silent ga vunte life long meeru feel avvutharu.. meeru marrage chesukondi vare adjust avutharu..okarini okaru preminchadam chala thelika .. vidi poyi brathakadam narakam .. na exp. meeda chepthunna vere ga anukovaddu
ok thanx for your suggestion & comments my dear frnd
ikkada natarapuna oka prolam undandi....entante 4 years back naa sontha annay kuda paripoyi love marriage cheskunnadu...ippudu nenu kuda ilage cheste mari maa parents ela ani alochichalsina paristiti vastundi....emi cheyalo teliyatla...mavallanu oppinchagalanu....but vallintlo vallane ela oppinchalo teliyatla
ప్రేమే గెలుస్తుందిలెండి....
మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండ మా ప్రేమ గెలుపు ఖాయం....
thanx padmaripita gaaru....
hey Jaanu.
chla jagartaga iddaru kalisi friends help tisukuni oka plan chesukondi. a plan prakaram oke matapai undani. etuvanti paristitulo kuda vadalodu. meeru iddaru epudu happy ga undali...... mi kosam devudi dagara kuda dannam pettukunnanu.........
wish u goodluck for ur love.
mee intlo oppinchi meeru pelli chesesukondi...
oka vela mee intlo pelli ki oppukoka pothe paaripoyi chesukondi. Kaani paaripoyi vellataniki mundu okati baaga gurtunchukondi..
mee tallitandrulu mimmalni chaala premistunnaru valla premakante mee prema balamainadi anukuntene vellandi...jeevitam mottam vallu leka poyina vundagalanu anukunte vellandi..
ee renditilO yedi nijam kaka poyinaa meeru vallu yenduku vaddu antunnaro alochinchatam manchidi
వురేసుకు చావండి. మీ ప్రేమతో ఎవరిని ఉద్ధరిద్దామని?
2ఏళ్ళయ్యాక , దూల తీరాక , ఇద్దరికీ కులాలు గుర్తొస్తాయి. వాళ్ళ వాళ్ళతో గొడవలొస్తాయి. విడాకులొస్తాయి .. ఇలాంటి ఫిల్మీ ప్రేమకథలు చానా చూశాం, విన్నాం.
శంకర్
అన్నిటికన్నా ముందుగా మీరు ప్రేమించిన అమ్మాయికి చెల్లెల్లున్నారా? లేదా ఆమె తర్వాత పెళ్ళి కావల్సిన వాళ్ళు ఉన్నారా? అన్నది ఆలోచించండి. ఆమెకు చెల్లెల్లు కాకుండా తమ్ముళ్ళు ఉంటే ఫర్వాలేదు. ఎవ్వరూ లేకపోతే మరీ మంచిది. అలా కాకుండా ఆమె తర్వాత వాళ్ళింట్లో పెళ్ళి కావల్సిన ఆడపిల్లలు ఉంటే మాత్రం, మీరు పారిపోయి పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. లేదా అనుమానాలతోనూ, బంధువుల నుంచి సూటిపోటి మాటలతోనూ, వీలైతే చదువు మాన్పించడమో, వంటి రక రకాల కారణాల వల్ల ఆ అమ్మాయికి పెళ్ళయ్యేంతవరకు నరకం అనుభవించొచ్చు. లేదా ఆ అమ్మాయికి పెళ్ళిచెయ్యడానికి ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడొచ్చు.
ఒకవేళ మీరు ప్రేమించిన అమ్మాయికి చెల్లెల్లు ఎవ్వరూ లేకపోతే మాత్రం మీరు పారిపోయి పెళ్ళి చేసుకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. మహా అయితే కొన్నాళ్ళు బాధ పడతారు. దీనికోసం మీ అన్నయ్య సహాయం తీసుకొండి. మీ పెద్దలను ఎలాగూ ఒప్పించగలనన్నారు కాబట్టి, మీరు సంప్రదాయబద్ధంగా మీ పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకోవచ్చు. ఎటొచ్చి మీ మామగారిని ఒప్పించడానికే కొంచెం ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఈ ఒప్పించడాలు కూడా మీకున్న ఆస్తి మీద, మీ మామగారి కున్న ఆస్తి మీద, మీరు చేస్తున్న ఉద్యోగం మీద ఇలా చాలా వాటి మీద డిపెండ్ అయ్యుంటుంది.
Post a Comment