RSS

Friday, March 12, 2010

మెల్‌బోర్న్‌లో ప్రేమ....యాదగిరిగుట్టలో పెళ్లి....


మనసులో మెదిలే భావాలు…. ఊహకందని రాగాలు. వాటిని అదుపులో వుంచటం ఎవరికి సాధ్యం కాదు. అది ప్రేమైతే ఇక చెప్పనవసరమే లేదు. ఆ… సరిగమల తాకిడికి చిత్తవని హృదయం వుండదు. గుండె లోతుల్లో చిగురించే ఆ ప్రేమ… ఓ రెండు హృదయాలను ఒక్కటి చేసింది. ఖండాంతరాలు దాటిన వారి సరాగాల ప్రేమ పల్లకిపై టీవీ5 ప్రత్యేక కధనం అక్కడ అమ్మాయి … ఇక్కడ అబ్బాయి… ఇదేదో సినిమా టైటిల్‌ అనుకుంటే పొరపాటే. ప్రేమకు కులం మతం అడ్డురాదని ఆస్తి ఆంతస్తు పట్టింపు లేదని అంటుంటారు. కాని ఈ సువిశాల ప్రపంచం కూడా క్షణకాలంలో చిగురించే ఈ రెండక్షరాల ప్రేమకు అతీతమేం కాదు. గుంటూరు జిల్లాకు చెందిన నర్సింహ చైతన్య విషయంలో కూడా అదే జరిగింది. ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళిన అతనికి అక్కడే మెల్‌బోర్న్‌కు చెందిన లుచియాతో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. మామూలుగానే ప్రేమకు ఎదురయ్యే సమస్యలన్నీ ఈ జంటకు హాయ్‌ చెప్పాయి. కాని అచంచల ఆత్మవిశ్వాసంతో వారు పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్ళిపీటల దాకా తీసుకొచ్చారు. దాంతో ఇండియాకు తిరిగివచ్చి యాదగిరి గుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ఒక్కటయ్యారు. అందమైన గులాభి లాంటిదే ప్రేమ. పరిమళాలు వెదజల్లే ఆ ప్రేమకు ముళ్ళ లాంటి సమస్యలు వుంటాయి. ప్రియురాలి కోసం… ప్రేమికుడు ముళ్ళను అధిగమించినపుడే విజయం సొంత మౌతుంది. ప్రేమ కలకాలం అతనితోనే వుంటుంది.

జయహో ప్రేమా...............
  

1 మీ మనసులోని మాటలు:

Anonymous said...

Stupid!

Post a Comment

 
29501