RSS

Wednesday, December 16, 2009

ముద్దు ఎందుకో చెప్పనా.........



ముద్దు చరిత్ర......

కేవలం - రతీ మన్మధులకోసమే ఓ తీయని ఫలం పండేది. దాన్ని వారిద్దరూ ఏకాంతంలో రుచిచూస్తూ ఆ అద్భుతమైన తీయదనాన్ని ఆస్వాదిస్తూండేవారు.
ఇంత తీపిని మనమేకాదు ... మానవులక్కూడా పంచుదామా స్వామీ అడిగింది రతి.
అలాగే రతి. కానీ ఫలరూపంలో కాదు
మరి?
ముద్దు రూపంలో అన్నాడు రసిక మన్మధుడు.
అందుకే ముద్దు మన్మధుని మొదటి అస్త్రం


ప్రేమను వ్యక్తపరచే ఓ అద్భుతమైన సాధనం ముద్దు‌. బయొలాజికల్‌ భాషలో చెప్పాలంటే ఓ కెమికల్‌ రియాక్షన్‌ అన్నమాట. స్పర్శలతో తీరని కాంక్ష ఒకటి గట్టిగా గుండెను పట్టుకునుండిపోతుంది. ఎంత చూస్తున్నా ఇంకేదో చవిచూడాలనేభావం నిలవనీయదు. అందుకే ... క్షణానికోసారి వేడి ఆవిర్లు ... చల్లని వొణుకు రెండూ కలిసి రక్తవేగాన్ని పెంచుతాయి. పెదాలు వెచ్చగా ... ఏ కొలబద్దకు అందనంత ఉష్ణోగ్రతతో అదుర్తుంటాయి. అప్పుడు నీకు- దగ్గరగా ... చాలా దగ్గరగా కూర్చున్నపుడు - నిన్ను- ఒడిసిపట్టుకుని ముద్దుపెట్టుకోకుండా ఉండలేను. చెలరేగే తాపాన్ని ఓ చిన్న ముద్ది చ్చి తీర్చచ్చు కదా అని భావిస్తాను. పెట్టాలని మాకెంత ఇదిగా వుంటుందో పెట్టించుకోవాలని మీకు అంతే ఇదిగానే వుంటుంది. కాని బయటకి చెప్పడానికి మొహమాటం తో కూడిన సిగ్గు అడ్డు కదా మీకు....ఎందుకంటే మేము అమ్మాయిలం కదా అంటారు.......అదే - ముద్దంటే...

నేను ముద్దు ఎందుకు ఇస్తానో చెప్పనా.....

1 మనసులోని తీవ్రమైన తాపాన్ని తట్టుకోలేక ముద్దిస్తాను.
2 మన ఇద్దరి మద్య ఉండే ఘర్శనకి ఫుల్‌స్టాప్‌గా ముద్దు పెడుతను.
3 స్పర్శానుభూతిని అనుభవించడానికి ముద్దు ఇస్తాను.
4 నువ్వంటే నాకింతిష్టమని చెప్పడానికి ముద్దు ఇస్తాను.
5 నువ్వు దేవతలా కనిపించేసరికి కానుకగా ముద్దిస్తాను చెలీ......



ఒక్కో ముద్దుకు ఒక్కో అర్ధం

1 నిద్రనుంచి లేస్తూ నుదుటి మీద పెట్టే ముద్దు నిత్యముద్దు.
2 ముద్దలు తిన్పిస్తూ పెట్టే ముద్దు చెంపమీద చిరకాలం నిల్చే ముద్దు.
3 ఆఫీసుకెళ్తూ వొకరినొకరు యిచ్చుకునే ముద్దు ఉత్సాహభరితమైన ముద్దు.
4 గుర్తొచ్చినపుడు - ఫోన్లో మాట్లాడుకుంటూ ముద్దుతో క్రెడిల్‌ చేసే ఫోన్‌ ముద్దు లవ్లీ
ముద్దు.
5 ఇంటికి రాగానే అలసిపోయిన ఇద్దరూ ఒకరివొళ్ళో ఒకరు సేద తీర్చుకుంటూ చేతులమీద
పెట్టుకునే ముద్దు ఓదార్పు ముద్దు.
6. అడగకుండా ఒకరికొక యిచ్చుకునే ముద్దు ఆకాశమంత ముద్దు.
7 అందీ అందకుండా ఒకరికొకరు యిచ్చుకునే ముద్దు అబ్బ అనేంత ముద్దు
8 కొసరికొసరి పెట్టించుకునే ముద్దు కొండంత ముద్దు.
9 ఆపదల్లో - నీటి తెరకప్పిన కన్రెప్పలపై యిచ్చే ముద్దు ఆస్తంత ముద్దు.

ఇన్ని రకాల ముద్దల్లో నువ్వు ఇచ్చే మొదటి ముద్దుకోసం ఎదురుచూస్తూ.....


నీ పండు...........

7 మీ మనసులోని మాటలు:

Praveen Communications said...

చలం భావ రహిత సమాజం లో ముద్దులు ఉండవు. నేను రాసిన కధ లో హీరో ముసలమ్మని ముద్దు పెట్టుకుంటాడు. అందుకే మా కోలనీ లో ముసలమ్మలకి నన్ను చూస్తె బయం. నేను అప్పుడప్పుడు బిసినెస్ చేస్తూ గూండాలకి బయపడకుండా కరీంనగర్లో కొన్నాళ్ళు ఉన్నాను. మా చుట్టాలు అనంత పురం లో ఉన్నారు . ఎక్కడో ఉన్న నాకు హేగిలియన్ తత్వ శాస్త్రంఅనవసరం

Megastar said...

ముద్దు గురించి ఎంత ముద్దు ముద్దుగా చెప్పారు.
ముగ్ధ మనోహరంగ ఉంది మీ వర్ణన

sree said...

Muddu kosam muddu muddu ga cheparuuuu, Assalu meru emi anukuntunaru Priuraliki muddu pettadam Tappa??? meru chepandi

pandu said...

thanx for your comments frnz, priyuraliki muddu pettadam lo tappem ledu....kani haddullo undali anedi na abiprayam.........miremantaru

పరిమళం said...

ముద్దుగురించి ముద్దుగా బాగానే చెప్పారు ..చిత్రం మాత్రం అద్భుతంగా ఉంది ...మరి ఆర్తితో పాదాలను తడిపే ఆ కన్నీటి ముద్దు మాటేవిటి ?

Unknown said...

parimalam gaaru adi kanniru kaadandi....na cheli naku muddivagane na kantlonchi vache andabhashpalatho na cheli paadalaku abhishekam cheyyalani.............

శృతి said...

chala muddu ga undi nee kavita

Post a Comment

 
29501