RSS

Monday, August 31, 2009

నా వెంటే ఉన్నావన్న ఆశతో



ఒంటరిగా వెళుతున్న జీవితంలోకి
అనుకోకుండా నువ్వొచ్చావు
అన్నీ తెలుసనుకునే నాకు
అనుభూతులెన్నో చూపించావు
ఎదురుచూపంటె తెలియని నాకు
ఎన్ని జన్మలయినా ఎదురుచూసేలా చేశావు
సృష్టి నిండా స్నేహం ప్రేమ రెండే గొప్పవనుకున్నాను
వీటికన్నా గొప్పది మన అనుబంధం అని తెలుసుకున్నాను
ఇద్దరు మనుషులు కలసి ఉంటేనే బంధం అనుకున్నాను
మనస్సులు కలిస్తే కూడా బంధమవుతుందని తెలుసుకున్నా
దూరంలో ఉన్నావని బాధలో ఉన్నా
నా వెంటే ఉన్నావన్న ఆశతోబ్రతుకుతున్నా ...

0 మీ మనసులోని మాటలు:

Post a Comment

 
29501