RSS

Thursday, June 20, 2013

అమ్మ-నాన్న, నన్ను దీవించండి.......



నేను నా తల్లి కడుపులోంచి బయటకు వచ్చి
నేటికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను
మా అమ్మ కడుపులోంచి నేను బయటకు వచ్చేటప్పుడు
పురటి నొప్పులను అమ్మ ఆనందంగా అస్వాదించింది
కాని  దానికి ప్రతిఫలంగా నేను మా అమ్మకు ఏమి చేయలేకపోయాను
అమ్మ నాన్నలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ మాటను కాదన్నాను,
నా తలపై అక్షింతలు వేద్దామన్న వాళ్ళ కోరికను నెరవేర్చలేకపోయాను
అయినా వాళ్ళు నన్ను క్షమించి, నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు.
ఈరోజు నా పుట్టినరోజు....... కాని అమ్మ-నాన్నలు ఊరికి 5 రోజులు గడుస్తున్నాయి
వాళ్ళ దీవెనలు అందుకోలేకపోయాను,  వాళ్ళకు ఫోన్ కూడా లేదు,
ఎక్కడున్నా వాళ్ళు నన్ను తప్పక దీవిస్తారనుకోండి,
కాని దగ్గరుండి అందుకోలేకపోయనే అనే దిగులు మనసులో ఉంది
మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను చెప్పండి, నా జన్మంతా మీకు సేవలు చేసే భాగ్యం ప్రసాదించండి చాలు........
మాతృదేవోభవ....పిత్రుదేవొభవ...గురుదేవొభవ
అందరు నన్ను ఆశిర్వదించండి  

- -
మీ
పండు

2 మీ మనసులోని మాటలు:

Anonymous said...

Happy Birthday To you.

Unknown said...

thanq very much andi..........i hope tht u r my shruthi......

Post a Comment

 
29501