RSS

Friday, June 14, 2013

నా ప్రాణమే నువ్వు కదా...




ఆవేదనలోంచి వచ్చేది ఆలోచన కాదు, అనాలోచన
ప్రశాంతతలో  పుట్టేది మంచి ఆలోచన....
నా ప్రేమ పునాదిలాంటిది, ఎందుకంటే
నా ప్రేమ మనసులోంచి పుట్టింది.
నీ ఆవేదన నాకు అర్ధమైంది....కాని ఏమి చేయను చెప్పు?
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్తితి నాది. 
ప్రేమించేప్పుడు సంపాదించలేము...
సంపాదించేప్పుడు ప్రేమించలేము,
రెండు ఒకేసారి చేయలేము కదా... అలా అని
నిన్ను ప్రేమించడం లేదు అని ఎప్పుడు అనుకోకు,
నా మనసంతా నువ్వే, నా సర్వస్వం నువ్వే
నేను గడిపే ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తావు
నేను చేసే ప్రతి పనిలో నువ్వే కనిపిస్తావు
నా మనసులో నీపై ఆకాశమంత ప్రేమ,
నాకు అమ్మంటే ఎంత ప్రేమనో ... నువ్వంటే కూడా అంతే ప్రేమ 
I LOVE YOU SWEET HEART......... 
అది నీకు బయటకు కనపడక పోవొచ్చు.. 
నీ దగ్గర ఉన్నంత సంతోషంగా ఎవరితోనూ లేను 
నీవల్లే సంతోషం, నీవల్లే కన్నీటి భాష్పాలు,
ఒకసారి సముద్రంకేసి దూరంగా చూడు, 
ఆకాశం, సముద్రం రెండు కలిసే ఉన్నట్లుగా కనిపిస్తాయి
కాని అది ఎంత వరకు నిజమో అందరికి తెలుసు.   
నువ్వు లేక నేను లేను అని నేను అనను,
నా శ్వాస లేక నేను లేను అంటాను... ఎందుకో తెలుసా
నా శ్వాసే నువ్వు కదా..... నా ప్రాణమే నువ్వు కదా...

0 మీ మనసులోని మాటలు:

Post a Comment

 
29501