RSS

Thursday, October 4, 2012

దేవుడు ఎందుకు కనిపించడు...??






ఎందుకు కనిపించడు!
దేవుడు తప్పకుండా కనిపిస్తాడు.
ప్రతివారికి, ప్రతిరోజూ, ప్రతిచోట, ఎక్కడో ఒకచోట కనిపిస్తుంటాడు
మనమే అతనిని గుర్తించడం లేదు.


ఒకసారి తొందరలో రోడ్డుకి అడ్డంగా వస్తుపోయే వాహనాలను గమనించకుండా పరిగెత్తావు గురుతుందా! నీ వెనుకనుండి నీకు తెలియని నీకు సంబంధం లేని ఎవరో "బాబు! బస్సొస్తుంది" అంటూ కేకవేసారు. గుర్తోచిందా! ఆ కేక వేయించిదేవరో గుర్తించావా! ఆయనే దేవుడు!

మరొకసారి మోటర్ స్కూటర్ ఎక్కి కుడి ఎడమలు గమనించకుండా పనితోన్దరలో దూసుకొని పోబోతుంటే కాకి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి (పోలీసు) నిన్ను గట్టిగ మందలించాడు. గుర్తుకు వచ్చిందా! ఆయనే దేవుడు!

మరల ఒకసారి నడివీధిలో ఒకడి చొక్కపట్టుకొనే వాడిని నాలుగు గుద్డుతూ వానిచేత నాలుగు గుడ్డిన్చుకుంటూ క్రింద పడి పైనపడి చొక్కా చించుకొని ఉన్న సమయంలో దారినబోయే ఒకాయన "ప్లీజ్జ్స్సార్! వదిలేయండి! తెలిసినవారు మీరుకూడా" అంటూ మిమ్మల్ని ప్రక్కకు నెట్టిన ఒక మనిషి గుర్తున్నాడా నీకు! అయ్యో ఆయనే మనిషిరుపంలోని దేవుడు!

ఇన్ని సార్లు నీ వద్దకు తనంతతానుగా వచ్చినా గుర్తించలేదా!

మనిషి రూపంలో వస్తేనే చుడలేకపోయవ్. ఎంత పిచ్చివాడివి!
అనంతానంత దివ్య శక్తులతో వస్తే నీవిన్కేం చూస్తావ్?!?
అందుకే అసలు రూపంలో కనిపించడు నీకు.

పైన చెప్పిన సంగటనలు నాకు జరిగినవే అని గమనించగలరు.

5 మీ మనసులోని మాటలు:

anrd said...

చాలా చక్కగా వ్రాసారండి.

చిలమకూరు విజయమోహన్ said...

well said!

Unknown said...

thanx for your comments anrd & mohan gaaru.......

Padmarpita said...

చక్కగా చెప్పారు.

Unknown said...

than q very much padmarpita gaaru....

Post a Comment

 
29501