RSS

Friday, October 5, 2012

వివాహాలు.....!!!






భ్రాహ్మీ, దైవ (ఆర్షం) ప్రజాపత్య, రాక్షస, అసుర, కన్యాశుల్క, గాంధర్వ, పైశాచిక మని వివాహాలు ఎనిమిదైన, ఆర్యధర్మ ప్రకారం వివాహాల్లో నాలుగు రకాలు ప్రఖ్యాతం,

1 భ్రాహ్మీవివాహం
2 గాంధర్వ వివాహం
౩. క్షాత్ర వివాహం
4 రాక్షస వివాహం

నాకు తెలిసిన రెండు వివాహాలను చెప్పదలచుకున్నాను....

భ్రాహ్మీవివాహం: ఋషి సంప్రదాయ బద్దమైన భ్రాహ్మీవివాహం ఆర్యసమ్మతమైన వివాహం, వధూ వరుల కుల పెద్దలు, తల్లిదండ్రులు అనుమతించి అంగీకరించి, ఆశీర్వదించి వైదిక విధితో ఆచారయుక్తంగా జరిపించేది భ్రాహ్మీవివాహం. ఇది సనాతన జన సమ్మతం! సత్సంప్రదాయం.

గాంధర్వ వివాహం: యువతీ యువకులిద్దరూ యుక్తవయసు గలవారైయుండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దలెవరి అంగీకారము లేకుండా, తమంతట తాముగా రహస్యంగా కానీ, వేరొకచోటికి పారిపోయి కానీ చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. ఈ వివాహం బ్రహ్మ వివాహమంతా గొప్పది కాదు...పవిత్రమైనది కాదు. శకుంతల దుష్యంతుని ఈ విధంగానే పెండ్లాడి కష్టాల పాలైంది. అందరి రాతలు రాసే బ్రహ్మ కుమార్తెకే తప్పలేదు ఇటువంటి కష్టాలు, ఇక సాదారణ రోజు కూలి చేసుకునే తండ్రికి పుట్టిన నాకు మాత్రం కష్టాలు తప్పవా  చెప్పండి.
అందుకే అనుభవిస్తున్నాను.

ఏమిటంటే, నూటికి తొంభై ప్రేమ వివాహాలు మంచి ఫలితాని ఇవ్వటం లేదు. యవ్వన ఉద్రేకాన్ని, సహజంగా యవ్వనంలో ఉండే ఆకర్షణను ప్రేమ అనుకొని పొరబడిపోయి ఎందరో తమ జీవితాలను పాడు చేసుకోవడం చూస్తున్నాము.

యవ్వన దశ చాలా ప్రమాదకరమైనది. యవ్వనమంటే ఒరిపిడి కలిగితే భగ్గున మండే అగ్గిపుల్లలాంటిది. మండటం మొదలయ్యాక పూర్తిగా మందు మొత్తం కాలేవరకు ఆగదు! యవ్వనదశ కూడా అంతే! అగ్గిపుల్లతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. వినియోగ పరచుకునేవారి వివేకం అది.

2 మీ మనసులోని మాటలు:

శృతి said...

chusas correcte andi..

Unknown said...

than q shruti gaaru........

Post a Comment

 
29501