కమ్మగా పాడే కోయిలనడిగాను,
నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని ...
చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,
నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...
వర్షించే మేఘాన్ని అడిగాను ,
నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...
హాయిని పంచే వెన్నెలని అడిగాను ,
ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...
పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,
నీ పరుగు నా కోసమేనా ? అని ...
నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,
నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,
నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......
2 మీ మనసులోని మాటలు:
తన ధ్యాసలో ఉండు నాతని అడిగాను
నీ బ్లాగు టపా తో నను తలచు అని
ఆతను నీ ధ్యాసలో మునిగిన ముని ఉన్నాడు.
thanx for your comment
Post a Comment