నిజంగా ప్రేమించి పెళ్ళీ చేసుకోవడం నా అదృష్టమో లేక దురదృష్టమో నాకు తెలిదు,
కాని మా పెళ్లిఅయ్యాక మేము ఇద్దరం బాగానే ఉన్నాము, కాని ఒకరోజు
మా మామ గారు ఫోన్ చేసి మా ఆఫీసు దగ్గరకి వచ్చి మమ్మల్ని కలసి
ఒక మాట చెప్పాడు, అయ్యిందేదో అయ్యింది మీరు ఇద్దరు సుఖంగా ఉండాలంటే
సెపరేట్ గా ఉండండి, అప్పుడు మేము మిమ్మల్ని చూడడానికి వస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అన్నాడు,
కాని పెళ్ళయి రెండు సంవత్సరాలు కావస్తుంది, మాకొక పాపా కూడా పుట్టింది, కాని ఇప్పటి వారకి ఎవరు రాలేదు,
మా మామ గారి మాటలను నేను అప్పుడే నమ్మలేదు కూడా, కాని నా భార్యామణి మాట వల్ల సెపరేట్
అవ్వాల్సివచ్చింది, తను వల్ల ఇంట్లో వాళ్ళు దగ్గరవుతరనే ఉద్దేశంతో అల్లా అన్నది కదా అని నేను సరే అన్నాను.
కాని ఇప్పటి వరకు వల్ల ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు, కనీసం మా పాపను చూడడానికి కూడా రాలేదు
మా బావమరదులు, మామ గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు కాని మా అత్తే ఇంకా కులం కులం అంటుంది
మా వల్లే తన ఆరోగ్యం బాగుందడంలేదని అంటున్నది. కాని ఒకటి మాత్రం నిజం
మా మామ & భార్య వల్ల మాత్రం నేను బలి-పశువును అయ్యాను.
2 మీ మనసులోని మాటలు:
పండూ.. మీరు ప్రేమ, ప్రేమ అని పలవరిస్తూ కవితలు రాస్తున్న టైము నుండి మీ బ్లాగుని గమనిస్తున్నాను. మీకు ప్రేమలో ఉన్నపుడు తప్పొప్పులేమీ తెలియలేదు. కనిపించలేదు. ఆ అమ్మాయి ఇష్టంతోనే తనని తీసుకుపోయి పెళ్ళి చేసుకున్నారు. అప్పుడూ మీకు ఆ అమ్మాయి తనవాళ్ళని కాదని మీతో వచేయడం ఒప్పనే అనిపించింది. ఇప్పుడు మాత్రం తను మిమ్మల్ని బలి పశువుని చేసిందంటున్నారు. మీరు మీవాళ్ళకి దూరమైతే తను తనవాళ్ళకి దూరమైంది. ఇద్దరూ కొన్ని పొందారు. కొన్ని కోల్పోయారు. మంఓ, చెడో ధైర్యం చేసి పెళ్ళాడారు. పాపని కూడా కన్నారు. ఇప్పుడు తప్పెవరిది, ఎవరు బలిపశువయ్యారు, ఎవరు చేశారు అని లెక్కలేసుకోకుండా సర్దుకుపోతూ కలసి బ్రతకండి. వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోవడానికి చూపించిన ధైర్యం ఎలాంటి పరిస్థితులలోనైనా కలసి బ్రతకడానికి కూడా చూపించండి. All the best.
మీరు మీవాళ్ళకి దూరమైతే తను తనవాళ్ళకి దూరమైంది ani annaru kada, tanaki vere atanitho pelli ayina kuda attarintlone andaritho kalise kadandi undalsindi, tanlo andarini kalupukupote lakshnalu velavani latega telusukunnanu, mainga tana father matalu vini tanu ala chestundi, anduke nannu bali-pashuvunu chesarani annanu. anthe kaani vere uddesham kadandi.
Post a Comment