RSS

Saturday, August 3, 2013

నీ ద్యాస ఆగదు...



ఇందుకా ప్రియా నేను నీకు దూరమైనది,
ఇన్నాళ్ళు మూగగా ప్రేమించింది,
నా ప్రేమను నా గుండెల్లోనే దాచుకున్నది,
నీ పైగల ఆరాటాన్ని కనురెప్పల మాటునే అణగదొక్కుకున్నది
నీ చిరునవ్వే నాకు చాలని,
అలా నిన్నే తలచుకుంటూ.. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని,
నీ ఆనందంలో నా సంతోషం చూసుకుంటున్నాను
నీ గెలుపులో నా చిరునవ్వును వెతుకుంటున్నాను
ఇలా అజన్మాంతం నిన్నే పిచ్చిగా.. మూగగా ....
ఆరాదిస్తూ ప్రేమిస్తూ బ్రతుకుదామనుకుంటే
ఎందుకు చేసావిలా ..........
ఇందుకేనా నన్ను నేను నీకు దూరం చేసుకున్నది
చివరకు నా బ్రతుక్కి అర్ధం లేకుండా చేసావుగా?
నా ఉపిరి ఆగినా నీపై ప్రేమ ఆగదు
ఈ కట్టే కాలిపోయే వరకు నా మదిలో నీ ద్యాస ఆగదు...

4 మీ మనసులోని మాటలు:

శృతి said...

its really nice, & heart touching:-))

Padmarpita said...

బాగుందండి.

Unknown said...

than q very much shruti gaaru

Unknown said...

Padmarpita gaaru......thanx for your comment andi.....

Post a Comment

 
29501