RSS

Tuesday, March 26, 2013

నువ్వే అనుకున్నా..........



నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతోంది,
ఫోన్ చేసింది నువ్వే అనుకున్నా....
నా ఫోన్ లో మెస్సేజ్ వచ్చింది
అది చేసింది నువ్వే అనుకున్న
బైక్ పై అలా వెళ్తూ ఉంటే ఓయ్...  అని శబ్దం వినిపించిది
పిలిచింది  నువ్వే అనుకున్నా,
అలా వీధిలో నడుస్తున్నా,
వెనక నుండి ఎవరో తడిమినట్టు అనిపించింది
అది నువ్వే అనుకున్నా......
నువ్వు నాకు దూరంగా ఉన్నా....
నా మది మాత్రం నీ ద్యాసలోనే....ప్రతి క్షణం.
నా మదిలో నీకు చోటిచ్చాను, ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను
మరి నీ మదిలో ఉన్న నన్ను మాత్రం దూరంగా  ఎందుకు పెడుతున్నావు
నా ప్రేమంటే అలుసా.......లేక నా ప్రేమ నీకు తెలియకన??
రోజు రోజు కి నాలో ఒంటరితనం ఎక్కువ అవుతుంది,
అది నీ వల్లే................

Monday, March 25, 2013

ప్రేమ+దైర్యం=నేను



మాటల్లో చెప్పలేనంత ప్రేమ,
కంటికి కనిపించనంత ప్రేమ,
ఉహకు అందనంత ప్రేమ,
నేను చచ్చాక కూడా ప్రేమించెంత ప్రేమ,
నీ మనసు  "ముళ్ళ" కంచె అని తెలిసి కూడా ప్రేమించెంత ప్రేమ నాది..
నువ్వు నా కంఠం పట్టుకొని వద్దన్నా కూడా నిన్నే ప్రేమించెంత ప్రేమ,
నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను కాని,
ఎంత ప్రేమో...   చెప్పగలిగాను, చూపించగలను కూడా
నువ్వు వద్దన్నా నాకు కావలసింది నేను తీసుకుంటాను,
నువ్వు దూరంగా ఉన్నా, ఎప్పుడు నాతోనే ఉంటావనే కల(కాదు నిజం)
నాది స్వచ్చమైన ప్రేమ, నిజాయితితో కూడుకున్న ప్రేమ,
ఇంకా నా ప్రేమను ఎన్నో రకాలుగా చూపించగలను,
నీకు చూసేంత దైర్యం ఉంటే....ఉందా?

Saturday, March 23, 2013

పెళ్లి రోజు శుభాకాంక్షలు...





అది 2010, మార్చ్ 24th, శ్రీరామనవమి
గుడిలో సీతారాముల కల్యాణం,
అదే రోజు ఆంజనేయస్వామి గుడిలో మన కళ్యాణం,
మీ ఇంట్లో వాళ్ళను కాదని, నన్ను నమ్మి నాతో వచ్చి తాళి కట్టించుకున్నావు
ఈ సంఘటన జరిగి 3 సంవత్సరములు అవుతోంది,
ఈ జరిగిన 3 సంవత్సరములలో మన మధ్య ఎన్నో  చేదు, మరెన్నో  తీపి జ్ఞాపకాలు
అందులో ముక్యంగా చెప్పుకోవలసిన విషయం మన ప్రేమకు ప్రతిరూపం మన పాప త్వితిక,
ఇంకా చేదు విషయాలకు వస్తే అబ్బో చాలానే ఉన్నాయి, కాని గతం గతం
ఏది ఏమైనా మనకు పెళ్లి జరిగి 3 సంవత్సరములు గదిచాయి.
ఈ శుభ సందర్భంలో నీకు, మన ప్రేమకు, మన పెళ్లి రోజు శుభాకాంక్షలు
happy 3rd marriage anniversary day......

 
29501