skip to main |
skip to sidebar
ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా దానికి గొప్ప నిర్వచనమే ఉంది. ప్రేమ అనే రెండు అక్షరాలు మనిషి మదిలో ఎంతటి అలజడిని సృష్టిస్తాయో తెలియంది కాదు. పుస్తకాల్లో చదివిన లైలా, మజ్ను, దేవదాసు, పార్వతీ కథలు సజీవమై నేడు అందరి నోటిలో నానుతున్నాయంటే కారణం అది ఖచ్చితంగా ప్రేమకున్న బలం. లైలా, మజ్ను, పార్వతీ, దేవదాసుల కథ నిజం కాదని అది ఓ రచయిత ఊహ మాత్రమే అని తెలిసినా ప్రేమ అనగానే ఆ రెండు ప్రేమలు మాత్రమే ఉదాహరణలుగా మన నోటి నుంచి వెలువడుతాయి. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేదే ప్రేమ. అదే ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసుండటానికి వారధి. అదే లేనప్పుడు మనం ఎన్ని చేసినా దండగ. అయితే జీవితంలో కలిసి ఉండటానికి ప్రేమ కావాలి. కానీ ప్రేమ ఒక్కటే జీవితం కాకూడదు
ప్రేమించేటప్పుడు అన్నీ అందంగానే కనబడుతాయి. ఇద్దరిలో ఉన్న లోపాలు సైతం అన్నీ సక్రమంగానే కనబడతాయి. ఆర్థిక సమస్యలు ఏముందిలే... పెళ్లయ్యాక సర్దుకొంటాయి.. మారిపోతాయి ప్రేమలో ఉన్నప్పుడు యువతీ, యువకులకు ఉండే భ్రమలు. ఇద్దరి ప్రేమ పెళ్ళిదాక వెళుతతుంది. అయితే పెళ్లిని పెద్దవాళ్లు అంగీకరించనప్పుడు మరింత నరకంగా ఉంటుంది. ఇరు కుటుంబాల నుంచి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ ఎలాంటి సాహాయమూ ఉండదు. కాబట్టి ఇద్దరూ మానసికంగా స్థిరంగా ఉండాలి. అలాంటప్పుడే ఆర్థిక సమస్యలను సునాయాసంగా ఎదురుకోవచ్చు. ప్రేమికులు ఎప్పుడైనా అవతలి వ్యక్తిలో మీకు నచ్చనిదేదైనా ఉంటే ముందే చెప్పాలి. పెళ్లి తరువాత మార్చుకుందాం అనుకుంటే కుదరదు.
పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. పెళ్లి తరువాత కూడా అలాగే స్వీకరించడానికి ప్రయత్నించాలి. పెళ్లవ్వగానే ఉన్నట్టుండి ఏ మార్పులూ జరగవు. దూరంగా ఉన్న ఇద్దరు కాస్తా దగ్గరగా ఉంటారు. దాని వల్ల ఒకరినొకరు మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు నచ్చినవి చేసినప్పుడు ఇష్టంగానూ, నచ్చనివి చేసినప్పడు కోపంగానూ ఉంటుంది. మనిషిని దగ్గరగా చూసేకొద్ది వారిమీద అభిప్రాయాలు మారుతూ వస్తూ ఉంటాయి. ఇక ఆర్థిక స్థితిగతుల దగ్గరికి వచ్చే సరికి, ఇద్దరూ ఉద్యోగస్తులైతే సరే. ఒకరే అయితే వచ్చే ఆదాయం అంతే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభంలో ఈ సమస్యలన్నీ ఆనందంగా అనిపించినా పోను పోను ఇవి కష్టంగా అనిపిస్తాయి. ఒక్కోసారి ఎందుకొచ్చిన తంటా అనుకొనే ప్రభుద్దులూ ఉంటారు.
ప్రేమ పెళ్లికి ముందే వీటన్నింటిని గురించి ఆలోచించాలి. ఇక ప్రధానమైనది ప్రేమలో ఉన్నప్పుడు ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది. కానీ పెళ్లి తరువాత అంతా రొటీన్ అనిపిస్తుంది. కాబట్టి అలా రొటీన్‌గా కాకుండా ఉండేందుకు చూసుకోండి. అయితే ప్రతీది ఆర్థిక సంబంధాలతోనే ముడిపెట్టలేం. ఆర్థిక అవసరాలు లేకుండా కూడా ఇద్దరూ ఆనందంగా ఉండాలంటే ప్రతీ విషయం గురించి ఇద్దరు విపులంగా చర్చించుకోండి. ఊహల్లో కాకుండా... వాస్తవంలోకి రండి. ఇక అమ్మాయి కుటుంబం నుంచి పూర్తిగా బయటికి వచ్చేసి ఉంటుంది కాబట్టి అన్నీ కోల్పోయానన్న భావన ఉంటుంది. అది పోగొట్టే ప్రయత్నం చేయండి. ఆర్థిక సమస్యల గురించి పూర్తిగా వివరించండి. ఒంటరిగా ఉండి విసుగు కూడా వస్తుంది. ఆమెనూ ఉద్యోగానికి పంపండి. ఆర్థిక సమస్యలే కాకుండా, ఆమెకు ఒంటరితనం పోతుంది. ఇద్దరి మధ్యా అన్యోన్యత పెరుగుతుంది.
29501
3 మీ మనసులోని మాటలు:
ఒక తొందరపాటు నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది...నేను "నేను"గానే బ్రతకాలనుకోవడం తప్పా? ప్రేమలో ఉన్నప్పుడు నేను ఎదిచేసిన తనకు నచ్చేది....కాని పెళ్ళయ్యాకే..........?????(నా జీవితం)??? లా మిగిలిపోయింది. ఏరి, కోరి, పోరాడి పెళ్లి చేసుకున్న పాపానికి అన్నీ రకాల నరకయాతనలు అనుభవిస్తున్నాను.......నేను చనిపోయక యమలోకంలో యముడు నాకు ఎటువంటి శిక్ష వేయాలో ఆలోచించడానికి మళ్ళి నన్ను భూలోకానికి పంపుతడేమో...
బాగా చెప్పారు...కానీ అలా ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి.
chinche vaalu chinchutaru, chinchaleni vallu chirigi potaaru.........
thanx for comment aniketh
Post a Comment