RSS

Thursday, April 19, 2012

అమ్మ....నాన్న.....







అమ్మ,నాన్న.... మీకై చిరు కానుక


తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.....
ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న....


కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అమ్మ....కాళ్ళ మీద నిలబడే వరకు కనుపాపలా కాపాడుతాడు నాన్న...


రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ....
ఎంతటి కష్టాన్ని అయినా ఆనందంగా భరిస్తూ బిడ్డలకి సంతోషాన్ని పంచుతాడు నాన్న....


తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ....
అప్పు చేసి అయినా పిల్లల భవిష్యత్తు ని అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న...


ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ...
మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న....


అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ....
జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప....


వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా.....
ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా ... ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దితున్న మా అమ్మ,నాన్నలకి నా ఈ చిరు కానుక...

అమ్మ , నాన్న ను ప్రేమించండి ... మనస్పూర్తిగా వారు అనుకోని సమయాల్లో మనతో ఏమైనా అన్నా .. మన మంచి గురించే
వాళ్ల దృష్టిలో ఎంత ఎదిగిన మనం చిన్న వాళ్లమే ...
ఎప్పుడూ .. వాళ్లను విడిచి దూరంగా , చూడకండి ...
ప్రేమించండి .. అవధులు లేకుండా..... మీరు పెద్దగా సంపాదించి ఇవ్వకపోయినా .. ప్రేమగా వాళ్లతో ఉంటే చాలు ..
 ... అమ్మ నాన్నలను ప్రేమించండి ...

10 మీ మనసులోని మాటలు:

శృతి said...

Super...

జలతారు వెన్నెల said...

Well said! బాగుంది.

Unknown said...

thanx shruti & జలతారువెన్నెల gaaru.....

saikiranmai said...

me kavitha nenu copy chesukovacha sir

saikiranmai said...

thallidamdrula gurimchi chepina anni kavithalani copy chesuko vacha cha bagunayi mi kavithalu ..

Unknown said...

saikiranmai......miku nachina kavitalanni copy chesukovachu

saikiranmai said...

tnx https://www.facebook.com/ammapremagoppadi
ee page kosam chesanu .

Unknown said...

@saikiranmai

ok, very nice

Unknown said...

Naa manasulo mata enta swastanga telipina niku naa joharulu,
amma nana ante mana prana datha ani ee lokamantatiki chati chepali sir,
eekalam lo pelli ainaka amma nanani evaru patinchu kovat ledu sir, alla valani marchali sir

Unknown said...

thanx Harikrishna janni gaaru,

eppatikaina tallidandrulapremanu vela kattalemu kada...........

Post a Comment

 
29501