RSS

Saturday, March 28, 2015

నీవై పోయాను....




ప్రతి క్షణం నీకు దూరం
అవుతున్నానని అనుకున్నా 
కాని ప్రతి క్షణం నీ ఆలోచనలతో  
నీకు మరింత చేరువ అవుతున్నానని తెలుసుకోలేకపోయాను 
భరించలేని భాదను, పట్టరాని ఆనందాన్ని ఒకేసారి అనుభవిస్తున్నాను 
నాలా నేను లేను, నీ ప్రేమలో పడి నన్ను నేను మరచి 
నీవై పోయాను 
ఎదురు చూసే ప్రేమలో తియ్యదనం ఉంటుందని నేర్చుకున్నాను
నీతో గడిపిన ప్రతి క్షణం నాకో స్వర్ణ యుగం
నీ రూపం ఒక వరం
నా మనసే నీ వశం..........  




తనకు మాత్రమె........



మనసు తెలిపేటి భావాలతో
నా చెలియ అందాలను
ఆణువణువూ వర్ణించాలని నా ఆశ......
కాని నా చెలియ అందాలను
కలంతో రాయలేను, పదాలతో వర్ణించలేను, కాని 
నా చేష్టలతో తనకు మాత్రమె చూపించగలను





ప్రేమకు అంతం లేదు.........




ప్రేమ సఫలమైతే మంచి కాపురం అవుతుంది
విఫలమైతే మధుర  కావ్యమవుతుంది
ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ
విషాదాంతలే అని అంటారు కదా
అనతoమైన  ప్రేమకు అంతం లేదు
విషాదం అంతకన్నా లేదు
స్మరించినకొద్ది  ప్రేమ మధురం

పెళ్లి రోజు శుభాకాంక్షలు........






 అది 24th మార్చ్  2010,
శ్రీరామ నవమి,
గుడిలో పంతులు చేతుల మీదుగా రాములోరి లగ్గం 
నాది పంతులు లేకుండా అదే రాములోరి గుడిలో నా లగ్గం 
ఈరోజుకి నాకు పెళ్లి అయ్యి 5 సంవత్సరములు పూర్తి అయ్యయి. 
ఈ 5  సంవత్సరములలో నా జీవితంలో ఎన్నో చేదు... 
మరెన్నో తీపి జ్ఞాపకాలు.......... 
అందులో బయటకు చెప్పేటివి కొన్నైతే, చెప్పలేనివి మరెన్నో 
ఏది ఏమైనా, జీవితం అనేది తీపి చేదు జ్ఞాపకాల సమ్మేళనం అని నేర్చుకున్నాను    

Friday, March 13, 2015

హాయ్....





నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు నా యొక్క నమస్కారములు,
ఇన్ని రోజులు మీతో చాల విషయాలు పంచుకోలేకపోయాను, ఇప్పటినుండి 
గడిచిన నా జీవితంలోని సంఘటనలను మీతో పంచుకుంటాను

Saturday, August 10, 2013

ఎలా విడవను

 
 
 
నువ్వు నన్ను విడిచిన క్షణాన....
నా కన్నీటి బొట్టులో నువ్వు కనిపించావు... 
ఆ కన్నీరు ఆవిరైపోతుంటే తట్టుకోలేని....
నా హృదయం ఊపిరి విడవమంది....
ఆలోచించు....
నా ఊపిరిగా ఉన్న నిన్ను, మరలా ఎలా విడవను

Monday, August 5, 2013

స్నేహితుల రోజు....



‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి’అని
ఓ కవి అంటే, ‘స్నేహమేరా జీవితం...
స్నేహమేరా శాశ్వతం’ అన్నాడు మరో
కవి. ఎవరైనా స్నేహాన్ని అంతలా
పొగుడుతూ పాటలు రాశారంటే
అందులోని మాధుర్యాన్ని
అర్థం చేసుకోవచ్చు.
స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్ట
కాదు. అంతటి త్యాగం చేసే
స్నేహితుణ్ణి పొందటమే కష్టం.
కొన్ని స్నేహాలు పారిజాతాలు.
కొన్ని స్నేహాలు గులాబీలు.
కొన్ని స్నేహాలు కాగితం పూలు.
కొన్ని స్నేహాలు నైట్ క్వీన్లు.
కొన్ని స్నేహాలు ఆకుపచ్చని సంపెంగలు.
కొన్ని స్నేహాలు కలువపూలు.
కొన్ని స్నేహాలు చంద్రకాంతలు.
కొన్ని స్నేహాలు సన్నజాజులు.
కొన్ని స్నేహాలు బంతులు,చామంతులు
కొన్ని స్నేహాలు కనకాంబరాలు.
కొన్ని స్నేహాలు పొద్దుతిరుగుళ్ళ
ఇలా ఎన్ని రకాల స్నేహాలు ఉన్నా
నిజమైన స్నేహితులకు తెలిసిన
మంత్రమొక్కటే --
ప్రపంచం తలక్రిందులైనా...వీడకుండా నిలవటం.
కొందరినైనా అలాంటి స్నేహితులను
నాకిచ్చినందుకు భగవంతునికి
కృతజ్ఞతలు తెలుపుతూ..
స్నేహితులందరికి స్నేహదిన శుభాకాంక్షలు..!

జీవిస్తు... మరనిస్తున్నాను..

 
 
గుండెలోని బాధలే
కళ్ళలోన కన్నీరై పొంగుతుంటే
ఆత్మాభిమానమే బయట పడనీయక  పోతే
అవి గుండెలోని ఆవిరి ఇంకిపోక
మనసులేని మనిషిలా జీవిస్తున్నాను
జీవిస్తు... మరనిస్తున్నాను.. 

నన్ను నేను కాల్చుకున్నాను .............



ప్రేమ లో పడ్డ మనిషినే మారాను ,నిదురను వదిలి
నిన్నే తలిచాను........
మనసు మాట వినక ,నీ  ప్రేమ గుడిలో
చేరలేక ...............
నీ గుండె తలుపుల
కోసం ఎదురుచుసను ...........
చివరివరకు చెప్పలేక
నన్ను నేను కాల్చుకున్నాను .............
భగవంతుడు నన్ను చేరి వరము ఇస్తే,
నీ హృదయములో చేరాలి అని కోరుకుంట ..........

Saturday, August 3, 2013

నీ ద్యాస ఆగదు...



ఇందుకా ప్రియా నేను నీకు దూరమైనది,
ఇన్నాళ్ళు మూగగా ప్రేమించింది,
నా ప్రేమను నా గుండెల్లోనే దాచుకున్నది,
నీ పైగల ఆరాటాన్ని కనురెప్పల మాటునే అణగదొక్కుకున్నది
నీ చిరునవ్వే నాకు చాలని,
అలా నిన్నే తలచుకుంటూ.. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని,
నీ ఆనందంలో నా సంతోషం చూసుకుంటున్నాను
నీ గెలుపులో నా చిరునవ్వును వెతుకుంటున్నాను
ఇలా అజన్మాంతం నిన్నే పిచ్చిగా.. మూగగా ....
ఆరాదిస్తూ ప్రేమిస్తూ బ్రతుకుదామనుకుంటే
ఎందుకు చేసావిలా ..........
ఇందుకేనా నన్ను నేను నీకు దూరం చేసుకున్నది
చివరకు నా బ్రతుక్కి అర్ధం లేకుండా చేసావుగా?
నా ఉపిరి ఆగినా నీపై ప్రేమ ఆగదు
ఈ కట్టే కాలిపోయే వరకు నా మదిలో నీ ద్యాస ఆగదు...
 
29501