RSS

Thursday, November 29, 2012

పరిచయం....!



కొందరి పరిచయం కొద్ది రోజులు మాత్రమే
ఆ పరిచయం ఎన్ని రోజులు మనతో ఉండగలదో చెప్పలేము....
కాని కొద్ది రోజుల్లోనే దగ్గరైన కొందరి పరిచయం
జీవితాంతం మరచిపోలేము....
మరికొందరి పరచయం కొద్ది రోజుల్లోనే మరచిపోతాము!
కాని మన పరిచయం ప్రేమకు దారి చూపింది
ప్రేమకు దారి చూపిన మన ఈ పరిచయం వానలో గొడుగు లాంటిది
(ఇంకా ఇలా పోల్చడానికి చాలానే ఉన్నాయి)
నీను జీవితాంతం గుర్తుంచుకుంటాను.........

Friday, November 23, 2012

అర్ధం కాని ప్రశ్నలు....




ప్రాణం పోసిన అమ్మ కావాలా
ప్రేమ పంచిన అమ్మయి కావాలా
అని ప్రశ్నించే ఈ లోకం తీరు మారేదెప్పుడు....?
ప్రాణాలు పోసేదే ప్రేమ కాని
ప్రాణాలు తీసేది ప్రేమ కానే కాదు నువ్వు గ్రహించేదేప్పుడు ....?
ఓ "వ్యకి" ప్రేమ పేరుతో పిచోల్లని చేసి
ప్రాణాలతో చెలగాటం ఆడకుండ ఉండేదెప్పుడు ....?
మనవాళ్ళు అని అనుకునే మనిషి
మనల్ని మోసం చేయకుండా ఉండేదేప్పుడు.....?
ఇష్ట పడే వాళ్ళని పట్టించుకోకపోయినా
పరువాలేదు గాని అసహ్యించుకోకుండ ఉండేదేప్పుడు....?
అర్ధం చేసుకోని అమ్మాయి కోసం చావడం మానేసి
అనురాగం పంచెవాళ్ల కోసం బ్రతకడం నేర్చుకునేదేప్పుడు..?
ఒక కన్ను ఏడిస్తే రెండో కన్ను కూడా ఏడవకుండా ఉండేదేప్పుడు....?
నా గుండె చప్పుడు నీకోసమే అని నీకు తెలిసేదేప్పుడు ...?
నువ్వు నాకు దగ్గరగా లేకపోయిన......
నాలోనే నువ్వున్నావని నీకు తెలిసేదెప్పుడు....?
ఈ లోకంలో అన్నింటికన్నా విలువైనది నీ చిరున్నవే అని నీకు తెలిసేదెప్పుడు....?
అయ్యబాబోయ్ నా జీవితం అంతా ? మార్కేనా.... 

Wednesday, November 21, 2012

ప్రశాంతత కోల్పోయాను......!!





మనసు ప్రశాంతం గా ఉండాలంటే మనసులో దిగులు ఉండకూడదు
మనసులో దిగులు లేకుండా ఉండాలంటే మనిషికి భయం ఉండకూదదు
మనిషి భయం లేకుండా ఉండాలంటే తప్పులు చేయకూడదు
తప్పులు చేయకుండా ఉండాలంటే అత్యాశ ఉండకూడదు
అత్యాశ లేకుండా ఉండాలంటే స్వార్ధం ఉండకూడదు
స్వార్ధరహితంగా ఉండాలంటే అతిగా ప్రేమించకూడదు
ప్రేమించకుండా ఉండాలంటే మనసు ఉండకూడదు

అసలు మనసే లేకుండా ఎలా ఉండాలో అర్ధం అవ్వక ప్రశాంతత కోల్పోయాను!!

Monday, November 19, 2012

నువ్వే....!



అమ్మాయి ఎడిచిందంటే...
సవాలక్ష కారణాలుంటాయి.
అబ్బయి ఎదిచాడంటే
ఒకే ఒక కారణం ఉంటుంది......ఆమె !

Friday, November 16, 2012

చంపుతావో......ప్రేమిస్తావో..



ఒకప్పుడు నీ మాటల సవ్వడి నా గుండెకు ఊపిరి,
కాని ఇప్పుడు నీ మాటలు వింటుంటే నా గుండెకు అలజడి,
ఒక్కసారి బాగానే మాట్లాడుతావు, మరొకసారి కసురుకుంటావు..
ఎందుకిలా....???నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా...లేక వేదిస్తున్నావా.....
ప్రేమ అంటే ఇంతేనా? ప్రేమకు అంతం లేదంటారు....కాని
నీ మాటలు, తూటాలుగా నా గుండెను గాయపరుస్తుంటే.....
ప్రేమించన ప్రేమే నన్ను చంపెస్తున్నట్లుగా ఉంది.
చంపెంత ప్రేమ నీకుంటే, చచ్చేంత ప్రేమ నాకుంది.
చంపుతావో......ప్రేమిస్తావో....నీ ఇష్టం.....

Thursday, November 15, 2012

నన్ను మరిచి....నీవుగా మిగిలిపోయావు...





అలజడుల హృదిలోకి నువ్వొచ్చి
గుండె స్పందనల్ని కవ్యమ్గా మలచి
మనసులో మమతలెన్నో పెంచి
అక్కరకు రాని ఆలోచనలను ప్రక్కన బెట్టి
జీవనానికి అవసరమయ్యే జ్ఞానమిచ్చి
శ్వాసకు ఉపిరిపోసి
బ్రతుకుకు ఉరతనిచ్చి
ఆనందప్రేమసగారంలోకి తీసుకేల్లవు
నన్ను మరిచి నీవుగా మిగిలిపోయావు.

Monday, November 12, 2012

హార్ట్ టచింగ్.....






రాష్ట్రంలో విపరీతమైన కరెంట్ కోత!
ప్రియా....
ఒక్కసారి కాదు.....రోజంతా నవ్వు.
నీ నవ్వుల వెలుగులో
కోట్ల మెగావాట్ల కరెంట్ జనరేట్ అవుతుంది.....

Friday, November 2, 2012

అర్ధం కాని ఆడ మనసు.....




ఆడవారి మనసుకు ,
                       మగవారంటే   అలసు ,,,,,,,?

కోరిచేరువైతే   తాను   దూరమవుతుంది ..........?

వద్దని   విదిచివెల్లితే  ,

                   వెంటపడి  వేదిస్తుంది ,,,,,,,,,,?

కల నీవల్లే.... శిల నీవల్లే






తడి నిoపుకున్న   మేగంలా
నీ  ప్రేమ   కురిసేదెప్పుడు వర్షంలా !!
బండ  రాయీ సైతం పగలగొడితే పగులుతుంది
కాని  అంత   కంటే   కటినమైనదా  నీ  హృదయం !!
ఎన్ని   విదాలుగా   ప్రయత్నించిన
కరగనే   కరగదా  నీ మనసు !!
నా మనసు  నీకై అర్పిస్తానంటే....
నా  ప్రాణమే నీ చేతిలో  పెడతానంటే...
నాకు దూరంగా  వెలతావెందుకు రోజంతా !!
నేటి  రోజులో   నిన్ను   తలచుకుని
నిన్నటి రోజంతా మరచి పోయా !!
కమ్మని  కలతో కరిగించావు నా మనసును
కాని  ఆ కలలోనే శిలను చేసావు నా మనసును !!
 
29501