Thursday, February 25, 2010
ప్రేమ పుట్టుకకు కారణం..........
కళ్ళు నావి
చూపు నీది
పెదవి నాది
మాట నీది
గుండె నాది
శ్వాస నీది
మనసు నాది
అలజడి నీది.........
ఇదేనేమో నీకు నాకు మధ్య ప్రేమ పుట్టుకకు కారణం
ప్రేమంటే ఇదేనా.....
రోజంతా సుఖం లేదు
రాత్రి అంత నిదుర లేదు
శ్వాసకు చోటు లేదు
మనసుకు నిలకడ లేదు
ఓ దేవుడా.....ప్రేమంటే ఇదేనా.....
మరచుట తెలియదు..........
గాలికి భయం తెలియదు
ప్రాణానికి పుట్టుక తెలియదు
గుండెకి అలసట తెలియదు
తల్లి ప్రేమకు స్వార్ధం తెలియదు
నా ప్రేమకు మరచుట తెలియదు
Thursday, February 18, 2010
ప్రేమదేలయన్న.....
'గోపి....నాలో ఏం చూసి ప్రేమించావు నువ్వు?' గోముగా అడిగింది రాధ. 'గోపి' అనేది మాటవరసకు పెట్టిన పెరేగాని....ఆ స్థానంలో ఉండే ప్రతి ప్రేమికుడికీ ఏదో ఒక దశలో ఎదురయ్యే ప్రశ్నే ఇది. ప్రేమని మాటల్లో వర్ణించడమే కష్టం అనుకుంటే 'నన్నెందుకు ప్రేమించావు' అండ్ అవతలివ్యక్తి అడిగితే టక్కున సమాధానం చెప్పడం మరీ కష్టం....
కృష్ణ శాస్త్రి అంతటివాడే.....
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లే చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పుల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
....... అంటూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక చేతులేత్తేశాడు.. ఇక మాములు మనషుల సంగతి చెప్పేదేముంది. ప్రేమ ఎప్పుడు ఎవరిమీద ఎందుకు కలుగుతుందో ఎవరు చెప్పలేరు. అందం, తెలివి, డబ్బు, కులం, హొదా...వేటితోనూ దానికి పని ఉండదు. మనసైన మనిషి కనపడగానే హృదయస్పందన పెరుగుతుంది. ఎదలోతుల్లో ఏదో తీయని భావం అలజడి రేపుతుంది. ఒకరికొకరు సన్నిహితంగా ఉండాలనే తహతహ పెరుగుతుంది. ప్రియురానిలి/ప్రియుడిని విడిచి పెట్టి వెళ్ళాలంటే ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది.
ఎందుకిల అవుతుందంటే....'అప్పుడు శరీరంలో అనేక రసాయన మార్పులు జరుగుతాయి.. అడ్రినలిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు స్రవిస్తాయి...' అంటూ సైంటిస్టులు రకరకాల కబుర్లు చెప్పోచ్చుగాక! కాని అవన్నీ ప్రత్యేకంగా ఒకరిని చూసినప్పుడు మాత్రమే ఎందుకు కలుగుతాయి, అందరికి సాదారణంగా కనిపించే వ్యక్తి ఒకరికి మాత్రమే అంత ప్రత్యేకంగా ఎందుకు కన్పిస్తారు......అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు...ప్రేమికు మాత్రం ఇట్టే చెప్పేస్తారు.."ప్రేమకు కారణాలు ఉండవు" అని!
(గమనిక: ఇది ప్రేమికులరోజు నాడు ఈనాడు ఆదివారం సంచికలో నుండి సేకరించినది)
ప్రేమా నీకు వందనం.......
రాతిబండ లాంటి నన్ను నీ ప్రేమతో....."పండు" మంచి బాలుడు అనేలా చేసావు
జీవితమంటే ఇంతే అనుకున్న నాకు...కాదు ఇంకా ఉందని నిరూపించావు
నువ్వు కనుక కరునించకపోయుంటే....ఈ పాటికి నా జీవితం అంతం అయుండేది
నువ్వంటే నాకు ఇష్టం కాదురా.....ప్రాణం
నువ్వు కనపడని రోజు.....నాకు రోజు గడవదు
గాలి నన్ను తాకినా....నీ స్పర్శే అనుకుంటా
గుండెల్లో ఒదిగిపోయిన ఓ ప్రియతమా....
దూరంగా ఉన్నా నన్ను మాత్రం మరవకు
నా ముందు నన్నే కొత్తగా నిలిపిన ప్రేమా నీకు వందనం.......
ఆరాదన.........
రేయంతా నీ కలకై వేచిన నా కన్నులు
తెలవారినా నువ్వు లేని లోకాన్ని చూడలేమంటున్నాయి,
నువ్వు ఉంటే ప్రతి రాత్రి వెన్నెల రాత్రే
నువ్వు లేని పగలైనా అమవాస్య చీకటే.
కను రెప్పలు వాలి పోతున్నా…
కనుపాప నీ రూపాన్నే చూస్తుంది.
గుండె చప్పుడు ఆగిపోతున్నా….
మనసు మాత్రం నిన్నే అరాధిస్తోంది.
Thursday, February 11, 2010
ప్రేమించడం........ ప్రేమించబడడం.......
ప్రేమించడం, ప్రేమించబడడం మనిషికి దేవుడిచ్చిన అపురూపమైన వరాలు,
ప్రతి మనిషి ఎవరో ఒకరి చేత ప్రేమించబడతాడు, మరెవరినో ప్రేమిస్తాడు
కాని తను ప్రాణం కంటే అమితంగా ప్రేమించే వ్యక్తి, తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఒకరైతే?
ఇక ఆ మనసుకి కలిగే ఆనందానికి అవధులు ఉంటాయా???
అలాంటి అవధులు లేని ప్రేమలోకంలో విహరిస్తున్నాను నేను,
ఇప్పుడు చెప్పండి, నా కంటే అదృష్టవంతులు ఈ లోకం లో ఇంకెవరైనా ఉంటారా?
Monday, February 8, 2010
ఇకనైనా నమ్ము ప్రియా.........
నీ ప్రేమే నా జీవితం ,
నీ ప్రేమ సాధనే నా లక్ష్యం ,
ఎంతో నేర్పిన నీ స్వభావం ,
చిరునవ్వునిచ్చిన నీ చిలిపితనం ,
నీ కోసమే నే జీవించాలని చెప్పిన నీ స్నేహం ,
ఏదైనా సాధించగలను అని చెప్పిన నీ ఆత్మస్త్థెర్యం ,
"నువ్వు నాకే సొంతం " అని చెప్పకనే చెప్పిన నీ మౌనం ,
నువ్వు లేనిదే లేదు నాకు జీవితం ,
ఇకనైనా నమ్ము ప్రియ , నీ ప్రేమ సాధనే నా లక్ష్యం .
నా గుండె మీద ఒట్టు....
నా గుండె మీద ఒట్టు....నేను నిన్నే ప్రేమించా
నా మనసు మీద ఒట్టు...నేను నిన్నే పూజించా
నా ఆశ మీద ఒట్టు...నా శ్వాశ మీద ఒట్టు...
ఆ నింగి మీద ఒట్టు....ఈ నేల మీద ఒట్టు
నేను నిన్నే ప్రేమించా....నా చల్లని హృదయంలో నీకు మాత్రమే చోటిచ్చాను.
ఈ జన్మకు నిత్యం నిన్నే ప్రేమిస్తున్న....మరో జన్మకు వరంగా నిన్నే కోరుకుంటున్నా
నన్ను అనుమానించు తట్టుకుంటాను....కాని నా ప్రేమను అనుమానిస్తే భరించలేను
Saturday, February 6, 2010
నీ రూపం నాకొక దీపం..........
ఆకాశం సాక్షిగా నీవెంటే నేనుంట
ఈ నేల సాక్షిగా నా ప్రాణం నీవంట
నీ నీడలాగ నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంట
నీ తోడుగా నేనై పక్కన ఉంటూ నిన్నే చూస్తుంట
నీ రూపం నాకొక దీపం, ఆ వెలుగులో నేనొక ముత్యం
ఆ నింగికి చంద్రుడు ప్రాణం...నువ్వే నా ప్రేమకు ప్రాణం
Thursday, February 4, 2010
ఒకటే పోలిక........
హృదయం ఒక అద్దం లాంటిది
అద్దం ప్రతిబింబమును చూపిస్తుంది
హృదయం ప్రేమను చూపిస్తుంది
కాని రెండింటికి ఒకటే పోలిక
పగిలిన అద్దాన్ని అతికించలేము
విరిగిన మనసును సరిచేయలేము
నిజమైన ప్రేమ.........
అందరు పువ్వును ప్రేమిస్తారు
కానీ పక్కనే ఉన్నా ఆకును వదిలేస్తారు
ఎప్పుడైనా అందాన్ని ప్రేమించకూడదు
ఆనందాన్ని ప్రేమించాలి....మనల్ని ఇష్టపడేవారిని ప్రేమించాలి
ఎవరితో ఆనందంగా ఉండగలమో వాళ్లనే ప్రేమించాలి
అదే నిజమైన ప్రేమ.........
Wednesday, February 3, 2010
హారతి కర్పూరంలా..........
ఒకప్పుడు......
అంతులేని విశ్వాసం ఉండేది నాలో
గట్టు తెగిన గోదారిలంటి ఆవేశం ఉండేది
అప్పుడు నాకు తెలియదు....అదంతా నా వయసు తొందరని
ఆలోచించనివ్వని ఆవేశం...అనుకోని ఇక్కట్లలోకి తోసింది
ఆవేశం మనిషి ఆలోచనల్ని బందిస్తుందని తెలుసుకునే సరికి
నా సగం జీవితం ఖర్చయి పోయింది
వేకువకి వేకువకీ మధ్య ఎన్ని ఆశలో
అవన్నీ అనుభవంలోకి రాకుండానే గడుస్తోంది కాలం...నిశ్శబ్దంగా జారుకుంటోంది కాలం
అరిగేలా నడిచే కాళ్ళకు....కరిగేలా చూసే కళ్ళకు.....తహ తహలాడే తనువుకు తప్ప నీకేం తెలుసు…
నీ కోసం నా హృదయం హారతి కర్పూరంలా కరిగి పోతొందని.
నీకు తెలుసా ప్రియా!
నా ప్రపంచం నీవేనని.... నా కన్న వాళ్ళూ.. నాకయిన వాళ్ళూ నీవేనని!
నా ఊహల్లో ఊసుల్లో.....నా ఆశల్లో – బాసల్లో.....కళ్ళల్లో – గుండెలో
నా మనసులో – మమతలో....నీవేనని… నీకెలా తెలుపను
ఎడారిలో నీటి బిందువును చూస్తే ఎంత ఆనందమో
నా జీవిత పయనంలో నీ తీపి ఙ్ఞాపకాలు అంతటి ఆనందం
నువున్నావన్న ఆలోచనే నాకు వెయ్యేనుగుల బలం
వెళ్ళకు…వెళుతూ.. వెళుతూ…నా హృదయాన్ని గాయపరచకు...నాకు విషాదాన్ని మిగల్చకు
రాత్రి గడుస్తోందటే చాలు.......ఉదయం గురించి భయం వేస్తుంది
మన ప్రేమ నాకు చావు బ్రతుకుల మధ్య యుద్ధం లాంటిది
కళ్లు మూస్తే కలలో...కళ్లు తెరిస్తే ఇలలో
ప్రతి పువ్వులో నీ నవ్వు...అనుక్షణం కవ్విస్తుంటే
స్పందిస్తున్న ఈ గుండె చప్పుడు నీకు వినిపించేదేప్పుడు
నువ్వు నాకు సొంతం అయ్యేదేప్పుడు
Tuesday, February 2, 2010
మానవత్వం మట్టిలో కలిసిపోయింది..............
ఓ చిన్నారి...........
మానవత్వం మట్టిలో కలిపి.....నిన్ను మంటల్లో వేసి
జగమెరుగని నిన్ను....కాటికి పంపించారు
బుజ్జి బుజ్జి మాటలతో....అందరిని నవ్వించాల్సిన నిన్ను
ఎవరికీ అందనంత ఎత్తుకి పంపించారు
నీ బందువులే...నీ పాలిట "రాబందువు"లయ్యారు
నిన్ను బలి తీసుకునే ముందు...ఆ దుర్మార్గులకు వాళ్ళ పసివాళ్ళు గురుతుకు రాలేకపోయారు
నిన్ను బలి తీసుకొని...ఈ సమాజం లో మానవత్వాన్ని చంపేసారు
నీకు-నాకు మధ్య ఎటువంటి సంబందము లేదు.......ఐన నీ మరణం నన్ను కలచివేసింది
నన్ను మాత్రమె కాదు....చిన్నరులంటే ఇష్టపడే ప్రతిఒక్కరి మనసును కలచివేసింది
సహాయం చేయండి.......
ఈ URLC ట్రస్ట్ గురించి చెప్పాలంటే....అమ్మ నాన్న లేని పిల్లల కోసం టెన్త్ తరువాత నుంచి ఎంత వరకు చదువుకుంటే అంత వరకు చదువు చెప్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. మీకు టైం దొరికినప్పుడు ఈ క్రింది వెబ్ సైట్ ని చూడండి URLC ట్రస్ట్ వివరాల కోసం.
http://www.urlctrust.com/
సాయం చేయాలనుకునే సహ్రుదయులందరికి స్వాగతం...
నా ఈ బ్లాగ్ చుసిన ప్రతి ఒక్కరు తమకు తోచినంత సహాయం చేస్తారని కోరుకుంటూ......
మీ
పండు
Monday, February 1, 2010
ఏడు అడుగుల క్షణం.........
నిన్నటి మన పరిచయం,
నేడు నాకు నీ ప్రేమనిచ్చింది.
నీతో గడిపే ప్రతి క్షణం,
నా ఊపిరిగా మారింది..
నేను ఒంటరిగా నీకై ఎదురుచూసే ప్రతి నిమిషం,
మన జ్ఞాపకాలతో గడిచింది....
నీతో కలిసి నడిచే ....ఆ ఏడు అడుగుల క్షణం కోసం ఎదురు చూస్తూ.....
అందమైన అబద్దంలో బ్రతికేస్తున్నా.....
క్షణం ఇంత బాగుంటుందని.....నీతో వున్న క్షణం తెలిసింది
కాళ్ళకు చక్రాలేసుకుని....కాలం రివ్వున పరిగెడుతుంటే ఎలా గడిచిందో తెలియలేదు
నువ్వు నా చెంతకు వచ్చినపుడు.......
నా కళ్ళలోని మెరుపుని....వెళ్ళేటపుడు అదే కళ్ళలోని దిగులుని ఎవరు పట్టించుకుంటారు??
నువ్వు వెళ్ళిపోయాక కల కందామనుకుంట....కాని నిదుర ఎటో వెళ్ళిపోయింది
నీ ఆలోచనల పర్వంలో...ఊహకు వాస్తవానికి మధ్య నలిగి పోతున్న......
ఏది సత్యమో , అసత్యమో తేల్చుకోలేక
ప్రతి క్షణం నీవు నాతోనే ఉన్నావన్న అందమైన అబద్దంలో బ్రతికేస్తున్నా