RSS

Monday, January 25, 2010

మన ప్రేమ.......



మన ఆశ
మన పోరు
మన బాట
మన పాట
మన ద్యేయం
మన పయనం
మన పంతం
మన ప్రాణం
మన శ్వాస.............మన ప్రేమ.

Friday, January 22, 2010

ప్రేమంటే ఇదేరా.....




మనము కలిసిన మొదిటి రోజు నీకు గుర్తుందా.....
అప్పుడు నేనెవరో నీకు తెలీదు....నీవెవరో నాకు తెలీదు
ఆరోజు మన గురుంచి మనం తెలుసుకోవాలి అనుకున్నామో లేదో తెలీదు
కాని మరుసటి రోజు మొదలైంది ఒక చిన్న చిరునవ్వు
తరువాత హాయ్ లు బాయ్ లు......కాని ఇప్పుడు ఓయ్ లు, అరేయ్ లు.....
మన మనసులు కలిసాయి....ఉహల్లో మేఘాలను తెరిగోచ్చాము
ప్రతి రోజును, ప్రతి గంటను, ప్రతి క్షణమును పంచుకుంటున్నాము తియ్యగా
ఈరోజు నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం అన్నట్లుగా బ్రతుకుతున్నాము
ప్రేమంటే ఇదేరా.....

Tuesday, January 19, 2010

గెలుపు లేని ఓటమి.....



గెలుపు లేని ఓటమిని భరిస్తాను
వెలుగు లేని చీకటినీ భరిస్తాను
తీపి లేని విషాన్ని భరిస్తాను
కాని నువ్వు,  నీ ప్రేమ లేని జీవితాన్ని భరించలేను ప్రియతమా.......

Saturday, January 16, 2010

నీ పుట్టిన రోజు...నాకు "పండు"గ రోజు.........





ఆకాశంలొ నుండి ఒక నక్షత్రం నేలపైకి వచ్చిన రోజు,
నిండుచంద్రుడి పండువెన్నెల భువిని చేరిన రోజు,
హరివిల్లు ఆకాశానికి రంగులిచ్చిన రోజు,
మేఘాలు ఆనందంతో చిరిజల్లులు కురిపించిన రోజు,
కోకిలా గొంతు విప్పిన రోజు....ఆ పాటకి నెమలి నాట్యం చేసిన రోజు
నువ్వు నాకు పరిచయమయ్యి ఒక సంవత్సరం గడిచిన రోజు...
అదే నీ పుట్టినరోజు......
గడిచిన ఈ ఒక్క సంవత్సరంలో కొన్ని చేదు...మరికొన్ని తీపి జ్ఞాపకాలు.....
కాని ఈ క్షణం నుండి.....తలని నిమిరే దీవెనలు....చిరునవ్వుల బహుమతులు
మమతలు నిండిన కౌగిళ్ళు.....మనసును తలపించే ఆనందాలు....
అన్నీ నేనై ఇస్తానని మాటిస్తూ........నీకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బుజ్జి.......

Friday, January 15, 2010

కాపాడుకో.....



దొరికిన చోట ప్రేమను వదలకు
లేని చోట ప్రేమను వెతకకు
కావాలనుకున్న ప్రేమను దొరికే వరకు వదలకు
పోగొట్టుకున్న ప్రేమను ఎంత వెతికినా మళ్ళి దొరకదు
ఉన్నా ప్రేమని కడవరకు కాపాడుకో......

Wednesday, January 13, 2010

ఎవరైనా చెప్పగలరా.........???




ప్రేమకు సరైన నిర్వచనం చెప్పగలరా.....????
ప్రేమకు, ఆకర్షణకు తేడా ఏంటి....?
ప్రేమ గుడ్డిద...........?
మనుషుల్లో ప్రేమకు ఉన్నా విలువ ఎంత...?
ప్రేమించడం బలమా..??? లేక బలహీనతా.........???

నా మరణానికి పునాది..........



చంద్రుడు తన ఆకారాన్ని మారుస్తూ ఉంటాడు...
కాని సూర్యుడు తన ఆకారాన్ని మార్చాడు
జీవితం లో ఎన్నో మార్పులు జరుగుతాయి....
కాని మరణం మాత్రం ఆగదు
ప్రక్రుతిలో ఎన్ని మార్పులు జరిగినా....మనుషుల్లో ఎంత మార్పు వచ్చిన.....
నీమిద నాకున్న ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు...
ప్రేమంటే రెండు మనసులు ఆడుకునే అందమైన ఆట....అంతే గాని నవ్వులాట కాదు
నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావో....లేక  పీదిస్తున్నావో అర్ధం అవడం లేదు
నీ మాటలు నా హృదయానికి తుపాకి తుటాల్ల గుచ్చుకుంటున్నాయి ప్రియా
నా మనసు ఎంత సున్నితమైనదో నీకు బాగా తెలుసు......
అన్నీ తెలిసి కూడా నన్ను క్షోభ పెడుతూనే ఉన్నావు ఏదో రకంగా...
నువ్వు  పెట్టె క్షోభ..... నా మరణానికి పునాది .....

Tuesday, January 12, 2010

చీకటి ప్రపంచం............



నా గుండె గుడిలో దేవతవు నీవు....నా కంటిలో కనుపాపవు నీవు
చిరునవ్వుల నా "బుజ్జి"వి నీవు....నా ప్రాణమై నన్ను మరిపించావు
నువ్వే లేని జీవితం......నా బ్రతుకంతా అయోమయం
నీ ప్రేమను పొందాలని ఎన్నో రోజులుగా ఎదురు చూసాను
ప్రతిక్షణం ఒక యుగంగా గడిపాను
వెన్నలాంటి నీ చిరునవ్వు నాకే సొంతం అవ్వాలని.....ప్రాణంగా కోరుకుంటున్నాను
ఏదైనా బాధ కలిగితే కన్నీరు కారడం సహజం....కాని
నీకు దూరంగా ఉండే ప్రతి క్షణం నా కంట్లో నీరు సెలయేరుగా పారుతుంది
నీకు దూరంగా ఉండే ప్రతి క్షణం నా జీవితం నరకం కన్నా హీనం
ఎటు చూసినా...ఏమి చేసిన...నా మనసు నీ ద్యాసలోనే....
నా శ్వాసతో రగిలే గాలిలో నీ రూపాన్ని చూసుకుంటున్న
నువ్వు కనపడని రోజు.......నాకు చీకటి ప్రపంచం లాంటిది.....

Monday, January 11, 2010

నీ ద్యాసను..........



కలవంటున్న.....శిలవంటున్న.....నీ తోడునీడై నేనుంటున్న
మాటఅంటున్న.....మాటవింటున్న.......నీ ద్యాసను మాత్రం మర్వలేకున్న
మొదటిసారి చూసాను మొహమాటంగా.....మరుక్షణమే మనసిచ్చాను నిర్మొహమాటంగా
వరమిచ్చిన దేవతా......ఉరిమి చూడకు.....
కలలో నీ చిత్రం బందీ చేసి.....కలవర పడుతున్న ఆత్రంగా.....
నలువైపులా నిన్ను వెతుకుతూ ఉండగా.......నా పెదాలపై చిరునవ్వులా నీ రూపాన్ని దర్శనమిచ్చావు

నువ్వు లేక నేను లేను.......




నువ్వే నా చెంతనుంటే నిలువనంటుంది నా ప్రాయం
నువ్వే నా ప్రాణమై దరి చేరమంటుంది నా హృదయం
నువ్వే తోడై ఉంటే నాకెందుకు అంటుంది ఈ ప్రపంచం
నువ్వే నీడవై ఉంటే నా ప్రపంచమే స్వర్గలోకం
నువ్వే నా ముందు ఉంటే మరి నిలవనంటుంది ప్రాణం
నువ్వే కనుమరుగైతే.....మరి కదలనంటుంది ఈ సమయం
నువ్వు లేక నేను లేనని నమ్మవా నా ప్రియా సఖియా......

నీవుగా మిగిలిపోయాను.....



నా అలజడుల మనసులోకి నువ్వొచ్చి
నా గుండె స్పందనల్ని కావ్యంగా మలచి
నా మనసులో మమతలెన్నో పెంచి
నాకు అక్కరకు రాని ఆలోచనలను ప్రక్కన బెట్టి
నా జీవనానికి అవసరమయ్యే జ్ఞానమిచ్చి
నా శ్వాసకు ఉపిరిపోసి
నా బ్రతుకుకు ఉరటనిచ్చి
ఆనంద ప్రేమసగారంలోకి తీసుకేల్లవు
నేను నన్ను మరిచి నీవుగా మిగిలిపోయాను.....

Wednesday, January 6, 2010

నవ్వుల కిలకిలా...........



నీ మాటల గలగలా
నవ్వుల కిలకిలా
వినకుంటే నా మనసు విలవిలా
కరగిన కలలే నిలిచిన, విరిసెను నాలో మందారమాల
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను నాలో తీయని జ్వాలా........

నీపై కవితలల్లేందుకు............



నీవంటూ లేకుంటే...
నాకోసం రాకుంటే...
సాగర గర్భంలోనే నిక్షిప్తమైపోయిన ముత్యంలా... నేనూ మిగిలిపోయేవాడిని.

ప్రేమంటూ లేకుంటే...
నీపై నాకది రాకుంటే...
గమ్యమెరుగని పయనంలా... నా జీవనపయనం ఏ చీకటిరాజ్యానికో చేరేది.

నాలో మనసంటూ లేకుంటే...
అందులో నీ తలపే రాకుంటే...
వసంతమెరుగని వనంలా... నా హృదయం సైతం ఏనాడో బీడుగా మారిపోయేది.

కానీ... ఏ దేవుడి వరమో తెలియదుగానీ... ఏ జన్మ సుకృతమో ఎరుగనుగానీ...
మది సామ్రాజ్యానేలే రాణిలా... నా గుండె గూటికి చేరావు. స్వప్న మెరుగని నిద్రలా... చినుకునెరగని ఏడారిలా... సాగిపోతున్న నా జీవితానికి రంగుల లోకానివయ్యావు.

రాయిలాంటి నాలో రాగాలు నింపావు. పలుకే కరువైన నా మది పలికిన తొలి వాక్యానికి ఆది అక్షరం నీవయ్యావు. మాటలైనా రాని నేను నీపై కవితలల్లేందుకు ప్రేరణవయ్యావు. నా నిదురలో మధురమైన స్వప్నానివి నీవయ్యావు.

కమ్మనైన నా తలపుకు జ్ఞాపకానివి నీవైనావు. అందుకే... చెలీ నీకోసం...
నీతలపుకోసం... నీవలపు కోసం... నీతో సాగే జీవన పయనం కోసం... సదా సిద్ధంగా ఉండే నీ... పండు

Tuesday, January 5, 2010

ఒక అమృత కావ్యం..........




జననం ఒక సుప్రభాతం
మరణం ఒక సంధ్యా గీతం
రెండింటి మధ్య జీవితం సుఖ-దుఃఖాల సంగమం
అందులో మన ప్రేమ ఒక అమృత కావ్యం

నీ మనసుకు చూపిస్తా........




ప్రేమ ఎప్పుడు ఎవరిమీద ఎలా పుడుతుందో చెప్పలేం
అలాగే అందుకు తగిన కారణం కూడా చెప్పలేం
కాని నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మాత్రం చెప్పగలను,
చూపించగలను............................. చూడాలనే కోరిక నీలో ఉంటె??
నా అనే నీకు ప్రేమ అనే ప్రపంచాని చుపించలనుకుంటున్నాను!
నా మనసుతో నీ మనసుకు చూపిస్తా !
ఈ ప్రపంచంలో ప్రేమకు తప్ప వేరే దేనికి తావు లేదు, ఉండదు కూడా,
భూ ప్రపంచంలో ఏది కొనాలన్నా డబ్బులు కావాలి,
కాని ప్రేమ ప్రపంచంలో ఏది కావాలన్నా ప్రేమ ఉంటె సరిపోతుంది
అది నాదగ్గర నీకు కావల్సినంత ఉంది.! కాదు లేదు అనకుండా ఇస్తాను
ఏమి కావాలో అడుగు, క్షణం లో నీ ముందు పెడతా
ఒక్కొకరు ఒకోలా తమ ప్రేమను తెలియచేస్తారు
కాని నా ప్రేమను నీకు ఇంతకన్న మంచిగా తెలపగాలనో లేదో...........
కాని ఇంత కన్నా ఎక్కువ ప్రేమను మాత్రం ఇవ్వగలను

Saturday, January 2, 2010

నా జీవిత గమ్యం...........



నా ఆశకు శ్వాస నీ ప్రేమ
నా ఉహకు ఉపిరి నీ ప్రేమ
నా తనువుకు ప్రాణం నీ ప్రేమ
నా జీవిత గమ్యం నీ ప్రేమ
అందరికి ఆదర్శం మన ప్రేమ
నా నమ్మకమే మన ప్రేమకు ధీమా......

నీ అడుగుల్లో అడుగై.........



తొలిసారి నిన్ను చూసి నే మైమరిచా
ప్రతిరేయి ఉహలతో నిన్నే తలిచా
రేయిపగలు నీ అడుగుల్లో అడుగై అనుక్షణం నడిచా
నీ వెచ్చని కౌగిల్లో కర్పూరంలా కరుగుతూ నీ బందినై నిలిచా
దేహం రెండైన ప్రాణం ఒకటేలా ప్రతి నిత్యం నిన్నే ప్రేమించా........

నూతన సంవత్సర శుభాకాంక్షలు........



12 నెలలు సంతోషంతో
52 వారాలు ఆనందంతో
365 రోజులు విజయంతో
8760 గంటలు మంచి ఆరోగ్యంతో
52600 నిమిషాలు మంచి అద్రుష్టంతో
నువ్వు నాతో గడిపే ప్రతి సెకను, ప్రతిది అందంగా, ఆనందంగా
ఉండేలా చూసుకుంటానని భరోసా ఇస్తూ....
నీకు ఇవే నా నూతన సంవత్సర శుభాకాంక్షలు........

అందమైన పయనం...........




నిన్ను చేరుకోవడానికి నేను చేస్తున్న ఈ అందమైన పయనం
నా మనసును పులకరిస్తుంది......ప్రియా.......
మనసు పరవశంతో అందమైన కవిత్వం పలకడానికి ప్రయతినిస్తోంది
కాని ఈ అందమైన అద్భుతాన్ని కవిత్వంగా మార్చలేక మౌనంగా నిలిచింది నా మనసు......
 
29501